ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి తమ ప్లాంట్‌ ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన ఏటీసీ టైర్స్‌ డైరెక్టర్‌ తోషియో ఫుజివారా, కంపెనీ ప్రతినిధులు.

 

అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి తమ ప్లాంట్‌ ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన ఏటీసీ టైర్స్‌ డైరెక్టర్‌ తోషియో ఫుజివారా, కంపెనీ ప్రతినిధులు.



విశాఖపట్నం అచ్యుతాపురం వద్ద ఏపీఐఐసీ కేటాయించిన భూమిలో నూతన ప్లాంట్‌ను ఏర్పాటుచేసిన ఏటీసీ టైర్స్‌ ఏపీ ప్రేవేట్‌ లిమిటెడ్, ఈ ఏడాది ఆగష్టు నెలలో నూతన ప్లాంట్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు.


ఏటీసీ – ది యోకోహామా రబ్బర్‌ కో. లిమిటెడ్, జపాన్‌కు పూర్తిగా అనుబంధ సంస్ధ.


ఏటీసీ, ఏటీసీ అనుబంధ కంపెనీలు సంయుక్తంగా అలయెన్స్‌ టైర్‌ గ్రూప్‌ (ఏటీజీ)గా ఏర్పడ్డాయి. ఆఫ్‌ హైవే టైర్ల (ఓహెచ్‌టీ) వ్యాపారంలో ప్రపంచంలో ఏటీజీ ప్రముఖ పేరు. 6 ఖండాల్లోని 120 దేశాలలో ఏటీజీ వ్యాపారాలు. 


ఏటీసీ భారతదేశంలో రెండు తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. ఇందులో ఒకటి తిరునెల్వేలి (తమిళనాడు), మరొకటి దహేజ్‌ (గుజరాత్‌).  


అచ్యుతాపురం వద్ద రూ. 1,750 కోట్లతో ప్లాంట్‌ ఏర్పాటు, ప్రారంభంలో రోజుకు 135 మెట్రిక్‌ టన్నుల ప్రొడక్షన్‌ కెపాసిటీ, 2 వేల మందికి ఉద్యోగావకాశాలు.


అచ్యుతాపురం ప్లాంట్‌లో ఉత్పత్తులు – చిన్న టైర్లు (ఏఎఫ్‌సీ సెగ్మెంట్‌), పెద్ద బయాస్‌ టైర్లు (అగ్రి మరియు కాన్స్‌), రేడియల్‌ టైర్లు (అగ్రి), రేడియల్‌ (ఓటీఆర్‌), బయాస్‌ టైర్, ఓటీఆర్‌ టైర్లు, ఫారెస్ట్రీ టైర్లు, సాలిడ్‌ టైర్లు.


ఈ సమావేశంలో పాల్గొన్న పరిశ్రమలు, పెట్టుబడులు, వాణిజ్యశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఏటీసీ టైర్స్‌ ఏపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్స్‌ ప్రహ్లద్‌ రెడ్డి, అంబరీష్‌ ఆర్‌ షిండే, పీఆర్‌ హెడ్‌ వైవీ. కృష్ణంరాజు, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ సృజన గుమ్మళ్ళ, సీఎంవో అధికారులు.

Comments