దిశా యాప్ నేడు ఒక ఆయుధంగా ఉంది..



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);



* *దిశా యాప్ నేడు ఒక ఆయుధంగా ఉంది..



* *రాజమహేంద్రవరంలో  మహిళా కమిషన్ ఆధ్వర్యంలో 'మహిళా సాధికారత సదస్సు' ..* 


* ' *సబల' ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్ -  2022 కార్యాచరణ* 


 *సబల వాట్సప్ నంబర్  6302666254* 


నేడు సమాజంలో మహిళలకు రక్షణ, భరోసా తీసుకుని వచ్చిన దిశా యాప్ వలన మహిళలకు రక్షణ నిలవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శం అని జిల్లా ఇంఛార్జి, బిసి సంక్షేమం, సమాచార పౌర సంబంధాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ,  రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ లు పేర్కొన్నారు.



గురువారం స్థానిక శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో  మహిళా కమిషన్ ఏడాది కార్యాచరణ - 2022 ('సబల' ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్ ) సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా ఇంఛార్జి మంత్రి, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు తదితరులు హజరయ్యారు. 


 సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ, మహిళలను అబలలుగా కాదు సబలుగా ఉండాలనే ఆలోచన చేసిన వ్యక్తి   జగన్మోహన్ రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కానీ విధంగా సంక్షేమ పథకాలను మహిళలుపేరునే అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మహిళా సాధికారిత ను మరింత పెంపొందించే విధానంలో దిశా చట్టాన్ని రూపుదిద్దాడం జరిగింది. మనది వేద భూమి, కర్మ భూమి అని, మహిళ అపర శక్తిగా దేవతలు రక్షించి ఆదిపరాశక్తి గా కొలుస్తున్నామన్నారు.  జగన్ మోహన్ రెడ్డి వోచ్చాక మహిళలను సబలలుగా మార్చేందుకు ఎన్నో చట్టాలు అమలు చేయాలని సంకల్పం చేశారన్నారు. మహిళలు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకోవాలని పిలుపు నిచ్చారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మ నిర్వహిస్తున్న సబల కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందనడం లో సందేహం లేదన్నారు. రాష్ట్రంలో మహిళల కు అన్ని రంగాల్లో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. అమ్మఒడి, విద్యా కానుక, పౌష్టికాహార పథకం, జగనన్న గోరుముద్దలు, ఇంగ్లీష్ మీడియం లో భోధన, వంటి కార్యక్రమాలు ద్వారా మహిళలు ఆత్మాభిమానం పెంచే దిశలో అడుగులు వేయడం జరుగుతోందన్నారు. ఇతరులకు ఇచ్చే గౌరవం,  సంస్కారం మహిళలు నుంచే నేర్చుకుంటామని అది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం అన్నారు. చదువు, విజ్ఞానం సమాజం పట్ల సంస్కారాన్ని నేర్పిస్తుందన్నారు. నేను నా తల్లి నుంచే ఆ సంస్కారం నేర్చుకుని, మా పిల్లలకు కూడా నేర్పించాన్నారు. . భర్తను కోల్పోయిన స్త్రీని విధవ రాలుగా సమాజంలో స్త్రీలపై వివక్ష భావన ఉందని, అలాంటి దురాచారాలు క్షమించ జాలవన్నరు. తల్లిదండ్రులు పిల్లలకు చదువుతో పాటు సంస్కారం నేర్పాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. బాలికలు చిన్ననాటి నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలన్నారు. 



సదస్సుకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అధ్యక్షత వహిస్తూ, నేడు సమాజంలో మహిళలకు రక్షణ, భరోసా తీసుకుని వచ్చిందని దిశా యాప్ , మహిళలకు రక్షణ గణనీయంగా పెరిగిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. దిశాయాప్ ను ఆడపిల్లకు అండగా నిలిచేలా రక్షణ వ్యవస్థ ను జగన్ మోహన్ రెడ్డి తీసుకుని వోచ్చారన్నారు. మహిళలు పై నేరాలు, దాడులు వ్యక్తిగతం కాదు, ఉమ్మడి భాద్యతగా నేడు సమాజం స్పందించాల్సి ఉందన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ మహిళలకు కలుగ చేస్తున్న దిశా యాప్, దిశా చట్టం, దిశా పోలీస్ స్టేషన్ భరోసా కల్పిస్తున్నారని, అవి మిగిలిన చోట్ల, మిగిలిన రాష్ట్రంలో ఎందుకు ఏర్పాటు చెయ్యలేక పోతున్నారో ఒక ఆలోచన చెయ్యాలన్నారు. రాష్ట్రంలో మహిళలకు రాజకీయంగా ముఖ్యమంత్రి పెద్ద పీట వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకుని రాని పరిస్థితి చూస్తున్నాం. మహిళలు పట్ల నేడు సమాజం దృక్పధం  మారాల్సి ఉందని ఆమె పిలుపునిచ్చారు. మహిళలు పట్ల ఎలా ప్రవర్తించాలి, ఎలా స్పందించాలి అనే అంశాన్ని అన్ని కోణాల్లో చర్చించి పరిస్థితి మార్పు తీసుకుని రావాలని కోరారు. ప్రభుత్వ ఆఫీసు ల్లోనే దాడులు జరుగుతున్నాయని, ఇంక అసంఘటిత కార్మిక రంగం లో పనిచేసే మహిళల స్థితి గురించి కూడా ఆలోచించాలన్నారు.


సీఐడీ అడిషనల్ ఎస్పీ కెజివి సరిత మాట్లాడుతూ మహిళలు అబలలు కాదు సబల అని అందుకు రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులు నిదర్శనం అన్నారు.  జాతీయ మానవ వనరుల లో మహిళలు అగ్ర గామిగా ఉన్న మనం నేడు సమాజాన్ని శాసించే స్థాయికి చేరుకున్నాం అని పేర్కొన్నారు. ఇటువంటి చైతన్య సదస్సుల్లో పురుషులతో ప్రత్యేక సదస్సును నిర్వహించాలని కోరగా అందుకు వాసిరెడ్డి పద్మ గారు అంగీకరించడం జరిగిందన్నారు. మహిళా పక్షపాతిగా నాకు ప్రశంసలు వస్తుంటే దానిని గర్వకారణంగా భావిస్తాను. మహిళా సాధికారిత కోసం వారిలో ఉన్న శక్తి ని గుర్తించి ప్రోత్సహించాలి. రాజకీయ, సామాజిక నేపథ్యంలో వారికి తగిన విధంగా తెలియచేయాలి ఉంది. మనకి మనం తెలుసుకుని మనలో ఉన్న శక్తి, బలం మనకు మనం తెలుసుకోవాలి. ఎవరికి వారు వ్యక్తిగతంగా ఎలా ఉండాలి తెలుసుకోవాలి. "నో" చెప్పగలగాలి.. మనకు ఇష్టం లేకపోతే ఖండించగలిగితే తప్పకుండా మార్పు వస్తుంది. మహిళలల్లో  న్యూనత భావం  తొలగాల్సి ఉందన్నారు. గర్భస్త శిశువు ఆడపిల్ల అని తెలిసిన సమయం నుండే ఆడపిల్ల వివక్ష గురిఅవ్వడం నేడు చూస్తున్నాం అని పేర్కొన్నారు. ప్రశ్నించే దైర్యం మహిళలు పెంచుకోవాలి. సాంకేతికంగా కూడా అవగాహన పెంచుకో వలసిన అవసరం ఉందన్నారు. దిశా యాప్ ద్వారా ఎన్నో విజయగాథలు నేడు చూస్తున్నాం.. చట్టం కంటే ముందే శిక్షా పడేలా యాప్ ద్వారా సాధించ గలిగాం ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను అని పేర్కొన్నారు.


రుడా చైర్ పర్సన్ ఎమ్. షర్మిలా రెడ్డి మాట్లాడుతూ, ఈరోజు ఈ ప్రభుత్వం లో మహిళల హక్కులపై కల్పిస్తూన్న భరోసా, దిశా యాప్ తీసుకుని వొచ్చి అండగా నిలిచారని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా , ప్రతిపథకంలో వెన్నుదన్నుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు


మహిళా సాధికారికత కోసం రాష్ట్ర  ప్రభుత్వం పనిచేస్తున్న తీరు , నవరత్నాల లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. మహిళా చైతన్య కార్యక్రమా ల ద్వారా ఏదైనా సాధించగలం అన్నారు.


కాలేజ్ ప్రిన్సిపల్ సౌదర్య మాట్లాడుతూ, సమాజంలో మహిళలు పట్ల వివక్ష భావం ఉండకూడదని పేర్కొన్నారు.


