నెల్లూరు (ప్రజా అమరావతి);
ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికలను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా నిర్వహించడం
తో పాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితంగా అమలు జరిగేలా సంబందిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు అసెంబ్లి ఉప ఎన్నికల వ్యయ పరిశీలకులు శ్రీ భరత్ ఆర్ అందాలే పేర్కొన్నారు.
సోమవారం ఉదయం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో ఆత్మకూరు అసెంబ్లి నియోజక వర్గ ఉప ఎన్నికల వ్యయ పరిశీలకులు శ్రీ భరత్ ఆర్ అందాలే, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీ చక్రధర్ బాబుతో కలసి ఆత్మకూరు అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, పోటీలో వున్న అభ్యర్డులకు ఎన్నికల ఖర్చు మోనిటరింగ్ పై సంబందిత అధికారులతో సమీక్షించిపలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సంధర్భంగా ఎన్నికల వ్యయ పరిశీలకులు శ్రీ భరత్ ఆర్. అందాలే మాట్లాడుతూ, ఆత్మకూరు అసెంబ్లి ఉప ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంతో పాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితంగా అమలు జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా పోటీలో వున్న అభ్యర్ధుల ఎన్నికల ఖర్చు మోనిటరింగ్ కు ఏర్పాటైన వ్యయ పరిశీలన టీములు, ఫ్త్లెయింగ్ స్కాడ్స్, ఎం.సి.ఎం.సి టీములు, స్టాటిక్ సర్వైలెన్స్ టీములు, అకౌంట్స్ టీములు,వీడియో వ్యూయింగ్ టీములు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, నిబద్దతతో పని చేయాలన్నారు. ప్రతి రోజు అభ్యర్డుల ఎన్నికల ఖర్చు నమోదులో భాగంగా బహిరంగ సభలు, వివిధ ప్రచార కార్యక్రమాలు, వాహనాల వినియోగం, ప్రకటనల జారీ తదితర కార్యక్రమాలకు సంబందించి రోజువారీ రిజిస్టర్స్ పక్కాగా నిర్వహించాలని, అలాగే నిర్ధేశించిన చెక్ పోస్టుల వద్ద నియమించిన టీములు చురుకుగా పనిచేయాలని వ్యయ పరిశీలకులు శ్రీ భరత్ ఆర్. అందాలే, అధికారులను ఆదేశించారు. ఒక్కో అభ్యర్థి ఎన్నికల వ్యయం 40 లక్షల రూపాయల పరిమితికి మించరాదని, అలా మించినచో వారు అనర్హులవుతారని స్పష్టం చేశారు. పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థి ఎన్నికల కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను తెరచి అందులో ఖర్చు వివరాలు చూపాలన్నారు.
కలెక్టర్,జిల్లాఎన్నికల అధికారి శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు మాట్లాడుతూ, ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికలు సజావుగా, ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అవసరమైన అన్నీ ఏర్పాట్లు చేపట్టడం జరిగిందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితంగా అమలు జరిగేలా ఎం.సి.సి. టీములు, ఫ్త్లెయింగ్ స్కాడ్స్, ఎం.సి.ఎం.సి టీములు, స్టాటిక్ సర్వైలెన్స్ టీములు, ఎక్స్ పెండిచర్ అకౌంట్స్ టీములు, వీడియో వ్యూయింగ్ టీములు ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఓటింగ్ శాతం పెరిగేలా స్వీప్ కార్యక్రమం ద్వారా ఓటర్స్ అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుచున్నదని కలెక్టర్ వివరించారు. ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబందించి నియోజక వర్గ పరిధిలోని 6 రెవెన్యూ మండలాల్లో 279 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించబడతాయని, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి అవసరమైన సిబ్బంది నియామకం, వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు ప్రత్యేకంగా చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు. గట్టి భద్రత కోసం 5 కంపెనీల కేంద్ర భద్రతా దళాలు జిల్లాకు రానున్నాయన్నారు. పోటీలో వున్న అభ్యర్ధుల ఎన్నికల ఖర్చు ప్రతి రోజు మోనిటరింగ్ జరిగేలా చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో అడిషనల్ ఎస్.పి. శ్రీమతి హిమావతి, సెబ్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి శ్రీలక్ష్మి, ఎన్నికల నోడల్ అధికారులు జిల్లా కోఆపరేటివ్ అధికారి శ్రీ తిరుపల్, రెడ్డి, జిల్లా ఆడిటింగ్ అధికారి శ్రీ మహమ్మద్ ఆలీ, డ్వామా పి.డి శ్రీ తిరుపతయ్య, ఎన్నికల ప్రక్రియకు సంబందించిన వివిధ టీములకు సంబందించిన ఇతర నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment