యంత్ర సేవా కేంద్రాల ద్వారా రైతులకు ఇక తక్కువ అద్దెకే వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి..

 


విజయవాడ (ప్రజా అమరావతి);*యంత్ర సేవా కేంద్రాల ద్వారా రైతులకు ఇక తక్కువ అద్దెకే వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి..*


*గుంటూరులో జూన్ 7న రైతు గ్రూపులకు ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి*.

*రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ హార్వెస్టర్లు పంపిణీ*.. 

*5,262 రైతు గ్రూపు బ్యాంక్ ఖాతాలకు రూ. 175.61 కోట్ల సబ్సిడీని జమ చేయనున్న సీఎం*. 

*రైతులకు అండగా నిలుస్తున్న కస్టమ్ హైరింగ్ సెంటర్లు (సీహెచ్‌సీ లు), ఆర్బీకేలు*...

*తక్కువ అద్దెకే వ్యవసాయ యంత్రాలు, పరికరాలు*..


రాష్ట్ర రైతాంగం కోసం జగనన్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ‘వైఎస్సార్ యంత్ర సేవ’ పథకం క్రింద రాష్ట్ర స్థాయి మెగా మేళా కార్యక్రమంలో భాగంగా  గుంటూరులో మంగళవారం (జూన్ 7వ తేది) నాడు రైతు గ్రూపులకు ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్ల పంపిణీ కార్యక్రమాన్ని జెండా ఊపి ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. మెగా మేళాలో 5,262 రైతు గ్రూపు బ్యాంక్ ఖాతాలకు రూ.175.61 కోట్ల సబ్సిడీని సీఎం జమ చేయనున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీకే, క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ హార్వెస్టర్ల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 


రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించి, మరింత మెరుగైన ఆదాయం అందించాలనే తపనతో.. వైఎస్సార్ యంత్ర సేవా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసి.. పేద రైతులకు "ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను తక్కువ అద్దెకే' అందుబాటులోకి తెచ్చి సాగు వ్యయం తగ్గించడంతో పాటు నికర ఆదాయం పెంచాలనే సమున్నత లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. రైతన్నలకు తక్కువ అద్దెకే సాగు యంత్రాలు, పనిముట్లు అందుబాటులో ఉంచి, విత్తు నుంచి కోత వరకు అవసరమైన పరికరాలను సకాలంలో అందించడానికి తద్వారా పెట్టుబడి ఖర్చు తగ్గించి రైతన్నలకు మరింత రాబడి అందించేలా, వారికి మంచి జరిగేలా రూ. 2,106 కోట్ల వ్యయంతో ఆర్బీకే స్థాయిలో ఒక్కొక్కటి రూ. 15 లక్షల విలువ గల 10,750 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కొక్కటి రూ. 25 లక్షల విలువ గల కంబైన్డ్ హార్వెస్టర్లతో కూడిన 1,615 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రైతు గ్రూపులే ఈ యంత్ర సేవా కేంద్రాలు నిర్వహిస్తాయి. పంటల సరళి, స్థానిక డిమాండ్ కు అనుగుణంగా కావలసిన యంత్ర పరికరాలను ఎంపిక చేసుకోవడంలో రైతు గ్రూపులదే తుది నిర్ణయంగా ఉంటుంది. అందుబాటులో ఉన్న యంత్ర పరికరాలు, వాటి అద్దె. సంప్రదించ వలసిన వారి వివరాలు రైతు భరోసా కేంద్రాలలో ప్రదర్శిస్తారు. 


రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన రైతు ప్రభుత్వంగా, "వ్యవసాయం దండగ" అంటూ సాగును నిర్లక్ష్యం చేసి అన్నదాతలను కడగండ్ల పాలు చేసిన గత పాలకుల నాటి దుస్థితిని సమూలంగా మారుస్తూ... రైతన్నకు ప్రతి అడుగులోనూ వెన్నుదన్నుగా నిలుస్తూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని పండగగా మార్చింది. "విత్తనం నుండి పంట విక్రయం వరకు అన్ని సేవలు రైతన్న గడప వద్దనే" అందించే వన్ స్టాప్ సెంటర్లుగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేసి, వైఎస్సార్ రైతు భరోసా క్రింద రైతన్నలకు ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తోంది. సాగు చేసి, ఈ-క్రాప్ లో నమోదు చేసుకున్న ప్రతి ఎకరాన్ని పంటల బీమా పరిధిలో చేర్చి రైతులపై పైసా భారం పడకుండా ప్రభుత్వమే భరిస్తూ వైఎస్సార్ ఉచిత పంటల బీమా క్రింద ఒక ఖరీఫ్ కు సబంధించిన బీమా పరిహారం ఆ తరువాతి ఖరీఫ్ ప్రారంభ సమయానికే చెల్లిస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఏ సీజన్ లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగా ఇన్‌ పుట్ సబ్సిడీ అందిస్తూ అన్నివేళలా రైతులకు అండగా ఈ ప్రభుత్వం నిలుస్తోంది. 


