బిసి గురుకులాల్లో నాణ్యమైన విద్య** బిసి గురుకులాల్లో నాణ్యమైన విద్య*

 

** ఇంటర్మీడియట్ పరీక్షల్లో రెండవ సంవత్సరం 91శాతం ఉత్తీర్ణత, మొదటి సంవత్సరం  83.04 శాతం ఉత్తీర్ణత*


** మెరుగైన ఫలితాలు సాధించిన బీసీ వెల్ఫేర్ గురుకులాలు*


** నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన అనకాపల్లి జిల్లా తానాం బాలికల బీసీ జూనియర్ కళాశాల*


** మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ వెల్లడి*


అమరావతి, జూన్ 23 (ప్రజా అమరావతి): బీసి గురుకులాల్లో ఇంటర్మీడియెట్ విద్యను అభ్యశించే విద్యార్థులు ఈ ఏడాది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించారని రాష్ట్ర బీసీ సంక్షేమ, ఐ అండ్ పి.ఆర్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ తెలిపారు.  రాష్ట్ర  ఇంటర్మీడియట్ బోర్డు  పరీక్షా ఫలితాలను ప్రకటించిన నేపథ్యంలో మహాత్మా జ్యోతిబాఫూలే  ఏ.పి. బీసి సంక్షేమ గురుకుల విధ్యా సంస్థల సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నడుపబడే 14 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలకు చెందిన విద్యార్థులు సాధించిన ఫలితాలను ఆయన వెల్లడించారు. ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర విద్యార్థుల్లో 91 శాతం మంది, ప్రథమ సంవత్సర విద్యార్థుల్లో 83.04 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారని ఆయన తెలిపారు. మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు 1,498 లో 1,244 (83.04%) మంది విద్యార్థులు మరియు ద్వితీయ సంవత్సరం  పరీక్షలకు హాజరైన విద్యార్థులు 1,336 లో 1,212 (91%) మంది విద్యార్థులు ఉత్తీర్ణతను సాధించారంటూ వారికి అభినందనలు తెలిపారు. 


అనకాపల్లి జిల్లా తానాం బీసీ (బాలికల)  రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 100% మరియు ప్రథమ సంవత్సరం విద్యార్థులు 97% మంది ఉత్తీర్ణతను సాధించారని ఆయన వివరించారు. అదేవిధంగా తిరుపతి జిల్లా దొరవారిసత్రం బీసీ రెసిడెన్షియల్ (బాలుర)  జూనియర్ కళాశాలకు చెందిన  సీనియర్ ఇంటర్మీడియట్‌ విద్యార్థులు 98.1 శాతం మంది మరియు బాపట్ల జిల్లా  నిజాంపట్నం (బాలురు) జూనియర్ కళాశాల ప్రథమ సంవత్సరం విద్యార్థులు 93శాతం మంది ఉత్తీర్ణతతో మెరుగైన ఫలితాలు సాధించారని ఆయన తెలిపారు. 


జ్యోతిబా ఫూలే ఏపి బీసి సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీ ద్వారా విద్యార్ధులకు నాణ్యమైన విద్యతో పాటు, మెరుగైన విద్యాసదుపాయాలను, మౌలిక వసతులను కల్పిస్తున్నామని,  ఫెయిల్ అయిన విద్యార్దులకు సప్లిమెంటరీ పరీక్షల్లో మంచి ఫలితాలు కోసం కళాశాలలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయని మంత్రి తెలిపారు.


Comments