తిరుపతి ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లో ఈరోజు మూడు ప్రాజెక్టులకు ప్రారంభించాం.


తిరుపతి (ప్రజా అమరావతి);


*తిరుపతి ఈఏంసీ వేదికపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ప్రసంగం.* 


*ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...:* 


తిరుపతి ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లో ఈరోజు మూడు ప్రాజెక్టులకు ప్రారంభించాం. 


మరో మూడు ప్రాజెక్టులకు శంకుస్ధాపన చేశాం.


టీసీఎల్‌ యూనిట్‌ను ప్రారంభించాం. దాదాపు రూ.1230 కోట్ల పెట్టుబడితో టీవీప్యానెళ్లు, మొబైల్‌ డిస్‌ప్లే ప్యానెళ్లు ఇక్కడ తయారుచేస్తారు. దాదాపుగా 

3200 మందికి ఉపాధినిస్తున్నారు. దీనికి ఈ రోజునుంచి శ్రీకారం చుడుతుంది. ట్రయల్‌రన్స్‌కూడా జరుగుతున్నాయి. ఈ యూనిట్‌లో 80 శాతం ఉద్యోగాలు మహిళలకే ఇస్తున్నాం. 


ఫాక్స్‌లింక్స్‌ అనే మరో సంస్థ యూఎస్‌బీ కేబుళ్లు, సర్క్యూట్‌బోర్డులను తయారుచేస్తోంది. దాదాపుగా రూ.1050 కోట్ల పెట్టుబడితో ఫ్యాక్టరీని పూర్తిచేసింది. దీని ద్వారా మరో 2వేల మందికి ఉపాధిని మన తిరుపతిలోనే కల్పిస్తోంది.


అదే విధంగా సన్నో ఒప్పోటెక్‌ అనే మరో సంస్ధ సెల్‌ఫోన్లు కెమెరా లెన్స్‌లు తయారుచేస్తోంది. రూ.280 కోట్ల పెట్టుబడితో 

ఈ ఫ్యాక్టరీ కూడా పూర్తయ్యింది. తద్వారా 1200 మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది.

మరో నెలరోజులు తిరక్కముందే దాదాపుగా 6400 మంది మన కళ్లముందే ఉద్యోగాలు చేసే పరిస్థితి వస్తుంది. 


ఈ రోజు మూడు ప్రాజెక్టులకు శంకుస్ధాపన కూడా చేశాం. ఇదే ఈఎంసీలో డిక్సన్‌ టెక్నాలజీస్‌ యూనిట్‌కు శంకుస్థాపన చేశాం. దాదాపుగా రూ.110 కోట్లతో ఈ సంస్ధ.. నిర్మాణాలు చేపట్టంది. మరో ఏడాది కాలంలో పూర్తవుతుంది. 850 మందికి ఉద్యోగాలు వస్తాయి.


అదే విధంగా ఫాక్స్‌లింక్‌ ఇండియా లిమిటెడ్‌ కంపెనీ మరో రూ.300 కోట్ల పెట్టుబడి పెడుతుంది. ఏడాదిలో ప్రొడక్షన్‌కూడా స్టార్ట్‌చేస్తుంది. తద్వారా 1200 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. 


ఈ ఈఎంసీకి రాకముందు అపాచీ... షూలు తయారీకి సంబంధించిన సంస్థ వాళ్లు రూ.800 కోట్ల పెట్టుబడితో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నారు. దానికి పునాది రాయి వేశాం. మరో 15 నెలల్లో ఆ ప్రాజెక్టు కూడా పూర్తవుతుంది. దాని వల్ల 

10వేల మందికి ఉద్యోగా అవకాశాలు వస్తాయి.


ఇవాళ అన్నీ కలిపితే మూడు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశాం.

మరో 3 ప్రాజెక్టులనుకూడా ప్రారంభించాం.

వీటి అన్నింటి ద్వారా దాదాపుగా రూ.4వేల కోట్ల పైచిలుకు పెట్టుబడి, దాదాపుగా 20వేల మందికి ఉద్యోగాలు వచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. 


ఇక్కడ యూనిట్లు పెట్టిన వారందరికీ ఒక్కటి చెప్తున్నా.

రాష్ట్ర ప్రభుత్వం మీతో ఉంది. ఈ ఈఎంసీలోనూ, తిరుపతిలోనూ ఎక్కడ పెట్టుబడులు పెట్టినా... అందరికీ ఒక మాట చెపుతున్నా.

ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ఒక్క ఫోన్‌కాల్‌ దూరంలో ఉన్నాం.  కచ్చితంగా ఆసమస్యను పరిష్కరించి.. మా రాష్ట్రంలో మీ ప్రయాణం అద్భుతంగా ఉండేలా చూస్తామని హామీ ఇస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు మీకు అందుబాటులో ఉంటుంది. ఇది మా తరపున మీకిస్తున్న హామీ ఇది. 

అందరికీ అభినందనలు అని సీఎం తన ప్రసంగం ముగించారు.

Comments