శ్రీ వేంకటేశ్వర స్వామి ఉన్న ఈ జిల్లాలో టూరిజం మరియు పరిశ్రమలు అభివృధి చేస్తం : పరిశ్రమల మంత్రి జి అమర్నాథ్


 23 న ముఖ్య మంత్రి పర్యటన విజయవంతం చేయండి.


శ్రీ వేంకటేశ్వర స్వామి ఉన్న ఈ జిల్లాలో టూరిజం మరియు పరిశ్రమలు అభివృధి చేస్తం : పరిశ్రమల మంత్రి జి అమర్నాథ్తిరుపతి,జూన్ 19 (ప్రజా అమరావతి): ఈ నెల 23 న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి  జిల్లా లోని శ్రీకాళహస్తి, రేణిగుంట,  మండలాల్లో  పర్యటన సందర్భంగా ఆదివారం ఉదయం శ్రీకాళహస్తి మండలం ఇనగళూరు వద్ద హిల్ టాప్ సెజ్ ఫుట్ వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (అపాచి) సంస్థ కు భూమి పూజ సమావేశ ప్రాంతం మరియు హెలీప్యాడ్ ఏర్పాట్లను, రేణిగుంట విమానాశ్రయం వద్ద ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లకు సంబంధించిన వివిధ యూనిట్లను,  టి సి యల్ (TCL) సంస్థ కు భూమి పూజ ప్రాంతాలను మరియు హెలిప్యాడ్ ఏర్పాట్లు ను పరిశీలించిన  రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని తెలిపారు.


అనంతరం  మంత్రి మీడియాతో మాట్లాడుతూ తిరుపతి జిల్లాను పర్యాటకంగా మరియు పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ నెల 23న శ్రీకాళహస్తి మండలం, ఇనగలూరు గ్రామం వద్ద సుమారు  290 ఎకరాల లో  పదివేల మందికి ఉపాధి కల్పించేందుకు ఎనిమిది వందల కోట్లతో అపాచి సంస్థకు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం, అక్కడ సంస్థ ప్రతినిధుల తో సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

 అనంతరం రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సుమారు వెయ్యి కోట్లతో పదివేల మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఏర్పాటు చేసిన టి సి ఎల్  సంస్థకు సంబంధించి శంకుస్థాపన మరియు వివిధ యూనిట్ల ప్రారంభోత్సవం గౌ ముఖ్య మంత్రి చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహిస్తారని ఇందులో ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొంటారని తెలిపారు.


తిరుపతి జిల్లా లోని రెండు    ఈ యం సి క్లస్టర్ల  పరిధిలో సుమారు 700 పైచిలుకు ఎకరాలలో అభివృద్ధి చేసే కార్యక్రమలో బాగంగా దీనితోపాటు ఈ ప్రాంతంలో ఉన్న ఐ ఐ టి, హైజర్ మిగిలినటు వంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉన్న ప్రాధ్యానత తో  అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. పరిశ్రమలు మరియు ఐ ఐ టి   పరంగా తిరుపతికి ఫోకల్ అయినటువంటి బెంగళూరు, చెన్నై మధ్యలో ఉన్న ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి గారి సూచనలు సలహాలు మేరకు ఈ నెల 23న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించడం అధికారులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. రాబోయే కాలంలో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా  మరియు పరిశ్రమలు అభివృద్ధి   చేయడం జరుగుతుందని తెలిపారు.    

ఇంత అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రికి  ఈ ప్రాంత ప్రజల ఆశీస్సులు ఉండాలన్నారు.

  వీరి వెంట తిరుపతి పార్లమెంట్ సభ్యులు యం.గురుమూర్తి, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, APIIC యం.డి. సుబ్రహ్మణ్యం, జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర రెడ్డి, జెసి డికె. బాలాజీ, ఈ యం సి, సి ఈ ఓ గౌతమి, మంత్రి OSD సింగంసెట్టి మధు, APIIC జోనల్ మేనేజర్ సొన సూహానా, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు  తదితరులు ఉన్నారు.


Comments