ఏపీఐఐసీలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల నోటిఫికేషన్ ఫేక్ : ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది*ఏపీఐఐసీలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల నోటిఫికేషన్ ఫేక్  : ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది*


*పరిశ్రమల డైరెక్టర్ సృజన పేరుతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు*


*ఫేక్ పోస్ట్ లు సృష్టించి,అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై  ఏపీఐఐసీ సీరియస్*


*నిరాధార పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుకు ఉపక్రమించిన ఏపీఐఐసీ*


అమరావతి, జూన్, 04 (ప్రజా అమరావతి);  ఇటీవల వివిధ మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల నకిలీ నోటిఫికేషన్ పై  ఏపీఐఐసీ తీవ్రంగా స్పందించింది. పరిశ్రమల డైరెక్టర్ సృజన పేరుతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అంటూ సోషల్ మీడియాలో వస్తున్న పోస్ట్ లను ఖండించింది. నిరాధార పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుకు  ఏపీఐఐసీ ఉపక్రమించినట్లు ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది వెల్లడించారు. ఇలాంటి అసత్య ప్రచారాలను నిరుద్యోగులు, యువతీయువకులు నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది ఏప్రిల్ 21 తేదీన విడుదలైన నోటిఫికేషన్ లో  జూనియర్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు,  ప్రాజెక్టు ఇంజనీర్లు , సెర్వర్ అడ్మినిస్ట్రేటర్లు, నెట్వర్క్ ఇంజనీర్లు, బిల్డింగ్ సూపర్వైజర్లు, డ్రైవర్లు, అటెండర్లు, ఎలక్ట్రీషియన్ల ఉద్యోగాలు భర్తీ అవుతున్నట్లు ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి పేరు కూడా చేర్చి ప్రస్తుతం ప్రచారం జరగడాన్ని ఎవరూ నమ్మవద్దని ఎండీ కోరారు. ఉద్యోగాల పేరుతో ఎవరైనా ఆశ చూపినా.. వసూళ్లు చేసినా అప్రమత్తం అవ్వాలని ఆయన పత్రికా ప్రకటన ద్వారా పేర్కొన్నారు.Comments