సంక్షేమంకు ముఖ్యమంత్రి ఎంత ప్రా ధాన్యత ఇస్త్తున్నారో అంతే పట్టుదలతో అభివృద్ధి చేస్తున్నారు.

 తిరుపతి  (ప్రజా అమరావతి);తిరుపతి శాసన సభ్యులు , నగర మేయర్ , జిల్లా కలెక్టర్ సంయుక్తంగా ప్రెస్ మీట్ ( నగరపాలక సంస్థలో)


శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి గారి వాయిస్ : 


సంక్షేమంకు ముఖ్యమంత్రి ఎంత ప్రా ధాన్యత ఇస్త్తున్నారో అంతే పట్టుదలతో అభివృద్ధి చేస్తున్నారు.తిరుపతి జిల్లా లో రహదారులు పునర్నిమాణం యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నది.


ఒక్క  తిరుపతి నగరంలోనే 2.20 లక్షల మందికి రూ . 1400 కోట్లు లబ్ది చేకూరింది 


గడప గడప కు లో ప్రజాదారణ , లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం విరాజిల్లుతున్నది.


1. మునుపు ఎన్నడూ లేని విధంగా రహదారుల పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం R & B ఆధ్వర్యంలో 102 కోట్లు, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో 49.80 కోట్లు, వెరసి 151.80 కోట్ల రూపాయల పనులు తిరుపతి జిల్లాకు మంజూరు చేయడం జరిగినది. 2. మునుపు ఏ ప్రభుత్వము కూడా ఇంత పెద్ద  మొత్తం రోడ్ల పునర్నిర్మాణం కోసం కేటాయించలేదు.3. గత ప్రభుత్వం రహదారుల పునర్నిర్మాణం  చేయక పోవడం వల్లే వఛ్చి న సమస్య ను ఈ ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి మన జిల్లాకు రహదారుల పునర్నిర్మాణం కోసం 151.80 కోట్లు కేటాయించింది. 4. R&B పరిధిలో 52 రోడ్లు 436 KM మేర 102 కోట్లు, 

PR Engineering ద్వారా AMC link రోడ్ల అభివృద్ధి కోసం 98 పనులకు గాను 49.80 కోట్లు మంజూరు చేయడం జరిగింది. 

PR Engineering ద్వారా 259.03 KM రోడ్లు అభివృద్ధి చేయడం జరుగుతోంది. 


5. R&B ద్వారా ఇప్పటికే 39 కోట్ల విలువైన పనులు పూర్తి అయ్యాయి.                " నాడు-నేడు" పేరుతో ప్రత్యేక పోటో ప్రదర్శన కలెక్టరు గారి కార్యాలయంలో ప్రజల ప్రదర్శనార్థం ఏర్పాటు చేయడం జరిగింది.6. PR Engineering works Tenders దశలో ఉన్నాయి. త్వరలో 259 KM రోడ్ల అభివృద్ధి చేయడం జరుగుతుంది.


7. ఇవి కాకుండా APRRP (AIIB), PMGSY (Phase III), PMGSY (Incentive grant) క్రింద 215 పనులు 258.53 కోట్ల తో PR Engineering ద్వారా జిల్లా వ్యాప్తంగా పనులు జరుగుతున్నాయి. 

ఇందులో 63 కోట్ల రూపాయల పనులు పూర్తి అయ్యాయి. మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని త్వరగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టడం జరుగుతోంది.


8. ఇక తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే 59 పనులు 18.639 కిమీ మేర 25.67 కోట్ల రూపాయలతో పూర్తి చేయడం జరిగింది. 


9. ఇంకా 45 పనులు 41.395 కిమ మేర, 33.05 కోట్ల రూపాయలతో చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం.


10. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3200 (potholes )రహదారుల్లో గుంతలను గుర్తించి అందులో 1216 potholes clear చేయడం జరిగింది. మిగిలిన potholes కూడా నైరుతి రుతుపవనాల కాలం కంటే ముందే పూర్తి చేసి తిరుపతి పట్టణాన్ని Zero Pothole City  చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.


జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి 

మాట్లాడుతూ 


నాడు నేడు రోడ్ల  పునర్నిర్మాణం చేపట్టిన ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేసాము 


వర్షాకాలం ముందే రహదారుల పనులు పూర్తి కానున్నాయి. ఇప్పటికే కొన్ని పూర్తి , మరో కొన్ని పురోగతిలో వున్నాయి చంద్రగిరి వద్ద పోలీస్ అవసరాలకు కేటాయించిన భూమి ప్రభుత్వానిది గత 30 సంవత్సరాలుగా వినియోగించు కోనందున ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కేటాయించాము 

పోలీసు వారికి మరొక చోట కేటాయిస్తాం 


స్మార్ట్ సిటీ సమీక్ష నిర్వహించి ప్రధాన్యతా పనులు వేగవంతం చేస్తాం Comments