*అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో మంగళగిరి నియోజకవర్గానిదే మొదటి స్థానం.
*
*గత మూడేళ్లలో నియోజకవర్గ పేదలకు రూ.780కోట్ల సంక్షేమ ఫలాలు అందించిన ఘనత సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికే దక్కింది.*
*- మరో రూ.350కోట్లతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు.*
*-రానున్న ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో చంద్రబాబు పోటీ చేసినా వైసీపీదే విజయం.*
*-నియోజకవర్గ ప్లీనరీ సమావేశంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే).*
మంగళగిరి (ప్రజా అమరావతి);
అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రంలోనే మంగళగిరి నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలిచిందని, గత మూడేళ్ల వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో నియోజకవర్గ పేదలకురూ.780కోట్ల సంక్షేమ ఫలాలను అందించే ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. నగరంలోని గౌతమ బుద్ధ రోడ్డు వెంబడి ఈద్గా కమ్యూనిటీ హాల్ ఆవరణలో శనివారం జరిగిన నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ( ఆర్కే) అధ్యక్షోపన్యాసం చేస్తూ... రానున్న ఎన్నికల్లో తిరిగి మరో మారు వైసీపీ జెండా రెపరెపలాడాలని, ప్రజలను ఓటు అడిగే హక్కు వైసీపీకి మాత్రమే ఉందన్నారు. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి ఇవ్వని మెజారిటీని వైసిపికి రాష్ట్ర ప్రజలు అందించారని, ఇచ్చిన మాట ప్రకారం చేసిన వాగ్దానానికి కట్టుబడి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ మూడేళ్ల కాలంలో 95శాతానికి పైగా వాగ్ధానాలను అమలు చేశారన్నారు. సుమారు లక్షన్నర కోట్ల రూపాయల సంక్షేమ ఫలాలను పేదలకు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. ఒకవైపు రాష్ట్రంలో ఆర్థిక భారం ఉన్న లెక్కచేయకుండా పేదలు ఇబ్బందులు పడకుండా సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారని, అందులో భాగంగా మంగళగిరి నియోజక వర్గానికి గతమూడేళ్ల వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో సుమారు 780 కోట్ల విలువైన సంక్షేమ ఫలాలను పేదవారికి కుల,మత,రాజకీయాలు చూడకుండా... అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా వారి వారి ఖాతాల్లో జమ చేశారని గుర్తు చేశారు. ఇక మంగళగిరి నియోజకవర్గంలో మరో రూ.350కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. నియోజకవర్గంలోని రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధికి మరో రూ.350కోట్లు కేటాయించాలని ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డిని కోరడం జరిగిందని, వెంటనే అధికారులకు వీలైనంత త్వరగా జీవో జారీ చేయాలని సీఎం సూచించారన్నారు. రానున్న రెండేళ్ల కాలంలో సుమారు రెండువేల కోట్ల రూపాయిల అభివృద్ధిపనులు చేరుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇటీవల నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్కే కనపడుతున్నాడా?అని అడిగాడని...అసలు కనపడందే లోకేష్ అనే విషయాన్ని గమనించి టీడీపీ కార్యకర్తలే తలలు దించుకున్నారని గుర్తు చేశారు. మూడు సంవత్సరాల కాలం దివంగత ముఖ్యమంత్రివై.ఎస్. రాజశేఖరరెడ్డి పేరిట మంగళగిరిలో రాజన్న క్యాంటీన్ నిర్వహించి ప్రతి రోజు 500 మంది పేదలకు అన్నదానం చేశామని, చివరికి పేదలు తిన్న ప్లేట్లను కూడా కడిగామన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల నారా లోకేష్, టీడీపీ నేతలు అన్నా క్యాంటీన్ పేరుతో సరికొత్త నాటకానికి తెరతీసారని విమర్శించారు. ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మంత్రిగా ఉన్న ఆయన తనయుడు లోకేష్ కు ఆనాడు అన్నా క్యాంటీన్ గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. చివరి రోజుల్లో చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తుకు వచ్చి అన్నా క్యాంటీన్ లు ఏర్పాటు చేశాడన్నారు. అన్నం పెట్టి పేదవాడి కడుపు నింపడం మంచిదేనని, అటువంటప్పుడు 2019నుంచి ఎందుకు అన్నా క్యాంటీన్లు నడపలేక పోయారని ప్రశ్నించారు. నేడు అన్నా క్యాంటీన్ వద్ద నియోజకవర్గంలోని టిడిపి కార్యకర్తలే పుట్టినరోజుల పేరుతోనో, చనిపోయిన తమ పెద్దల పేరుతోనో అన్నదానం చేస్తోన్నారని, తాత పేరు తో ముద్ద అన్నం పెట్టేందుకు మనస్సు రాని లోకేష్ తిరిగి మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేస్తానని డాంభికాలు పలుకుతున్నాడన్నారు. లోకేష్ ముందు మీరు మంగళగిరి అని స్పష్టంగా పలకడం నేర్చుకోండని హితవు పలికారు. లోకేష్ మీరు పోటీకి సరిపోరు...రాజకీయాలకు పనికిరారు...మాట్లాడటం చేతకాదు...సబ్జెక్టు లేదనే విషయం తెలుసుకోవాలన్నారు. మిమ్మల్ని నియోజకవర్గ ప్రజలు ఎప్పుడో పక్కన పెట్టేశారన్నారు. అయినా మీరు మంగళగిరిలో గెలవగలుగుతాను... మంగళగిరి ప్రజలకు మేము అండగా ఉన్నాం... అనే నమ్మకం కలిగి ఉంటే....మీ నాన్న చంద్రబాబును పోటీ చేయించినా ఖచ్చితంగా గెలుపు వైసీపీదేనని ఎమ్మెల్యే ఆర్కే స్పష్టం చేశారు. తొలుత ఎమ్మెల్యే ఆర్కే వక్తలతో కలసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వేదికపై ఆశీనులైన ప్రజా ప్రతినిధులు, ప్లీనరీ సమావేశానికి హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు,సానుభూతి పరులు, అభిమానులతో ఎమ్మెల్యే ఆర్కే ప్రతిజ్ఞ చేయించారు.
addComments
Post a Comment