నెల్లూరు, జూన్ 29 (ప్రజా అమరావతి): జిల్లాలోని అన్ని ప్రభుత్వ భవన నిర్మాణాలకు సంబంధించి సిమెంట్ బిల్లులను త్వరగా మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టాల
ని జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.
బుధవారం ఉదయం కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో సిమెంట్ బిల్లుల మంజూరు విషయమై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్ లు, డిజిటల్ లైబ్రరీలు, బల్క్ మిల్క్ కేంద్రాల భవన నిర్మాణాలకు సంబంధించి సిమెంటు బిల్లులను త్వరగా అప్ లోడ్ చేసి మంజూరు అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే నాడు నేడు మొదటి విడత కింద వివిధ పాఠశాలల్లో చేపట్టిన ప్రహరీ గోడల నిర్మాణాలు, ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో నిర్మించిన డ్రైనేజీ లకు కూడా సిమెంట్ బిల్లులు సత్వరం చెల్లించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో డ్వామా పిడి శ్రీ తిరుపతయ్య, పంచాయతీరాజ్ ఎస్ ఈ శ్రీ సుబ్రహ్మణ్యం, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ విజయ్ కుమార్, ఏపీ ఈడబ్ల్యుఐడిసి ఈఈ శ్రీనివాస కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment