వైసీపీ ప్రభుత్వంలో పన్నుల వాతలు... పథకాలకు కోతలు

 అమరావతి (ప్రజా అమరావతి);


_*వైసీపీ ప్రభుత్వంలో పన్నుల వాతలు... పథకాలకు కోతలు*_


*ఒంటరి మహిళల పెన్షన్ లో ఆంక్షలు అమానవీయం*


*- రాజధాని కట్టని ప్రభుత్వానికి భూములు అమ్మే హక్కెక్కడిది?*


*- డబ్బులు పంచినా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు పెరగలేదు*


- స్ట్రాటజీ కమిటీ సమావేశంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు*


 రాష్ట్రంలో మూడేళ్ల జగన్ పాలన ప్రజలకు ఒకవైపు పన్నులతో వాతలు పెడుతూ....మరోవైపు పథకాలకు కోతలతో సాగుతోందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 


 ప్రజలకు అందే పథకాలలో రకరకాల నిబంధనల పేరుతో కోతులు పెట్టి డబ్బులు మిగుల్చుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. 


 చెత్త దగ్గర నుంచి అన్నింటిపైనా పన్నులతో వాతలు పెడుతున్న ప్రభుత్వం....పలు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు కొత్త కొత్త నిబంధనలతో కోతలు వేస్తోందని దుయ్యబట్టారు. 


 అమ్మఒడి పథకంలో 52 వేల మంది లబ్ధిదారులు తగ్గడాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. 


 ఒంటరి మహిళల పెన్షన్ వయసు నింబంధనను 50 ఏళ్లకు పెంచి లబ్ధిదారుల సంఖ్యను లక్షల్లో తగ్గించడం అమానవీయం అని చంద్రబాబు అన్నారు. 


 పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.


 రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుక పెట్టని జగన్ కు రాజధాని భూమలు అమ్మే హక్కు ఎక్కడిదని చంద్రబాబు ప్రశ్నించారు. 


 అమరావతిని స్మశానం అని చెప్పిన ఈ ప్రభుత్వం... ఇప్పుడు ఎకరా 10 కోట్లకు ఎలా అమ్మకానికి పెడుతుందని చంద్రబాబు అన్నారు. 


 ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలను మూడేళ్లుగా పూర్తి చెయ్యకుండా...ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు అద్దెకు ఇవ్వడానికి చూడడాన్ని చంద్రబాబు తప్పు పట్టారు. 


 ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు ఎందుకు పెరగలేదని చంద్రబాబు ప్రశ్నించారు. 


 డబ్బులు పంచినా, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీలో లేకున్నా వైసీపీకి ఓట్లు పెరగకపోవడానికి ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకతే కారణం అని చంద్రబాబు అన్నారు. 


 గత ఎన్నికలకు, ఉప ఎన్నికలకు చూస్తే కనీసం వైసీపీకి 10 వేల ఓట్లు కూడా అదనంగా పడలేదని చంద్రబాబు గుర్తు చేశారు. 


_*ముఖ్యనేతల సమావేశంలో చర్చించిన పలు ఇతర అంశాలు..*_


*1.* అమ్మఒడి పథకంలో జగన్ రెడ్డి 52,463 మంది లబ్ధిదారులకు మొండిచేయి చూపారు. నాణ్యమైన విద్యను అందించడంలో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రం..19వ స్థానానికి పడిపోవడం జగన్ రెడ్డి అసమర్థతకు నిదర్శనం. పది, ఇంటర్ పరీక్షల్లో ఫెయిలై 19 మంది విద్యార్థులు చనిపోయారు...ఈ పాపం వైసీపీ ప్రభుత్వానిదే.


*2.* ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించే మద్యంలో ప్రాణాలు తీసే విష పదార్థాలు ఉన్నాయి. సొంత బ్రాండ్లతో జగన్ ప్రజల ప్రాణాలు హరిస్తున్నారు. మద్యం నాణ్యతపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


*3.* దుల్హన్ పథకం కింద పేద ముస్లిం మైనార్టీ యువతులకు టీడీపీ ఇచ్చిన రూ.50 వేల సాయాన్ని రూ.లక్షకు పెంచుతానని హామీ ఇచ్చి జగన్ రెడ్డి విస్మరించారు. నిధుల్లేక దుల్హన్ పథకాన్ని నిలిపివేశామని హైకోర్టులో చెప్పడం జగన్ రెడ్డి మోసానికి నిదర్శనం. పేద ముస్లిం యువతులకు ఇచ్చే సాయాన్ని ఎత్తివేయడమే గొప్ప సంక్షేమమా? 


*4.* పంటల బీమా సాయంలో అసలైన రైతులకు లబ్ధి జరగడం లేదు. ఈ-క్రాప్ నమోదులో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. వైసీపీ కార్యకర్తల పేర్లు నమోదు చేసి.. పంట నష్టపోయిన రైతులకు మొండిచేయి చూపారు. 


*5.* శ్రీకాకుళం జిల్లా తిత్లీ తుఫాను బాధితులకు పరిహారం పంపిణీలో వైసీపీ నేతలు అనేక అవకతవకలకు పాల్పడుతున్నారు. అసలైన బాధితులకు పరిహారం అందించకుండా.. వైసీపీ కార్యకర్తలకే పరిహారం అందజేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. 


*6.* నెల్లూరు జిల్లా ఉదయగిరిలో దళితుడైన నారాయణ పోలీసులు కొట్టిన దెబ్బల కారణంగానే ప్రాణాలు కోల్పోయాడు. తక్షణమే నారాయణ మృతి పట్ల సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. 


7.* ప్రకాశం జిల్లా అల్లూరులో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని సమస్యలపై ప్రశ్నించిన కవిత అనే మహిళను వేధించడాన్ని నేతలు తప్పుపట్టారు. బాధిత మహిళ కవితకు టీడీపీ అండగా ఉంటుందని ప్రకటించారు. 


ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ కె.అచ్చెన్నాయుడు, శ్రీ యనమల రామకృష్ణుడు, శ్రీ వర్ల రామయ్య, శ్రీ కాలవ శ్రీనివాసులు, శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు, శ్రీ పయ్యావుల కేశవ్, శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి, శ్రీ కేఎస్ జవహర్, శ్రీ బోండా ఉమామహేశ్వరరావు, శ్రీ నిమ్మల రామానాయుడు, శ్రీ బీద రవిచంద్ర యాదవ్, శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి, శ్లీ టీడీ జనార్థన్, శ్రీ గురజాల మాల్యాద్రి, శ్రీ పి.అశోక్ బాబు, శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరాం, శ్రీ మద్దిపాటి వెంకటరాజు, శ్రీ చింతకాయల విజయ్ పాత్రుడు, శ్రీ జి.వి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments