అమరావతి (ప్రజా అమరావతి);
*ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను అమరావతి సచివాలయం పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులకు వివరించిన రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, బి.సి.సంక్షేమం మరియు సినిమాటోగ్రపీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ……*
జగనన్న అమ్మఒడి పథకానికి కేబినెట్ ఆమోదం.
జూన్ 27 న అమ్మఒడి.
43,96,402 మంది తల్లులకు లబ్ధి.
ఇందులో బీసీలు 54శాతం, ఎస్సీలు 21శాతం, ఎస్టీలు 6 శాతం, ఓసీలు 19 శాతం మందికి లబ్ధి.
ఈ ఏడాది(2021–22) అమ్మఒడి కింద మొత్తం రూ.6,594.6 కోట్లు.
కొత్తగా అమ్మఒడి పరిథిలోకి 5,48,329 మంది తల్లులు.
అమ్మఒడి కింద లబ్ధిపొందుతున్న పిల్లలు 82,31,502 మంది.
మన పిల్లలను ప్రపంచంలోనే విద్యారంగంలో అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి అనేక చర్యలు తీసుకొంటున్న ప్రభుత్వం.
బైజూస్ కంటెంట్‌ను 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం.
8వ తరగతి పిల్లలకు ఈ యేడాది నుంచి ట్యాబ్స్ ఇవ్వనున్న ప్రభుత్వం.
ప్రతి యేటా 8వతరగతిలోకి వచ్చే విద్యార్ధులకు ట్యాబ్స్ ఇవ్వనున్న ప్రభుత్వం.
4.7 లక్షల మంది పిల్లలకు ట్యాబ్స్ ఇవ్వనున్న ప్రభుత్వం.
2025లో సీబీఎస్‌ఈ పరీక్షలు రాస్తున్న వారిని సన్నద్దం చేయడం కోసం ఈ కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం.
2022 సంక్షేమక్యాలెండర్‌లో భాగంగా జులై నెలలో అమలు చేయనున్న నాలుగు పథకాలకు కేబినెట్ ఆమోదం.
జగనన్న విద్యా కానుక– జులై 5
వైయస్సార్ వాహనమిత్ర– జులై 13
వైయస్సార్ కాపు నేస్తం- జూలై 22
జగనన్న తోడు– జులై 26 పథకాలకు ఆమోదం.
వంశధార ప్రాజెక్టులో నిర్వాసిత కుటుంబాలకు పరిహారంగా రూ.216.71 కోట్లుకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులకు కేబినెట్ ఆమోదం.
యూనివర్సిటీలు, కార్పొరేషన్, సొసైటీ ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపుజేస్తూ గతంలో మంత్రుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకు తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్‌ఆమోదం.
70 యేళ్లు పైబడ్డ పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ జూలై 1, 2019 నుంచి మార్చి 31, 2020 వరకు ఇచ్చిన ఐఆర్‌ను రికవరీ చేయకూడదని, పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ మరణిస్తే అంతిమసంస్కారాల ఖర్చుల కింద ఇచ్చే మొత్తాన్ని రూ.20 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతూ మంత్రుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకు తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి.
అర్జున అవార్జు గ్రహీత, ప్రముఖ ఆర్చర్ జ్యోతి సురేఖ వెన్నంకు గ్రూప్ 1 సర్వీసు ఉద్యోగం కింద డిప్యూటీ కలెక్టర్ పోస్టులో నియామకానికి సంబంధించి అసెంబ్లీలో పెట్టనున్న బిల్లుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి.
విజయనగరం, రాజమహేంద్రవరం,ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో నిర్మిస్తున్న కొత్త మెడికల్ కాలేజీలలో ఒక్కొక్క కాలేజీలో 706 ఉద్యోగాలు చొప్పున, మొత్తంగా 3530 కొత్త పోస్టులు భర్తీకి కేబినెట్ ఆమోదం.
వైద్యవిధానపరిషత్‌కు సంబంధించిన ఆసుపత్రులలో పడకల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని ఉంచేందుకు వీలుగా అదనంగా మరో 2558 పోస్టులు మంజూరు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు కేబినెట్ ఆమోదం.
ఆక్వాసాగు చేస్తున్న రైతులకు ఊరటగా విద్యుత్ ఛార్జీలలో సబ్సిడీ.
ఇప్పటికే 5 ఎకరాలలోపు సాగు చేస్తున్న రైతులకు రూ.1.50 కే యూనిట్ కరెంటు.
5 ఎకరాల పైబడి సాగుచేస్తున్న రైతులకు రూ.3.80 కే సబ్సిడీపై విద్యుత్.
రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్ధ రూ.500 కోట్ల రుణాలకు సంబంధించి ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్‌ఆమోదం.
ఆదానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు 3700 మెగావాట్ల హైడ్రో పంప్‌డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం.
దీనివల్ల రైతులకు ఎకరాకు రూ.30వేలు నికరాదాయం లభిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పునర్‌వ్యవస్ధీకరణ. కొత్త పోస్టులు నియామకం, ఎగ్జిక్యూటివ్ కేడర్ బలోపేతం వంటి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన కేబినెట్.
జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లలో ఏంఐజీ లే ఔట్స్‌లలో ప్రయివేటు సంస్ధల భాగస్వామ్యంతో అభివృద్ధికి సంబంధించి విధి, విధానాలకు కేబినెట్ ఆమోదం. ఇప్పటికే ఉన్న భూసేకరణ విధానాలకు అదనంగా మరో కొత్త విధానం.
మానసిక, శారీరక దివ్యాంగులకు, అనాథలకు, నిరుపేదలకు సేవలు అందిస్తున్న వివిధ ఛారిటబుల్ సంస్ధలకు ఇచ్చిన లీజు కాలాన్ని పొడిగించేందుకు ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలకు అనుమతినిస్తూ కేబినెట్ ఆమోదం.
జిల్లాల పునర్విభజన నేపధ్యంలో .... 13 పాత జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జెడ్పీ చైర్మన్లనే 26 జిల్లాలకు కొనసాగిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
బద్వేలులో కొత్తగా ఏర్పాటు చేసిన సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో 26 పోస్టుల నియామకానికి కేబినెట్ ఆమోదం.
సత్యసాయి జిల్లా ధర్మవరంలో రెండో పట్టణ పోలీసు స్టేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
వైయస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు 3148.68 ఎకరాలు.
ఈ భూమి విలువను ప్రభుత్వ ఈక్విటీగా పరిగణించేందుకు కేబినెట్ ఆమోదం.
ఈ నెల 22న స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డులో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం.
తిరుపతి ఏపీఐఐసీలో ఈఎంసీ–2లో వింగ్‌టెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు 75 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం.
ఎకరా రూ.38.44 లక్షల రూపాయల చొప్పున కేటాయించాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాలిటెక్నిక్ సిబ్బంది, రిటైర్డ్ ఉద్యోగులకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిబంధనల మేరకు... పే స్కేల్స్‌ను వర్తింప జేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
హైకోర్టు ఆదేశాల మేరకు డిసిఫ్లీనరీ ప్రొసీడింగ్స్ ట్రిబ్యునల్ రద్దు చేస్తూ కేబినెట్ ఆమోదం.
రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ హైదరాబాద్‌లోనే ఉన్న డిసిప్లీనరీ ప్రొసీడింగ్స్ ట్రిబ్యునల్.
ఛైర్మన్, సభ్యులను నియమించని పరిస్థితి.
3 నెలల్లో కేసులు పరిష్కారించాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు కేసులు పరిష్కారానికి నిర్ణయం. ఇందులో భాగంగా ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న 789 కేసులను కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్‌కి బదలాయింపు.
గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్‌లో 100 కొత్త పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం. ఈ మేరకు సర్వీసు రూల్స్ ఏర్పాటు.
టూరిజం పాలసీ 2020–25 కు అనుగుణంగా తిరుపతిలో నొవొటెల్ బ్రాండ్ కింద హోటల్ నిర్మాణానికి లీజు విధానంలో భూమి కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం.
హరే కృష్ణా మూవ్‌మెంట్ మరియు దేవాదాయశాఖ మధ్య భూమి లీజు ఒప్పందం విషయంలో స్టాంప్ డ్యూటీ మినహాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
అక్టోబరు 2018లో తిత్లీ తుఫాను కారణంగా దెబ్బతిన్న 90,789 మంది రైతులకు రూ.182,60,06,490 అదనపు ఇన్‌పుట్ సబ్సిడీకి కేబినెట్ ఆమోదం.
కోనసీమ జిల్లాకు డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టేందుకు కేబినెట్ ఆమోదం.
జిల్లాల విభజనకు సంబంధించి సవరణలు, మార్పులు, చేర్పులుతో కూడిన తుది నోటిఫికేషన్‌కు కేబినెట్ ఆమోదం.
కొత్తగా ఏర్పాటు చేసిన బద్వేలు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో కొత్తగా 20 పోస్టుల మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
నెల్లూరు జిల్లా కనుపూరులో మైసూరుకు చెందిన సెంట్రల్ ఇనిస్టిట్ట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ సంస్ధ ఏర్పాటు చేస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ స్టడీస్ ఇన్ క్లాసికల్ తెలుగు కోసం 5 ఎకరాల స్ధలం కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
వైయస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో ఇంటిగ్రేటెడ్ టూరిజం ప్రాజెక్టు కోసం పర్యాటక శాఖకు 1131.39 ఎకరాల స్ధలం కేటాయిస్తూ... తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
సత్యసాయి జిల్లా పెనుకొండలో 63.29 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం.
ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్ యాక్ట్ 1971కు సవరణలతో కూడిన డ్రాప్ట్ బిల్లుకు కేబినెట్ ఆమోదం.
వైయస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె మండలం ఇందుకూర్ గ్రామంలో ఉన్న సర్వారాయ సాగర్ రిజర్వాయర్ పేరును కమ్యూనిస్టు యోధుడు నర్రెడ్డి శివరామిరెడ్డి రిజర్వాయర్ గా మార్పు చేస్తూ.. జలవనరులశాఖ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి.
addComments
Post a Comment