అర్హత ప్రాతిపదికన అభివృథ్థి సంక్షేమం అందించటమే మనకు ప్లస్ పాయింట్స్
తెనాలి (ప్రజా అమరావతి);
కుల మత వర్గ పార్టీ వివక్షత చూపకుండా గత మూడేళ్లు సంక్షేమం అభివృథ్థి ని పూర్తి పారదర్శకతతో అందించటమే మన పార్టీకి ప్లస్ పాయింట్స్ అని గుంటూరు జిల్లా YCPపార్టీ ప్లీనరీ అద్యక్షులు మేకతోటి సుచరిత అన్నారు, గురువారం గంగానమ్మ పెట పార్టీ ఆఫీసువద్దగల కన్వెన్షన్ హాలు లో జరిగిన తెనాలినియోజక వర్గ ప్లీనరీ ప్రారంభ సమావేశంలో ఆమె మాట్లాడూతూ జగన్ సదీర్ఘపాదయాత్రలో ఇచ్చిన పార్టీ మేనిఫెస్టో లో 98% అమలు పర్చామని అలవికాని హామీలేమి ఇవ్వకుండా ఇచ్చిన హామీలు అమలు పరచి థైర్యంగా ప్రజల్లోకెళ్ళిఈసారి 175 సీట్లను సాథించాలని పార్టీ కార్యకర్తలకు పిలపునిచ్చారు.
పార్లమెంటు ఇన్చార్జి మోదుగల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ తాను ఓడినా జగన్ CM అవటం తనకెంతో ఆనందం ఇచ్చిందని జగన్ ప్రభుత్వం సంక్షేమం అందించటంలో దేశంలో 29రాష్ట్రాలలో ప్రథమ స్థానంలో ఉందని విద్యతో పేదరిక నిర్మూలన జగన్ లక్ష్య మని ఆసుపత్రులలో బెడ్లు పెంచటంకాదని రోగాలు రాకుండామంచి మంచి ఆరోగ్యం అందించాలన్నారు.తాను తెనాలిMLA చెస్తున్న అభివృథ్థిసంక్షేమానికి ఫిదా అవు తున్నానని తాను మరలా వచ్బేఎన్నికల్లో రంగంలో ఉంటానన్నారు.
ఈ సభకు అద్యక్షత వహించిన స్థానిక MLA A.శివకుమార్ మాట్లాడుతూ అంతకు ముందు రెవెన్యూలో అవినీతి అథికంగా ఉండెదనితాము వచ్చినాకు పూర్తి పారదర్శకత జవాబు దారితనంనిబథ్థతతో 100%లబ్దిదారనికి చెరుతుందని, గతంలో 2019లో ప్లీనరీ సమావేశంలో అనుకొన్న అంశాలు 98%నెరవేర్చామని దీర్ఘకాల ప్రయేజనాలను ప్రజలకు అందించేందుకు తమ ప్రభూత్వం పనిచేస్తుందన్నారు,
అనంతరం విద్య వైద్యం మహిళా సాథికారత ,జగనన్న అందరికీ ఇళ్ళు సామాజికన్యాయం రైతుభరోసా తదితర అంశాలను అంశాలపై జరిగి చర్చావేదిక లో వక్తలు పలు అంశాలు మాట్లాడినారు.
ప్లీనరీ సభ్యుడు వెంకటప్పారెడ్డి ప్లీనరీ అంశాలను ప్రజల్లోకీ తీసికెళ్లాలని సూచించారు.
సుదీర్ఘ సమయం సాగిన ఈ సమావేశంలో గుదిబండి.చిన్న వెంకట రెడ్డి, తెనాలి మునిస్పల్ చైర్మన్ ఖాలేదనశీం , వైస్ ఛైర్మన్లు, MPP లు ,ZPTC లు, కార్పోరేషన్ డైరక్టర్లు పాల్గొన్నారు. బ్రాహ్మణపరిషత్ సేక్రటరీ పురషోత్తమ శర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు.
addComments
Post a Comment