పర్యావరణ హితం, శారీరక దృఢత్వం, మానసికోల్లాసానికి ప్రతి ఒక్కరూ విరివిగా సైకిళ్లను వినియోగించాలి


నెల్లూరు, జూన్ 3 (ప్రజా అమరావతి): పర్యావరణ హితం, శారీరక దృఢత్వం, మానసికోల్లాసానికి ప్రతి ఒక్కరూ విరివిగా సైకిళ్లను వినియోగించాల


ని జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు పిలుపునిచ్చారు. 

 నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం నిర్వహించిన సైకిల్ ర్యాలీలో చిన్నారులు, యువతీ యువకులతో కలిసి కలెక్టర్ ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుంచి గాంధీబొమ్మ వరకు, గాంధీ బొమ్మ నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు ఎనిమిది కిలోమీటర్ల దూరాన్ని కేవలం 24 నిమిషాల్లో కలెక్టర్ చేరుకున్నారు. 

 ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ సుమారు 100 మంది ఔత్సాహికులు ఈ ర్యాలీ లో ఉత్సాహంగా పాల్గొన్నారని, సైకిళ్ల వినియోగం పెంచేందుకు, కాలుష్య రహిత సమాజం కోసం గత 30 ఏళ్లుగా ప్రపంచ సైకిళ్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. అలాగే జిల్లాలో ఆత్మకూరు ఉప ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఓటర్లను మరింత చైతన్యవంతం చేసేందుకు స్వీప్ నోడల్ అధికారి శ్రీ షణ్ముఖ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులను ఈ ర్యాలీ లో భాగస్వామ్యం చేశామని చెప్పారు. ఓటు విలువ తెలిపేలా ప్లకార్డులతో విద్యార్థులు ర్యాలీలో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రజలకు అవగాహన, చైతన్యం కల్పించే కార్యక్రమాలు అనేకం జరుగుతున్నాయన్నారు. మన జిల్లాలో సుమారు 30 నుంచి 40 వేల మంది సైకిళ్లను వినియోగిస్తున్నారని, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి సైకిళ్ల వినియోగం మరింత పెంచాలన్నారు. సైకిళ్లకు సంబంధించి ట్రాక్ లు, పోటీలు నిర్వహించడానికి జిల్లాలో అన్ని మైదానాల్లో అవసరమైన మౌలిక వసతులు ఉన్నాయని, మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. 

 అనంతరం కలెక్టర్ ర్యాలీలో పాల్గొన్న చిన్నారులతో ముచ్చటిస్తూ ప్రత్యేకంగా అభినందించారు. 

 ఈ  కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి, డిఎఫ్ఓ శ్రీ షణ్ముఖ కుమార్, డిస్టిక్ యూత్ ఆఫీసర్ శ్రీ మహేంద్ర రెడ్డి, సెట్నల్ సీఈవో పుల్లయ్య, చీఫ్ కోచ్ యతిరాజ్ తదితరులు పాల్గొన్నారు.


Comments