*ఆఫ్సోర్ రిజర్వాయర్ కోసం సీఎం మాట్లాడడం ఆనందదాయకం*
*_రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు_*
*ఆఫ్సోర్ పనులు పునః ప్రారంభిస్తాం అన్న సీఎం*
*దివంగత నేత మాజీ ఎంపి అప్పయ్యదొర కల సాకారం*
*త్వరలో జీ.ఒ ఇస్తామన్న సీఎం జగన్*
*శ్రీకాకుళం అమ్మ ఒడి వేదికపై పలాస ప్రాంత ప్రజలకు తీపికబురు*
శ్రీకాకుళం. (ప్రజా అమరావతి);
గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఆఫ్సోర్ రిజర్వాయర్ పనులను పునః ప్రారంభం చేసేందుకు ప్రత్యేకంగా జి.ఒ ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం ఎంతో సంతోషకరమని రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లాలో అమ్మ ఒడి పధకం మూడవ విడత కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక సంకల్పం తో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా పలాస ప్రాంత ప్రజలకు సాగు ,త్రాగు నీరు అందించేందుకు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు తరువాత వచ్చిన ప్రభుత్వాలు నత్తనడకన సాగించాయని అన్నారు. దివంగత నేత మాజీ ఎంపి హనుమంతు అప్పయ్యదొర కల ఆప్సోర్ రిజర్వాయర్ అని అన్నారు. తమను నమ్ముకున్న ప్రజలకు సాగు ,త్రాగు నీరు అందించాలని ఎంతో ఆశయంతో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ని ఒప్పించి ప్రాజెక్టు ను సాదించారని చెప్పారు. సీఎం జగనన్న తండ్రి చేపట్టిన ఆఫ్సోర్ ప్రాజెక్టు కు అదనపు నిధులు వెచ్చించే విదంగా ఒక జి.ఒ ఇస్తామని వేదిక మీద ముఖ్యమంత్రి మాట్లాడటం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. సీఎం ప్రకటనపై రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తో పాటు పలాస నియోజకవర్గం వైసిపి సీనియర్ నాయకులు హనుమంతు వెంకటరావు దొర కూడా హర్షం వ్యక్తం చేశారు. తన సోదరుడు అపురూప కల ఆఫ్సోర్ రిజర్వాయర్ నిర్మాణం అని ఆ కల తీరే రోజులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా తీరడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. వైఎస్ కుటుంబం ద్వారా ఆఫ్సోర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తి అవుతుందనే నమ్మకం తనకు ఉందని అందుకె ఎటువంటి పదవులు ఆశించకుండా నిస్వార్ధంగా పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని మంత్రి అన్నారు. పలాస నియోజకవర్గం ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటారని మంత్రి అన్నారు.
addComments
Post a Comment