ప్రభుత్వ మార్కెటింగ్, సహకార శాఖ సలహాదారునిగా బత్తుల బ్రహ్మానంద రెడ్డి బాధ్యతలు స్వీకరణ
అమరావతి, జూన్ 3 (ప్రజా అమరావతి): ప్రకాశం జిల్లా కారంచేడు మండలం ఎర్రంవారిపాలెం కు చెందిన బత్తుల బ్రహ్మానంద రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ మార్కెటింగ్, సహకార శాఖ సలహాదారునిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 20 న ఉత్తర్వులను జారీచేసింది. తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ మార్కెటింగ్, సహకార శాఖ సలహాదారునిగా బత్తుల బ్రహ్మానంద రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసూదనరావు చాంబరులో ప్రభుత్వ సలహాదారునిగా ఈయన బాద్యతలు చేపట్టారు. వీరీ పదవిలో రెండేళ్ల పాటు గాని లేదా అవసరం ఉన్నంత వరకూ గాని కొనసాగుతారని వీరి నియామక ఉత్తర్వులలో ప్రభుత్వం పేర్కొంది.
addComments
Post a Comment