అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం.

 అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం.



ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే)


ఇందిరానగర్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.


మంగళగిరి (ప్రజా అమరావతి);

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించడమే వైసిపి ప్రభుత్వ ధ్యేయమని, ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేస్తోన్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. గురువారం నగరంలోని ఇందిరా నగర్ లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే పాల్గొని ఇంటింటా తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు లబ్ధిదారులకు ఇప్పటి వరకూ అందిన పథకాలను గణాంకాలతో వివరించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు రోడ్లు, డ్రైనేజి కాలువల నిర్మాణం, అధిక విద్యుత్ బిల్లుల సమస్యలను ఎమ్మెల్యే ఆర్కే దృష్టికి తీసుకువచ్చారు.  రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలను వీలైనంత త్వరగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ మీటర్లను పరిశీలించి అధిక విద్యుత్ బిల్లుల సమస్యను పరిష్కరించాలని సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ గత మూడేళ్ల కాలంలో మంగళగిరి నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. నగర ప్రధాన రహదారి గౌతమ బుద్ధారోడ్ విస్తరణ, నియోజకవర్గంలో ఆయా గ్రామాల్లో డొంకరోడ్లు, స్మశాన వాటికల అభివృద్ధి,  అర్బన్ హెల్త్ సెంటర్లు, సచివాలయ భవనాల నిర్మాణాలు, నగర ప్రజలకు ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని అందించేందుకు నగరపాలక సంస్థ స్థలాల్లో పార్కుల నిర్మాణాలు,  చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. ఇంటి వద్దకే  ప్రభుత్వ పథకాలను అందజేస్తోన్న వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డికి  అండగా నిలిచి రానున్న ఎన్నికల్లో మరో మారు విజయాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ హేమమాలిని, తహశీల్దార్ జీవి రాంప్రసాద్, ఎంపీడీవో రామ ప్రసన్న, డీఈ కృష్ణారెడ్డి, ఆర్ఐ యశోద రావు, మార్కెట్ యాడ్ చైర్ పర్సన్ మునగాల భాగ్యలక్ష్మి , పార్టీ పట్టణ అధ్యక్షుడు ్ మల్లేశ్వరరావు, శివాలయం మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మునగపాటి వెంకటేశ్వర రావు, పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు సంకే సునీత, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదుమూడి డేవిడ్ రాజు, చిన్న పోతుల దుర్గారావు,  బెజ్జం రాజాజీ, ఆకురాతి రాజేష్, మొహమ్మద్ ఫిరోజ్,  పలగాని కోటేశ్వరరావు, గుండాల శ్రీనివాసరావు, ముదిగొండ ప్రకాష్ ,మేకా వెంకట్రామిరెడ్డి, కొల్లి శేషి రెడ్డి గాదె సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Comments