నెల్లూరు, (ప్రజా అమరావతి);
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాల లక్ష్య సాధనలో బ్యాంకర్స్ తమ వంతు కృషి చేయాల
ని జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, బ్యాంకు అధికారులను ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బ్యాంకర్ల జిల్లా స్థాయి సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలకు సంబందించిన లబ్దిదారులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేయడం తో పాటు లక్ష్య సాధనలో బ్యాంకర్స్ తమ వంతు కృషి చేయాలన్నారు. 2021-22 ఆర్ధిక సంవత్సరం రుణ ప్రణాళికలో ప్రాధాన్యతా రంగాలకు రూ.12,598.62 కోట్లు లక్ష్యం కాగా, 11,919.24 కోట్ల రూపాయలు మంజూరు చేసి 94.60 శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందన్నారు. అలాగే నాన్ ప్రయారిటీ రంగానికి రూ.3,942.33 కోట్లు లక్ష్యం కాగా, 3,684.48 కోట్ల రూపాయలు మంజూరు చేసి 93.45 శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందని కలెక్టర్ వివరించారు. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో ప్రాధాన్యత రంగంలో వ్యవసాయానికి సంబంధించి ఖరీఫ్ మరియు రబీ పంట రుణాల కింద 7,001.19 కోట్ల రూపాయలు పంట రుణాలు లక్ష్యం కాగా, 8,011.85 కోట్ల రూపాయలు మంజూరు చేసి 114.43 శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందన్నారు. ఎంఎస్ఎంఈ సెక్టార్ క్రింద చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 1,755.40 కోట్లు అందించడం లక్ష్యం కాగా, 1,518.15 కోట్ల రూపాయలు మంజూరు చేసి 86.48 శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందని, ఆయా రంగాలలో అభివృద్ధి సాధించడానికి యూనిట్ల గ్రౌండింగ్ కు బ్యాంకులు తగిన విధంగా చేయూతనివ్వాలని పేర్కొన్నారు. వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన అర్హులైన రైతులకు జూన్ నెలాఖరు నాటికి కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్,అధికారులను,బ్యాంకు అధికారులను ఆదేశించారు. పి.ఎం.కిసాన్ – వైఎస్ఆర్ రైతు భరోసా పధకం అమలుకు సంబందించి ఆధార్ సీడింగ్ మరియు మ్యాపింగ్ ప్రక్రియను జిల్లాలోని అన్నీ ఆర్.బి.కె స్థాయిలో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, బ్యాంకు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్నీ ఆర్.బి.కె ల్లో రైతులకు అవసరమైన బ్యాంక్ సేవలు అంధించేందుకు నిర్ధేశించిన బ్యాంక్ కర్సపాండెంట్స్ నియామక ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసేందుకు బ్యాంకర్స్ ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కలెక్టర్, బ్యాంకర్స్ ను ఆదేశించారు. రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రైతులకు అవసరమైన రుణాల మంజూరుకు బ్యాంకర్స్ తమ వంతు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలో పెద్ద ఎత్తున జగనన్న లే అఔట్స్ లో ఇళ్ల నిర్మాణాలు జరుగుచున్నవని, అర్హులైన లబ్ధిదారులకు రుణాల మంజూరుకు బ్యాంకర్స్ ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కలెక్టర్, బ్యాంకర్స్ ను ఆదేశించారు. ఇన్ కం జనరేట్ ఆక్టివిటీలకు ప్రాధాన్యత ఇచ్చి జిల్లాలో వున్న అన్నీ స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు నిర్ధేశించిన లక్ష్యం మేరకు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, బ్యాంకు అధికారులను ఆదేశించారు. జిల్లాలో 2021-22 ఆర్ధిక సంవత్సరం లో గ్రామీణ ప్రాంతాల్లోని 27,001 స్వయం సహాయక సంఘాలకు 1,000.17 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజీ రుణాలు లక్ష్యం కాగా, 24,471 స్వయం సహాయక సంఘాలకు 1,096.19 కోట్ల రూపాయలు మంజూరు చేసి 109.60 శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందన్నారు. అలాగే అర్బన్ ప్రాంతంలోని 4,800 స్వయం సహాయక సంఘాలకు 144 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజీ రుణాలు లక్ష్యం కాగా, 4,902 స్వయం సహాయక సంఘాలకు 304.96 కోట్ల రూపాయలు మంజూరు చేసి 211.77 శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందని కలెక్టర్ వివరించారు. నిర్ధేశించిన విధంగా జిల్లా లో ఫైనాన్షియల్ లిటరసి క్యాంప్స్ నిర్వహించాలని కలెక్టర్, బ్యాంకర్స్ ను ఆదేశించారు. స్టాండప్ ఇండియా పథకంలో భాగంగా వచ్చే దరఖాస్తులను పరిశ్రమల శాఖ అధికారులు, బ్యాంకులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని కలెక్టర్, జిఎం ను ఆదేశించారు. ముఖ్యంగా స్టాండ్ అప్ ఇండియా కార్యక్రమం కింద ఎస్.సి., ఎస్.టి., మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకు అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కలెక్టర్, బ్యాంకు అధికారులను ఆదేశించారు. అలాగే పి.ఎం. స్వానిధి పధకం నకు సంబందించి రుణాల మంజూరు ప్రక్రియను నిర్ధేశించిన లక్ష్యం మేరకు పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, బ్యాంకర్స్ ను ఆదేశించారు. ప్రధాన మంత్రి ఎంప్లాయమెంట్ జనరేషన్ ప్రోగ్రాం క్రింద 2021-22 ఆర్ధిక సంవత్సరంలో 74 యూనిట్స్ కు 222 లక్షల రూపాయలు మంజూరు లక్ష్యం కాగా , ఇప్పటివరకు 100 యూనిట్స్ గ్రౌండింగ్ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఆత్మకూరు ఉప ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో జిల్లాలోని అన్నీ బ్యాంకుల పరిధిలో ఓటు హక్కు వినియోగం పై ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, బ్యాంకు అధికారులను సూచించారు.
ఈ సమావేశంలో ఎల్.డి.ఎం శ్రీ టి. శ్రీకాంత్ ప్రదీప్ కుమార్, ఆర్.బి.ఐ మేనేజర్ శ్రీ మహమద్ ఆలీ, నాబార్డ్ డి.డి.ఎం శ్రీ రవిసింగ్, జిల్లా పరిషత్ సి.ఈ.ఓ శ్రీమతి వాణి, డి.ఆర్.డి.ఏ., మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్లు శ్రీ సాంబశివ రెడ్డి, శ్రీ రవీంద్ర, వ్యవసాయ శాఖ జె.డి. శ్రీ సుధాకర్ రాజు, మత్స్య శాఖ జె.డి. శ్రీ నాగేశ్వర రావు, పశు సంవర్ధక శాఖ జె.డి. మహేశ్వరుడు, పరిశ్రమల శాఖ జి.ఎం శ్రీ ప్రసాద రావు, వివిద బ్యాంకుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment