వైసీపీ నాయకులు ఆర్ధిక సంక్షోభంలోకి రాష్ట్రాన్ని నెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు.

 

*వైసీపీ నాయకులు ఆర్ధిక సంక్షోభంలోకి రాష్ట్రాన్ని నెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు.*

*ఆర్ధికమంత్రి బుగ్గన దొంగ లెక్కలు చెప్పడం మాని ప్రజలకు వాస్తవ ఆర్ధిక పరిస్థితిని వివరించాలి.*

- జి.వి రెడ్డి

టిడిపి జాతీయ అధికార ప్రతినిధి


ఆర్థిక మంత్రి బుగ్గన చెబుతున్న అబద్దాలు చూసి ఆర్ధిక నిపుణులే నివ్వరపోతున్నారని, వైసీపీ చేసిన అప్పులో రూ.30 వేల కోట్ల తగ్గించడం వల్లే ద్రవ్యలోటు 2.1 శాతానికి తగ్గిందని తెదేపా అధికార ప్రతినిధి జి.వి రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై విడుదల చేసిన ప్రకటనలో ప్రస్తుత రాష్ట్ర ద్రవ్యలోటు 5 శాతం పైనే ఉందని అన్నారు.

చేసిన అప్పులను, ఖర్చులను సైతం దాచిపెట్టిన వైసీపీ ప్రభుత్వం...

2021-22 బడ్జట్ లో రూ.37,029 వేల కోట్లే అప్పు చేస్తామని చెప్పారు. కార్పొరేషన్ల అప్పు కాకుండా రూ. 51, 112 కోట్లు అప్పు చేశారు. రూ. 25,194 కోట్లే అప్పు చేశామని నిసిగ్గుగా పచ్చి అబద్దాలు ఆడుతున్నారు. కాగ్ విడుదల చేసిన  నెలవారీ కీలక సూచికల్లో పిబ్రవరి, 2022 నాటికే ఏపీ అప్పు రూ.51,112 కోట్లు ఉంది. దాన్ని మార్చి 2022 నాటికి రూ. 25 వేల కోట్లకు  తగ్గించారు. దొంగ లెక్కలకు అలవాటు పడ్డ వైసీపీ ప్రభుత్వం కాగ్ కు కూడా దొంగలెక్కలు ఇచ్చి మోసం చేస్తోంది.

రాష్ట్రం చేసిన ఖర్చుల్లో కూడా వైసీపీ ప్రభుత్వం దొంగ లెక్కలు చెబుతోంది. ఫిబ్రవరి, 2022 నాటికి ఖర్చులు రూ. 1,68,000 కోట్లు ఉంటే మార్చికి రూ. 1,58,000 కోట్లు చూపించారు. ఇదెలా సాధ్యం. మార్చి మాసంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు లేవా? ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఇతరత్ర ఖర్చులకు ఒక నెలకు ప్రభుత్వంకు దాదాపు రూ. 10 వేల కోట్లు ఖర్చు ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం ఇది చూపించకపోగా తగ్గించి చూపించారు. ఒక్క ఏపీలో తప్పా దేశంలోని ప్రతీ రాష్ట్రంలో పిబ్రవరి ఖర్చులు కంటే మార్చికి పెరిగనట్లు కాగ్ నివేదికలు చెబుతున్నాయి. అంటే వైసీపీ ప్రభుత్వ కాగ్ కు దొంగలెక్కలు చెప్పిందనేది సుస్పష్టం.

వైసీపీ ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక ఆర్ధిక ఉల్లంఘనలు:

వైసీపీ ప్రభుత్వం 2020-21 లో ఖర్చు చేసిన 48,234 కోట్లకు లెక్కలు ఇవ్వమని లేఖలు రాస్తే ఇప్పటివరకు బుగ్గన దగ్గర నుంచి సమాధానం లేదు. వైసీపీ ప్రభుతం గడచిన మూడేళ్లు ఎఫ్.ఆర్.బి.ఎం పరిమితులకు మించి అప్పు చేసింది. రాష్ట్ర ఏకీకృత నిధికి జమ కాకుండా మద్యం ఆదాయంను బేవరేజెస్ కార్పొరేషన్ కు దారిమళ్లించడం ఆర్టికల్ 226 ప్రకారం రాజ్యాంగ వ్యతిరేకం. వైసీపీ ప్రభుత్వం అనేకమార్లు ఖర్చులను పద్దులలో చూపకుండా శాసనసభ అనుమతి లేకుండా ఖర్చు చేశారు. ఇది చట్టసభల ఆమోద ప్రక్రియ లెక్కచేయకపోవడమే. మద్యనిషేదం చేస్తామని మోసపూరిత ప్రకటనలు చేసి లిక్కర్ బాండ్ల పేరుతో 10.45 శాతం అత్యధిక వడ్డీకి  రూ.8,300 కోట్లు అప్పు తెచ్చారు. వీటికి బుగ్గన ఏం సమాధానం చెబుతారు? ఇకనైనా దొంగలెక్కులు చెప్పడం మాని వాస్తవ లెక్కలు ప్రజలకు బహిరంగపరచాలి.

రాష్ట్ర వాస్తవ ఆర్ధిక పరిస్థితి-అప్పులు

24.06.2022 నాటికి AP అప్పు (రూ. కోట్లలో) మొత్తం 

• 31.03.2009 నాటికి ప్రారంభ రుణం రూ. 76,536

• శ్రీ కె రోశయ్య రూ. 25,565

• శ్రీ ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి రూ. 45,949

• కార్పొరేషన్ అప్పులు రూ. 31,153

• 01.04.2009 నుండి 31.05.2014 వరకు అప్పులు రూ. 1,02,667

• 1956 నుండి 31.05.2014 వరకు కలిపి రాష్ట్ర రుణం రూ. 1,79,203

• అవిభక్త రాష్ట్ర రుణం TS @ 41.737% రూ. 1,79,203 = రూ. 74,794

• అవిభక్త రాష్ట్ర రుణం 58.263% AP కి వచ్చింది రూ. 1,79,203     =రూ. 1,04,409

రాష్ట్ర విభజన తర్వాత అప్పులు

• 01.06.2014 నాటికి ప్రారంభ రుణం (X) రూ. 1,04,409 

• ప్రజా రుణం రూ. 1,53,713 

• కార్పొరేషన్ అప్పులు రూ. 31,373

• కాంట్రాక్టర్లు మరియు సరఫరాదారుల బకాయిలు (సుమారు) రూ. 25,000

• శ్రీ ఎన్ చంద్ర బాబు నాయుడు హయాంలో అప్పు రూ. 2,10,086

• 31.03.2019 నాటికి మొత్తం రుణం (X+Y)

 = A (63 సంవత్సరాల రుణానికి) రూ. 3,14,495


01.04.2019 (A) నాటికి ప్రారంభ రుణం రూ. 3,14,495

• ప్రభుత్వ రుణం రూ. 1,85,333

• కార్పొరేషన్ రుణాలు (గమనిక కొన్ని GOలు అందుబాటులో ఉన్నాయి, 

మరికొన్నింటిని రహస్యంగా ఉంచారు) రూ. 1 1,41,761

• అత్యుత్తమ బిల్లులు (కాంట్రాక్టర్లు, సరఫరాదారులు, విద్యుత్,

నిర్వహణ మొదలైనవి, సుమారు) రూ. 1,31,000

• అవుట్‌సోర్స్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులకు బకాయిలు (సుమారు) రూ. 12,650

• వివిధ సంస్థల నుండి తీసుకున్న వివిధ స్థిర డిపాజిట్లు (సుమారు) రూ. 9,580

• ప్రజా రుణం (సుమారుగా) రూ. 19,200 

• పంచాయతీ ఖాతాల నుండి తీసుకోబడిన నిధులు 

(15వ ఆర్దిక సంఘం నిధులు) రూ. 27,660

• లిక్కర్ బాండ్‌లు @ 10.45% వడ్డీ రేటు రూ. 8,300

• శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో తేదీ 24.06.2022 

నాటికి అప్పు (బి) రూ. 5,15,484 

AP అప్పు తేదీ (A+B) రూ. 8,29,979Comments