మనబడి నాడు నేడు కార్యక్రమం కింద పాఠశాలల్లో చేపట్టిన పనులను నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలి

 :

నెల్లూరు (ప్రజా అమరావతి);


జిల్లాలో  2వ విడత  మనబడి నాడు నేడు కార్యక్రమం  కింద  పాఠశాలల్లో  చేపట్టిన  పనులను  నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాల


ని జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్ చక్రధర్ బాబు,   సంబంధిత అధికారులను ఆదేశించారు.


బుధవారం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు,   విద్యా శాఖ, సమగ్ర శిక్ష, పంచాయతీ రాజ్, మునిసిపల్, ఆర్.డబ్ల్యూ.ఎస్, గిరిజన సంక్షేమ శాఖ,  ఎపిఈడబ్ల్యూఐడిసి  శాఖల ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమై,  జిల్లాలో  మనబడి నాడు- నేడు రెండో విడత కార్యక్రమం కింద   చేపడుతున్న పనుల పురోగతిపై  సమీక్షించి పలు సూచనలు ఆదేశాలు జారీ చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత నిస్తూ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి  పాఠశాలల రూపురేఖలను  మార్చేందుకు నాడు- నేడు  కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, జిల్లాలో  మనబడి నాడు- నేడు రెండో విడత కార్యక్రమం కింద   చేపట్టిన   పనులను  ఈ విద్యా సంవత్సరం ప్రారంభం లోపు పూర్తి చేయాలని  జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు.  మనబడి నాడు- నేడు రెండో విడత కార్యక్రమం కింద   జిల్లాలో మొత్తం 846 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు మరియు 1,151  అదనపు గదుల నిర్మాణానికి  నిధులు  మంజూరు కావడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. 846 పాఠశాలల్లో   123 పాఠశాలలకు సంబంధించి ఇంకా ఎస్టిమేషన్లు జనరేట్ చేయకుండా  పరిపాలన అనుమతులు తీసుకోలేదని, సంబందిత  శాఖల ఇంజనీరింగ్ అధికారులు  ఈ నెల 18వ తేది  నాటికి  వంద శాతం పరిపాలన అనుమతులు తీసుకొని పనులు మొదలుపెట్టాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు. మంజూరైన అదనపు గదుల నిర్మాణాలకు సంబంధించి  రాష్ట్ర  ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నాణ్యతతో నిర్మాణ  పనులు చేపట్టాలని,  స్లాబ్ స్టేజిలో  వున్న పనులు త్వరగా పూర్తి చేయాలని,  స్లాబ్ నిర్మాణం చేపట్టే రోజు ఖచ్చితంగా ఎ.ఈ  లేదా డి.ఈ  స్లాబ్ నిర్మాణ పనులు పర్యవేక్షించి నాణ్యతతో నిర్మాణ పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నాడు నేడు కింద చేపట్టిన  పనులకు సంబంధించిన బిల్లులు  ఎప్పటి కప్పుడు అప్లోడ్ చేయాలని సూచించారు.


ఇటీవల వెలువడిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో   జిల్లాలో 6 వేల మందికి   పైగా విద్యార్దులు  500 పై బడి  మార్కులు సాధించారని, అందులో 1000  మందికి   పైగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్ధులు ఉండటం సంతోషకరమన్నారు. విద్యా శాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలో విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా కృషి చేయాలన్నారు. పదవ తరగతి  సప్లిమెంటరీ పరీక్షలపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు.  ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి  ఎన్నికల విధుల్లో భాగంగా  తొలి విడత జరిగిన  ఎన్నికల శిక్షణా తరగతులకు గైరాజరైన  సిబ్బందికి  షోకాజ్ నోటీసులు జారీచేయడం జరిగిందని, ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు. 


ఈ సమావేశంలో  డి.ఈ.ఓ శ్రీ రమేష్ కుమార్,  సమగ్ర శిక్ష పి.ఓ శ్రీమతి ఉషారాణి, జడ్.పి. సి.ఈ.ఓ శ్రీమతి వాణి, డి.ఈ.ఓ శ్రీ రమేష్ కుమార్,  పంచాయతీ రాజ ఎస్.ఈ శ్రీ సుబ్రహ్మణ్యం, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఎస్.ఈ శ్రీ రంగ ప్రసాద్ రావు, మునిసిపల్,  గిరిజన సంక్షేమ,  ఎపిఈడబ్ల్యూఐడిసి  శాఖ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. Comments