*సమస్యల పరిష్కారానికే గడపగడపకు మన ప్రభుత్వం*
*కుల,మత,రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు.
*
*వైఎస్.జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి.*
*-ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)*
*-హారతులిచ్చి గజమాలతో ఎమ్మెల్యే ఆర్కేను సత్కరించిన ప్రజలు.*
మంగళగిరి (ప్రజా అమరావతి);
ప్రజా సమస్యల పరిష్కారానికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహనరెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. నగరంలోని ఇందిరా నగర్ ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంతంలో సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే కు స్థానిక మహిళలు హారతులివ్వగా వైసీపీ నేతలు గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ప్రతి నెలా ఒకటో తారీఖునే ఠంచనుగా ఉదయమే రూ.2,500 చొప్పున పెన్షన్ ఇచ్చి, మనవడిలా సీఎం వైఎస్ జగన్ ఆదుకుంటున్నారని వృద్ధులు కృతజ్ఞతలు తెలిపారు. సొంత అన్నలా, తమ్ముడిలా సీఎం వైఎస్ జగన్ అమ్మ ఒడి కింద రూ.15 వేలు ఇస్తుండటం వల్ల పిల్లలను బాగా చదివించుకోగలుగుతున్నామని అక్క,చెల్లెమ్మలు హర్షం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన కింద ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆర్థిక సహకారం అందించడం వల్లే ఒక్క రూపాయి కూడా అప్పు చేయకుండా ఉన్నత చదువులుచదివించుకోగలిగామని.. అధిక వేతనంతో కూడిన ఉద్యోగాలు కూడా వస్తున్నాయని సంతోషంతో వివరించారు. ఇంటి స్థలంతోపాటు ఇల్లు కూడా కట్టిస్తూ సొంతింటి కలను నెరవేస్తున్న సీఎం వైఎస్ జగన్ వెంటే నడుస్తామని తేల్చి చెప్పారు.
*అడుగడుగునా ఆదరణ.*
ఎన్నికల మేనిఫెస్టో, మూడేళ్లలో అమలు చేసిన హామీలు.. ఇంటి యజమానురాలైన అక్కచెల్లెమ్మలకు సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖను ఎమ్మెల్యే ఆర్కే ప్రతి ఇంటి వద్దకూ వెళ్లి అందజేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ, ఎక్కడా లేని రీతిలో మూడేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా ఆ ఇంట్లో కుటుంబ సభ్యులకు చేకూర్చిన ప్రయోజనాన్ని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో మూడేళ్లలోనే 95 శాతం అమలు చేశామని గుర్తు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి ముంగిటకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని చెప్పారు.
మూడేళ్లలో దేవుడి దయ, మీ అందరి చల్లని చూపులతో మంచి చేశామని.. ఇక ముందు కూడా ఇంకా మంచి చేస్తామని, సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. మంగళగిరి నియోజకవర్గంలో గత మూడేళ్లలో కుల,మత,రాజకీయాలకు అతీతంగా సుమారు రూ. 780కోట్ల విలువైన సంక్షేమ ఫలాలను అందిచామని, మరో రూ.350కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తు చేశారు. మనందరి ప్రభుత్వానికి ఎప్పుడూ మా మద్దతు ఉంటుందని అవ్వా,తాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముళ్లు తెగేసి చెప్పారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే చెప్పాలని అడిగి మరీ.. వాటిని అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులకు ఎమ్మెల్యే ఆర్కే ఆదేశాలు జారీ చేయడంతో స్థానిక ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే స్థానిక యువతతో కలసి ఉత్సాహంగా కొద్దిసేపు వాలీబాల్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, వైసీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
addComments
Post a Comment