నిత్యావసర ధరల పర్యవేక్షణకు సియం యాప్-సిపిఏ(కన్సూమర్ ప్రైస్ అప్లికేషన్ యాప్)
అమరావతి,8 జూన్ (ప్రజా అమరావతి):రాష్ట్రంలోని వివిధ రైతు బజారులు,స్థానిక మార్కెట్లలో కూరగాయలు,ఇతర నిత్యావసర సరుకుల ధరల పర్యవేక్షణకు త్వరలో ప్రత్యేక యాప్ అందుబాటులోకి రానుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ వెల్లడించారు.ఈమేరకు బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో ధరల స్థితిగతులపై ఆయన అధికారులతో సమీక్షించారు. రైతు బజారులు సహా స్థానిక మార్కెట్లలో కూరగాయలు సహా ఇతర నిత్యావసర సరుకుల ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా సియం యాప్-సిపిఏ(కన్సూమర్ ప్రైస్ అప్లికేషన్)పేరిట ప్రత్యేక యాప్ ను త్వరలో అందుబాటులోకి తేనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ వెల్లడించారు.ఇందుకు సంబంధించి ఇప్పటికే మార్కెటింగ్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.ఈయాప్ అందుబాటులోకి వస్తే రైతు బజారులు,స్థానిక మార్కెట్లలో కూరగాయలు సహా ఇతర నిత్యావసర సరుకుల ధరల వివరాలను ఎప్పటికప్పుడు తెల్సుకునేందుకు వీలుకలుగుతుందని పేర్కొన్నారు.మార్కెటింగ్, తూనికలు కొలతలు,విజిలెన్సు అండ్ మానిటరింగ్,రైతు బజారులు సిఇఓ ఈయాప్ ను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ స్థానిక మార్కెట్లలో వివిధ సరుకులు ధరలు,రైతు బజారుల్లోని ధరలను విశ్లేషిస్తూ అందుకు సంబంధించిన డేటాను ఈయాప్ లో అందుబాటులో ఉంచుతారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ పేర్కొన్నారు.
రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమీషనర్ ప్రద్యుమ్న ఈప్రత్యేక యాప్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ధరలు మానిటర్ చేసేందుకు వీలుగా ప్రత్యేక యాప్ ను రూపొందించడం తోపాటు అత్యుత్తమమైన ప్రత్యేక మాస్టర్ డాష్ బోర్టును కూడా రూపొందించామని వివరించారు.మార్కెటింగ్,విజిలెన్సు అండ్ ఎన్పోర్సుమెంట్,తూనికలు కొలతలు,రైతు బజారులు,సెర్ప్,పౌరసరఫరాలు తదితర 10 శాఖలు ఈయాప్ ను మానిటర్ చేసేందుకు వీలుగా ఆయా శాఖల అధికారులకు ప్రత్యేక లాగిన్ ఐడిలను రూపొందించి ఇవ్వనున్నట్టు చెప్పారు.ఈయాప్ అందుబాటులోకి వచ్చాక వివిధ రైతు బజారుల్లోను,స్థానిక మార్కెట్లలోను కూరగాయలు,ఇతర నిత్యావసర వస్తువుల ధరలను తెల్సుకునేందుకు వీలుకలుగుతుందని తెలిపారు.అంతేగాక వారం,నెల వారీ ధరల వివరాలనే కాక గత మాసాలు,సంవత్సరాలకు సంబంధించిన ధరల వివరాలను కూడా ఈయాప్,డాష్ బోర్డుల్లో అందుబాటులో ఉంచడం జరుగుతుందని ప్రద్యుమ్నతెలిపారు.
ఈసమావేశంలో రాష్ట్ర తూనికలు కొలతలు శాఖ డైరెక్టర్ కెఆర్ఎం కిశోర్ కుమార్,రాష్ట్ర విజిలెన్సు అండ్ ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టర్ జనరల్ శంకభాక్త బాగ్చి,రైతు బజారుల సిఇఓ శ్రీనివాసరావు,ఆర్టీజిఎస్ సిఇఓ విద్యాసాగర్ పాల్గొన్నారు.అలాగే వీడియో లింక్ ద్వారా పౌరసరఫరాల శాఖ ఇఓ కార్యదర్శి గిరిజా శంకర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment