*వైసిపి ప్రభుత్వ మద్దతుతోనే పల్నాడులో రాజకీయ హత్యలు:- టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు*
*మాచర్ల నియోజకవర్గంలో టిడిపి కార్యకర్త కంచర్ల జల్లయ్య హత్యను ఖండించిన చంద్రబాబు*
అమరావతి (ప్రజా అమరావతి): వైసిపి ప్రభుత్వ మద్దతుతోనే పల్నాడులో టిడిపి కార్యకర్తల హత్యలు జరుగుతున్నాయని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గంలో పార్టీ కార్యకర్త కంచర్ల జల్లయ్యను దారుణంగా హతమార్చిన ఘటనను చంద్రబాబు ఖండించారు. వైసిపి నాయకత్వ ప్రోత్సాహంతో పల్నాడు రాజకీయ హత్యలకు కేంద్రంగా మారుతోందన మండిపడ్డారు. రాజకీయ వేధింపులకు బయపడి బయట ప్రాంతాలకు వెళ్లి బతుకుతున్న జల్లయ్య శుభకార్యం నిమిత్తం సొంత గ్రామానికి వచ్చిన సమయంలో హత్య చెయ్యడం దారుణం అని చంద్రబాబు అన్నారు. వైసిపి రౌడీ మూకల దాడిలో తీవ్రంగా గాయపడిన బక్కయ్య, ఎల్లయ్య ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు ఆరా తీశారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్ని అరాచకాలకు అడ్డు అదుపూ లేకుండా పోతుందని చంద్రబాబు మండి పడ్డారు. కొద్ది నెలల క్రితం స్థానికంగా హత్యకు గురైన చంద్రయ్య విషయంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ హత్యాకాండ జరిగేది కాదని చంద్రబాబు అన్నారు. హత్యలతో పల్నాడును రక్తసిక్తం చేస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లిని వెంటనే అరెస్టు చెయ్యాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
addComments
Post a Comment