తప్పు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదు...
రాత్రిపూట కూల్చివేతలపై కోర్టు వ్యాఖ్యలకు సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారు?...
తెదేపా అధినేత చంద్రబాబు
రాత్రిపూట కూల్చివేతలపై కోర్టు వ్యాఖ్యలకు సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారని.. తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. తప్పు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అయ్యన్నది కబ్జా కాదన్న చంద్రబాబు.. ఇడుపులపాయలో వైఎస్ కుటుంబం 600 ఎకరాల ఎస్సీ భూములు చెరబట్టడం కబ్జా అని ధ్వజమెత్తారు. నిత్యం తెదేపా నేతల హౌస్ అరెస్టులు జగన్ పిరికితనాన్ని చాటుతున్నాయని దుయ్యబట్టారు.
ఛలో నర్సీపట్నం కార్యక్రమానికి వెళ్తున్న నేతలను అరెస్ట్ చేయడం అక్రమమని చంద్రబాబు మండిపడ్డారు. గట్టిగా గళం వినిపిస్తున్న తెదేపా బీసీ నేతలపై కేసులు, అరెస్టులు, ఇళ్లపై దాడులతో జగన్ వేధించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కక్ష సాధింపు కోసం కోర్టు నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రతి అధికారి మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ప్రభుత్వ ప్రాపకం కోసం నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించి అధికారులు చిక్కుల్లో పడవద్దని చంద్రబాబు సూచించారు.
addComments
Post a Comment