రైతులు యంత్ర సేద్యం దిశగా ముందుకు సాగుతున్న తరుణంలో యాంత్రీకరణకు పెద్దపీట వేసి యంత్ర పరికరాలు రైతులకు పెద్ద సంఖ్యలో అందజేస్తుంది. రైతుల గ్రూపులకు 40 శాతం రాయితీతో సబ్సిడీ సాగు యంత్రాలు, వ్యవసాయ పనిముట్లు అందిస్తోంది. అలాగే ఆప్కాబ్, డిసిసిబి ద్వారా యంత్ర పరికరాల ఖరీదులో మరో 50 శాతం రుణాన్ని తక్కువ వడ్డీకే అందిస్తోంది. వైఎస్సార్ యంత్రసేవా పథకం క్రింద మొత్తం సబ్సిడీగా మొత్తం రూ.806 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మంగళవారం నాడు జరిగే మెగా మెళాలో ట్రాక్టర్లతో పాటు అనుసంధాన పరికరాలైన బంపర్, 3 పాయింట్ లింకేజ్, హెచ్ బార్ పరికరాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అలాగే కంబైన్డ్ హార్వెస్టర్ల ఒక ట్రాక్, ఒక సంవత్సరం పాటు సర్వీసింగ్, ఆపరేటర్ కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. డ్రోన్ పరికరాల సహాయంతో పంటలకు సూక్ష్మ ఎరువులు, పురుగు మందులను అందించి రైతన్నలకు పెట్టుబడి ఖర్చును తగ్గించే దిశగా ఈ ఏడాది 2,000 గ్రామాల్లో రైతు సేవా కేంద్రాలకు డ్రోన్స్ కూడా సరఫరా చేసేవిధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. యాంత్రీకరణలో భాగంగా దుక్కి యంత్రాలు, దమ్మచదను చేసే పరికరాలు, వరినాటు యంత్రాలు, నూర్పిడి యంత్రాలు, విత్తనం-ఎరువు పరికరాలు, కలుపుతీసే పరికరాలు, సస్యరక్షణ పరికరాలు, కోతకోసే యంత్రాలు మొదలైనవాటిలో స్థానిక రైతుల అవసరాలకు అనుగుణంగా కావాల్సిన యంత్రాలు, పరికరాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుంది. దీంతో చిన్న, సన్నకారు రైతులతో పాటు పెద్ద రైతులకు కూడా యంత్ర పరికరాలపై చేస్తున్న పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ పథకం ఉపయోగపడుతుంది. Comments
Popular posts
భారత త్రో బాల్ జట్టు కెప్టెన్ శ్రీ చావలి సునీల్ కి ఆర్థిక సహాయం క్రింద 25 లక్షల చెక్కును అందించిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కే. రోజా
Image
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం.
Image
దిశ పెట్రోలింగ్‌ వెహికల్స్‌ను ప్రారంభించనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్*
Image
వీఆర్వో లు రెవెన్యూ చట్టాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని క్షేత్ర స్థాయిలో సక్రమంగా అమలు చేయాలి : జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అనంతపురం,(ప్రజాఅమరావతి ): ఆగస్టు 27: నూతనంగా పదోన్నతులు పొందిన గ్రామ రెవెన్యూ అధికారులు చట్టాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకొని ప్రజలకు సక్రమంగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సూచించారు. గురువారం నూతనంగా పదోన్నతి పొందిన వీఆర్వోలకు 2వ రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ను ఏర్పాటు చేసి గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం స్థాపన కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో విఆర్వోలు అంతా మెరుగ్గా పనిచేసి ప్రభుత్వ లక్ష్యసాధనకు బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి సందేహాలు ఉన్నా వాటిని అనుభవజ్ఞులైన సీనియర్లతో నివృత్తి చేసుకోవాలన్నారు. రెవెన్యూ శాఖ నిర్దేశించిన ఉత్తర్వుల మేరకు వీఆర్వో లు నాలుగు విభాగాలలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఇందులో రెవెన్యూ భూ రికార్డులు, సామాజిక సంక్షేమం, అభివృద్ధి, పోలీసు తదితర విభాగాల వారీగా విధులు నిర్వర్తించాలన్నారు. రెవెన్యూ కు సంబంధించి అన్ని గ్రామ అకౌంట్లు, భూ రికార్డులు పక్కాగా నిర్వహించాలన్నారు. నీటి పన్ను సెస్ తో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించిన వసూళ్లు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ భూములను తనిఖీ చేయాలన్నారు. సర్వే రాళ్లను ప్రతి ఏటా రెండు సార్లు పరిశీలించాలని, రాళ్లు లేనిచోట ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ భూములు, చెట్లు, చెరువులు, ఇతర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యత విఆర్ఓ లపై ఉంటుందన్నారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ రికవరీ చట్టం కింద రికవరీ చేయాల్సి వస్తే ఆ ఆస్తుల వివరాలు అందించి అధికారులకు సహకరించాలన్నారు. అలాగే పోలీసు విధులకు సంబంధించి రెవెన్యూ అధికారులు మెజిస్ట్రేట్ అధికారాలు వినియోగించే సమయంలో వీఆర్వోలు సహాయకులుగా పనిచేయాలని, ఎలాంటి అనుమానిత సమాచారాలు తెలిసినా వాటిని పోలీసులకు అందించాల్సి ఉంటుందన్నారు. నేరాలు జరిగిన సమయంలో ఆధారాలతో వాస్తవ నివేదికలు సమర్పించాలన్నారు. సామాజిక సంక్షేమం, అభివృద్ధి, విధులకు సంబంధించి వివిధ ప్రభుత్వ పథకాలను అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాల్సి ఉంటుందన్నారు. అంటరానితనం నిర్మూలనలో బాధ్యతగా పని చేయాలని, పౌరసరఫరాల విషయంలో అధికారులకు సహకారం అందించాలన్నారు. పంట నష్టం జరిగినప్పుడు ఆ నష్టం అంచనా కు సంబంధించి వ్యవసాయ అధికారులకు సహకారం అందించాలన్నారు. తహశీల్దార్, సబ్ కలెక్టర్, ఆర్డిఓ, జిల్లా కలెక్టర్, రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఆదేశాల మేరకు విధులను వీఆర్వోలు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. అలాగే గ్రామాలలో అవసరమైన సమాచారాన్ని ప్రజలందరికీ చేరువుగా తీసుకువెళ్ళే క్రమంలో దండోరా వేయించడం, లీగల్ నోటీసులు జారీ ప్రక్రియ లాంటి విధులు కూడా వీఆర్వోల పరిధిలో ఉంటాయన్నారు. అందువల్ల ఆయా గ్రామ సచివాలయంలో పనిచేసే విఆర్వోలు ముందస్తుగా చట్టాలపై అవగాహన చేసుకొని జాగ్రత్తగా తమ విధులను నిర్వర్తించాలన్నారు. వీఆర్వోల విధి విధానాల గురించి జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, డిఆర్ఓ గాయత్రీ దేవి, హ్యాండ్ సెట్ సీఈవో హరి ప్రసాద్, కలెక్టరేట్ ఏవో విజయలక్ష్మి, తహసిల్దార్ లు విశ్వనాథ్, నాగరాజు, హరి కుమార్, డి టి శ్రీధర్, పెనుగొండ, కదిరి, కళ్యాణదుర్గం డివిజన్ నుండి 111 మంది పదోన్నతులు పొందిన విఆర్వోలు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు..
Amravati (prajaamaravati), *సోమశిల ప్రాజెక్టు హైలెవెల్‌ లిఫ్ట్‌ కెనాల్‌ రెండో దశ పనులను క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌:* *నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురంలో పైలాన్‌ ఆవిష్కరణ:* ఈ కాలువ ద్వారా దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి, మర్రిపాడు, అనంతసాగరం, ఆత్మకూరు మండలాల్లోని 46,453 ఎకరాలకు సాగు నీరందనుంది. రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో పనులు అప్పగించడం వల్ల రూ.459 కోట్లకే టెండర్‌ ఖరారైంది. దీని వల్ల ఖజానాపై రూ.68 కోట్ల భారం తగ్గింది. *ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..* – పెన్నా నీటిని సద్వినియోగం చేసుకుంటూ, ఇవాళ నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల మెట్ట ప్రాంతాలకు సాగు, తాగు నీరు అందించే సోమశిల రెండో దశ పనులకు ఇక్కడి నుంచి పునాది వేస్తున్నాను. – నీటి విలువ, వ్యవసాయం విలువ తెలిసిన ప్రభుత్వంగా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలలోనిమెట్ట ప్రాంతాలకు నీరు అందించే సోమశిల రెండో దశ పనులకు ఈరోజు వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తున్నాను. – ఈ పనుల ద్వారా ఆత్మకూరు నియోజకవర్గంలో 10,103 ఎకరాలు, ఉదయగిరి నియోజకవర్గంలో 36,350 ఎకరాలకు.. మొత్తంగా 46,453 ఎకరాలకు కొత్తగా నీటి సదుపాయం కల్పించడం జరుగుతుంది. – ఇందుకోసం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లుగా కంప సముద్రం, గుండె మడకల రిజర్వాయర్ల నిర్మాణం, క్రాస్‌ మిషనరీ (సీఎం), క్రాస్‌ డ్రైనేజీ (సీడీ) పనుల ద్వారా 18.5 కి.