అమరావతి (ప్రజా అమరావతి);
*విద్యాశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.*
*నాడు–నేడు పనుల ప్రగతితో పాటు విద్యాశాఖలో చేపడుతున్న పలు కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను సీఎంకు వివరించిన అధికారులు.*
*సమీక్షా సమావేశంలో సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే... :*
స్కూల్స్‌లో నాడు–నేడు కింద చేపడుతున్న పనుల ప్రగతిపై సీఎం సమీక్ష.
నాడు–నేడు పనులు వేగవంతం చేయాలని ఆదేశం.
నిర్దేశించుకున్న లక్ష్యం లోగా పనులు పూర్తి కావాలన్న సీఎం.
రెండో దశ నాడు–నేడులో భాగంగా సుమారు 22,344 స్కూల్స్‌లో అభివృద్ధి పనులు.
ఈ నెలాఖరు నాటికి రెండో దశ కింద అన్ని స్కూల్స్‌లో పనులు మొదలు కావాలన్న సీఎం.
మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రతి పాఠశాలలో టీవీలు ఉండేటట్టు చూసుకోవాలి.
బోధన, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మనం పోటీపడుతున్నాం.
నాడు–నేడు పేరుతో సమూల మార్పులు చేపడుతున్న తరుణంలో... టీవీ కూడా ఏర్పాటు చేయాలి.
నాడు నేడు చేపట్టిన స్కూళ్లలో వాచ్‌మెన్ నియామకంపై ఆలోచన చేయాలన్న సీఎం
తద్వారా పాఠశాలలో విలువైన ఆస్తులకు రక్షణ కల్పించగలుగుతామన్న సీఎం
సీబీఎస్‌ఈ అఫిలియేషన్ పొందిన స్కూళ్లపైనా సీఎం సమీక్ష
సీబీఎస్‌ఈ గుర్తింపు పొందిన స్కూళ్లలోని ఉపాధ్యాయులకు ఉత్తమ శిక్షణ అందించాలన్న సీఎం
వీరికి మంచి శిక్షణ అందించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చన్న ముఖ్యమంత్రి
*టీఎంఎఫ్, ఎస్‌ఎంఫ్ పై సమీక్ష.*
టీఎంఎఫ్, ఎస్‌ఎంఎప్ కార్యక్రమాలపై మరింత ధ్యాస పెట్టాలన్న సీఎం
టీఎంఎఫ్, ఎస్‌ఎంఎఫ్‌ను పక్కాగా నిర్వహించాలన్న సీఎం
స్కూళ్లలో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాడు–నేడు చేపట్టిన తర్వాత వాటి నిర్వహణపై ప్రత్యేక ధ్యాస పెట్టాలన్న సీఎం
నిర్వహణ సక్రమంగా చేయకపోతే మరలా మామూలు స్ధితికి వస్తాయి
కాబట్టి స్కూళ్లు, టాయిలెట్లు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్న సీఎం
*విద్యా కానుకపైనా సమీక్ష.*
స్కూళ్లుప్రారంభమయ్యే నాటికి విద్యా కానుక అందించాలన్న సీఎం
ఆ మేరకు సన్నద్దంగా ఉండాలి : అధికారులకు సీఎం ఆదేశం
విద్యాకానుక మెటిరియల్ ఇప్పటికే సిద్దంగా ఉందన్న అధికారులు
బాలికలకు ప్రత్యేకంగా మండలానికి ఒక జూనియర్ కాలేజీ లేదా హైస్కూల్ ప్లస్ లేదా కేజీబీవీ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్న సీఎం
ఇందులో భాగంగా బాలికల కోసం 292 మండలాల్లో ఒక హైస్కూల్‌ను జూనియర్ కాలేజీ లేదా హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేస్తున్నామన్న అధికారులు.
సమీక్షాసమావేశంలో రీడ్ ఎలాంగ్ యాప్ పనితీరుని వివరించిన అధికారులు.
ఇప్పటివరకు సుమారు 57,828 మంది రోజూ ఆ యాప్‌ని వినియోగిస్తున్నారన్న అధికారులు.
ఫొనిటిక్స్ మీద ప్రధానంగా దృష్టి పెట్టాలన్న సీఎం
పిల్లలు పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలబడగలగాలన్న సీఎం
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో తక్కువ ఉత్తీర్ణతాశాతం తక్కువ రావడంపై తప్పుగా భావించనక్కరలేదు.
నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం..
పదోతరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన వారికి నెలలోజుల్లోనే మరలా పరీక్షలు పెడుతూ వాటిని కూడా రెగ్యులర్‌గానే పరిగణిస్తామన్న ముఖ్యమంత్రి
పదోతరగతిలో పాస్ అయినవారికి కూడా ఏదైనా రెండు సబ్జెక్టులలో బెటర్‌మెంట్ రాసుకోవడానికి అనుమతి ఇస్తున్నామన్న విద్యాశాఖ అధికారులు.
సమీక్షా సమావేశానికి హాజరైన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్, ఐ అండ్ పీఆర్ కమిషనర్ టి విజయకుమార్ రెడ్డి, ఇంటర్‌మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎం వీ శేషగిరిబాబు, ఎస్‌ఎస్‌ఏ ఎస్‌పీడీ వెట్రిసెల్వి, బైజూస్ వైస్ ప్రెసిడెంట్ (పబ్లిక్ పాలసీ) సుస్మిత్ సర్కార్, ఇతర ఉన్నతాధికారులు.
addComments
Post a Comment