అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి
వచ్చిన ఫిర్యాదుదారుడు మరల మరల రాకూడదు
స్పందన అర్జీలు తగ్గు ముఖం పట్టేంతవరకు వారం వారం స్పందన కార్యక్రమం ఆయా డివిజన్లలో నిర్వహించడం జరుగుతుంది
జిల్లా కలెక్టర్
కదిరి జూన్1 (ప్రజా అమరావతి): అర్జీ దారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి అని జిల్లా కలెక్టర్ పి. బసంత్ కుమార్ అధికారులనుఆదేశించారు. కదిరి ఆర్డిఓ కార్యాలయము నందు సమావేశ మందిరంలో బుధవారంస్పందన కార్యక్రమం నిర్వహించారు
గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ పి. బసంత్ కుమార్ వినతులు స్వీకరించారు. కలెక్టర్ తో పాటు ఆర్డిఓ రాఘవేంద్ర పలుశాఖ అధికారులు పాల్గొన్నారు.
అర్జిత వచ్చిన బాధితులు జిల్లా కలెక్టర్ స్వయంగా కలిసి తమ సమస్యలు విన్నవించగా ప్రజలు ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ ఓపికతో ఆలకించారు వారిలో మనోధైర్యాన్ని నింపి పరిష్కరిస్తామని భరోసా
ఇచ్చారుఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన గ్రీవెన్స్ పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కదిరి ఓకే స్పందన గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు మంచి చర్య అని, సుదూర ప్రాంతాల నుంచి పుట్టపర్తికి వచ్చి అర్జీ ఇచ్చినా పరిష్కరించాల్సిన బాధ్యత స్థానిక అధికారులదేనన్నారు. ఈరోజు నిర్వహించిన ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నందు స్పందన కార్యక్రమం పై ప్రజలకు నాణ్యమైన సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో డి డిఆర్డిఎ పిడి నరసయ్య , హౌసింగ్ అధికారి చంద్రమౌళి రెడ్డి , పంచాయతీరాజ్ శాఖ అధికారి గోపాల్ రెడ్డి ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ రషీద్ ఖాన్ dpo విజయ్ కుమార్, తాసిల్దార్ లు, ఎంపీడీవోలు సంబంధిత శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు
ఈ రోజు నిర్వహించిన స్పందన క కార్యక్రమానికి సంబంధించిన వినతులు 120 వినతులను స్వీకరించడం జరిగింది
addComments
Post a Comment