మీ గ్రావిటీ కాల్వల నిర్మాణం. పంపింగ్‌ స్టేషన్, రెండు ఎలక్ట్రో ప్రెషర్‌ మెయిన్లు.. వీటన్నింటిని నిర్మించబోతున్నాం. – గతంలో ఇదే ప్రాజెక్టును రూ.527.53 కోట్లతో గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా పనులు మొదలు పెట్టినా ఏదీ జరగలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లడం ద్వారా వ్యయాన్ని రూ.459 కోట్లకు తగ్గించడం జరిగింది. తద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.68 కోట్లు ఆదా అయింది. – ఒకే పనికి గతంలో రూ.527 కోట్లు, ఇప్పుడు అదే పనికి రూ.459 కోట్లు అంటే రివర్స్‌ టెండరింగ్‌ ద్వారాఅవినీతికి చెక్‌ పెట్టడం జరిగింది. ఇలా ఎక్కడా అవినీతికి తావు లేకుండా ప్రతి చోటా చర్యలు చేపడుతున్నాం. – ఈ ప్రాజెక్టులో రూ.68 కోట్లు మిగిలించి ఇవాళ పనులు మొదలు పెడుతున్నాం. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేస్తాం. *మరో విషయం:* – ఇదే నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ పనులు కూడా పూర్తయ్యే దశలో ఉన్నాయి. వచ్చే జనవరిలో వాటిని ప్రజలకు అంకితం చేయబోతున్నాం. – వాటి పనులు నత్తనడకన జరుగుతా ఉంటే, పరిస్థితి మార్చాం. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాం. దేవుడి దయతో పనులు పూర్తవుతున్నాయి. – దీంతోపాటు సోమశిల కండలేరు డబ్లింగ్‌ వర్క్స్‌,12 వేల క్యూసెక్కుల నుంచి 24 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి రూ.918 కోట్ల వ్యయంతో పెంచబోతున్నాం. – అదే విధంగా సోమశిల–రాళ్లపాడు డబ్లింగ్‌ వర్క్స్‌, 720 క్యూసెక్కుల నుంచి 1440 క్యూసెక్కుల సామర్థ్యానికి రూ.632 కోట్ల వ్యయంతో పెంచబోతున్నాం. – సాగునీటి రంగంలో జలయజ్ఞం ద్వారా ప్రాధాన్యత క్రమంలో పనులు కొనసాగిస్తున్నాం. 2022 ఖరీఫ్‌ నాటికి నీరు ఇచ్చే విధంగా, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. *ఈ ఏడాదిలో ఆరు ప్రాధాన్యత ప్రాజెక్టులు*.. వంశధార ఫేజ్‌–2. వంశధార–నాగావళి అనుసంధానం, వెలిగొండ ఫేజ్‌–1, అవుకు టన్నెల్, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాం. *మూడు రాజధానులతో పాటు, మూడు ప్రాంతాలకు సమ న్యాయం చేస్తాం.* రాష్ట్రానికి సంబంధించిన సాగు నీటి పనుల్లో ఎక్కడా రాజీ పడబోము. – మూడు ప్రాంతాలకు సమ న్యాయం చేయాలన్న ఉద్దేశంతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు నీరు, తాగు నీటి అవసరాలు తీర్చే విధంగా రూ.40 వేల కోట్లతో రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు చేపడుతున్నాం. – ఉత్తరాంధ్రకు నీటి పరంగా న్యాయం చేసేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని సాకారం చేసేలా రూ.15 వేల కోట్ల ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో రూ.3500 కోట్ల విలువైన పనులకు త్వరలో టెండర్లు పిలవబోతున్నాం. – పల్నాడులో కరువు నివారణ కోసం వైయస్సార్‌ పల్నాడుకరువు నివారణ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. – కృష్ణా నది దిగువన రెండు బ్యారేజీలు, పైన ఒక బ్యారేజీ నిర్మాణంతో పాటు, చింతలపూడి లిఫ్ట్‌ పనుల వేగాన్ని పెంచుతున్నాం. – నీటి విలువ, రైతు విలువ, నీటి ద్వారా ప్రాంతాలకు జరిగే ఆర్థిక న్యాయం, అవసరం తెలిసిన ప్రభుత్వంగా చిత్తశుద్ధితో ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తాము. – దేవుడి దయ, మీ అందరి ఆశీస్పులతో ఇంకా పనులు, కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. అంటూ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రసంగం ముగించారు. ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఆ శాఖ ఈఎన్‌సీ నారాయణరెడ్డి కార్యక్రమంలో పాల్గొనగా, పైలాన్‌ ఆవిష్కరణ వద్ద మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, పలువులు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
Image