కాకినాడ దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పి మురళి మాట్లాడుతూ ఎక్కడైతే స్త్రీలు గౌరవించ బడతారో అక్కడ దేవతలు తిరుగుతారని నమ్మే అతి పవిత్రమైన దేశం భారతదేశం అన్నారు. యువత చెడు మార్గాల  వైపు లోను కాకుండా చాగంటి కోటేశ్వరరావు అలాంటి వారు చెప్పే మంచి ప్రవచనాలను విని వాటిని ఆచరించాలన్నారు.  తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు వారే నిర్ణయించి సన్మార్గంలో పెంచాలని కోరారు.


 *మహిళా సాధికారత సదస్సులో విద్యార్థుల స్పందన* 


చొడవరపు కావ్య రాజమహేంద్రి జూనియర్, డిగ్రీ కాలేజ్, రాజమహేంద్రవరం :  

ప్రతి మహిళ తనకు తాను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఆత్మ గౌరవం ఉందన్నారు.ఎప్పుడు మహిళలు రక్షణ పై మాట్లాడు కుంటున్నాము, అంటే అబ్బాయిలకు రక్షణ అవసరం లేదా అంటే ఇద్దరికీ రక్షణ కల్పించాల్సి ఉందన్నది వాస్తవం. అయితే ఆడపిల్లలకు రక్షణ ఉందా అంటే ఉందనే చెప్పాలి వస్తుందన్నారు. ఆడపిల్ల ఎప్పుడు ముగ్గురు రక్షణ వలయంలో జీవిస్తున్నా విషయం కాదనలేము, చిన్నప్పుడు తండ్రి సంరక్షణ, తండ్రి లేకపోతే అన్నదమ్ముల సంరక్షణా, పెళ్లి తరువాత భర్త రక్షణ లోనే మహిళ ఉంటుందని పేర్కొన్నారు. మహిళా సాధికారిత కావాలంటే శక్తి అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎవరికి వారు స్వంత కాళ్లపై నిలబడ గలిగితెనే ఆర్థిక, సామాజిక సాధికారిత పొందగలుగుతారు అన్నది కాదనలేని వాస్తవం అని పేర్కొన్నారు. ఆడ, మగ పిల్లలు ఇద్దరికీ సమాన అవకాశాలు ఇచ్చి ప్రోత్సాహం ఇస్తేనే మహిళలు కోసం ప్రభుత్వాలు, మహిళా కమిషన్ లు వేసే ప్రణాళికలు కార్యరూపం దాల్చడం సాధ్యం అవుతుందన్నారు.


చెరుకూరి కిరణ్మయి, ఆదిత్య ఉమెన్స్ కాలేజీ, రాజమహేంద్రవరం


మహిళా సాధికారికత అంటే మహిళలు సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో ఎదగాల్సి ఉందని, తగిన గుర్తింపు ఇవ్వవలసి ఉంటుందన్నారు. అందుకు ఇంటి నుండి మహిళకు మద్దతు లభిస్తే నే అది సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. నేడు ఆధునిక సమాజంలో పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు ప్రతిభ చూపుతున్నరని, ఐతే అందుకు అనుగుణంగా సరైన  గుర్తింపు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇంట్లో అబ్బాయిలకు ఇచ్చే స్వేచ్చ విషయం లో,  అమ్మాయిలకు ఇచ్చే స్వేచ్ఛ విషయం లో తేడా లేకుండా సమానత్వం చూపడం ద్వారా ఇంటి నుంచే సాధికారికత కు పునాది వేయాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ మహిళా సాధికారత గురించి తెలుసుకో కలగాలని కిరణ్మయి పేర్కొన్నారు.


ఈ సదస్సుకు  రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఇల్లా శివప్రసాద్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ అఫ్లియేటెడ్ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ,  మహిళా కమిషన్ సభ్యులు జయశ్రీ, బి. వినిత, గెడ్డెం ఉమా, లాయర్ హసీనా,  సూర్యప్రభ, పద్మావతి తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, దిశాపోలీస్ స్టేషన్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాల, విద్యావేత్తలు, విద్యార్థులు, ప్రముఖులు పాల్గొన్నారు.


