*రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అభినందనీయం
.*
*త్రో బాల్ ఇండియన్ కెప్టెన్ చావలి సునీల్ కుమార్.*
గుంటూరు (ప్రజా అమరావతి);
రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయల సహాయం అందించడం చాలా సంతోషంగా ఉందని ఇటువంటి సాయం అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు త్రోబాల్ ఇండియన్ కెప్టెన్ చావలి సునీల్ తెలియజేశారు.
ఆదివారం గుంటూరు సింధురి హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో అనేక ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు నుండి తాను త్రో బాల్ క్రీడలో పాల్గొనడం జరిగిందని అయితే తను ఒక దళిత (మాదిగ) కుటుంబంలో పుట్టడం వలన ఏ ప్రభుత్వం కూడా తన ప్రతిభ గుర్తించలేదు అని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తన ప్రతిభను గుర్తించి తనను ప్రోత్సహించే విధంగా ఆర్థిక సహాయం అందించడం సంతోషదాయకం అన్నారు.
మారుమూల గ్రామాల్లో దాగి ఉన్న ప్రతిభావంతమైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇటువంటి ఆర్థిక ప్రోత్సాహకాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. తాను తెనాలి నియోజకవర్గం, కొల్లిపర గ్రామం నుండి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు భారతదేశం తరఫున ఆడటానికి అనేక కష్టాలను వివక్షలను ఎదుర్కోవలసివచ్చింది అయితే బడుగు బలహీన వర్గాలను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ చేస్తున్న సహాయ సహకారాలు అభినందనీయమన్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తే మంచి అకాడమీని ఏర్పాటు చేసి తన లాంటి అనేక మంది క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు భవిష్యత్ ప్రణాళికతో ముందుకు వస్తాను అని తెలియజేశారు.
addComments
Post a Comment