Comments
Popular posts
భారత త్రో బాల్ జట్టు కెప్టెన్ శ్రీ చావలి సునీల్ కి ఆర్థిక సహాయం క్రింద 25 లక్షల చెక్కును అందించిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కే. రోజా
Image
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం.
Image
దిశ పెట్రోలింగ్‌ వెహికల్స్‌ను ప్రారంభించనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్*
Image
వీఆర్వో లు రెవెన్యూ చట్టాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని క్షేత్ర స్థాయిలో సక్రమంగా అమలు చేయాలి : జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అనంతపురం,(ప్రజాఅమరావతి ): ఆగస్టు 27: నూతనంగా పదోన్నతులు పొందిన గ్రామ రెవెన్యూ అధికారులు చట్టాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకొని ప్రజలకు సక్రమంగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సూచించారు. గురువారం నూతనంగా పదోన్నతి పొందిన వీఆర్వోలకు 2వ రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ను ఏర్పాటు చేసి గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం స్థాపన కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో విఆర్వోలు అంతా మెరుగ్గా పనిచేసి ప్రభుత్వ లక్ష్యసాధనకు బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి సందేహాలు ఉన్నా వాటిని అనుభవజ్ఞులైన సీనియర్లతో నివృత్తి చేసుకోవాలన్నారు. రెవెన్యూ శాఖ నిర్దేశించిన ఉత్తర్వుల మేరకు వీఆర్వో లు నాలుగు విభాగాలలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఇందులో రెవెన్యూ భూ రికార్డులు, సామాజిక సంక్షేమం, అభివృద్ధి, పోలీసు తదితర విభాగాల వారీగా విధులు నిర్వర్తించాలన్నారు. రెవెన్యూ కు సంబంధించి అన్ని గ్రామ అకౌంట్లు, భూ రికార్డులు పక్కాగా నిర్వహించాలన్నారు. నీటి పన్ను సెస్ తో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించిన వసూళ్లు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ భూములను తనిఖీ చేయాలన్నారు. సర్వే రాళ్లను ప్రతి ఏటా రెండు సార్లు పరిశీలించాలని, రాళ్లు లేనిచోట ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ భూములు, చెట్లు, చెరువులు, ఇతర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యత విఆర్ఓ లపై ఉంటుందన్నారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ రికవరీ చట్టం కింద రికవరీ చేయాల్సి వస్తే ఆ ఆస్తుల వివరాలు అందించి అధికారులకు సహకరించాలన్నారు. అలాగే పోలీసు విధులకు సంబంధించి రెవెన్యూ అధికారులు మెజిస్ట్రేట్ అధికారాలు వినియోగించే సమయంలో వీఆర్వోలు సహాయకులుగా పనిచేయాలని, ఎలాంటి అనుమానిత సమాచారాలు తెలిసినా వాటిని పోలీసులకు అందించాల్సి ఉంటుందన్నారు. నేరాలు జరిగిన సమయంలో ఆధారాలతో వాస్తవ నివేదికలు సమర్పించాలన్నారు. సామాజిక సంక్షేమం, అభివృద్ధి, విధులకు సంబంధించి వివిధ ప్రభుత్వ పథకాలను అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాల్సి ఉంటుందన్నారు. అంటరానితనం నిర్మూలనలో బాధ్యతగా పని చేయాలని, పౌరసరఫరాల విషయంలో అధికారులకు సహకారం అందించాలన్నారు. పంట నష్టం జరిగినప్పుడు ఆ నష్టం అంచనా కు సంబంధించి వ్యవసాయ అధికారులకు సహకారం అందించాలన్నారు. తహశీల్దార్, సబ్ కలెక్టర్, ఆర్డిఓ, జిల్లా కలెక్టర్, రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఆదేశాల మేరకు విధులను వీఆర్వోలు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. అలాగే గ్రామాలలో అవసరమైన సమాచారాన్ని ప్రజలందరికీ చేరువుగా తీసుకువెళ్ళే క్రమంలో దండోరా వేయించడం, లీగల్ నోటీసులు జారీ ప్రక్రియ లాంటి విధులు కూడా వీఆర్వోల పరిధిలో ఉంటాయన్నారు. అందువల్ల ఆయా గ్రామ సచివాలయంలో పనిచేసే విఆర్వోలు ముందస్తుగా చట్టాలపై అవగాహన చేసుకొని జాగ్రత్తగా తమ విధులను నిర్వర్తించాలన్నారు. వీఆర్వోల విధి విధానాల గురించి జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, డిఆర్ఓ గాయత్రీ దేవి, హ్యాండ్ సెట్ సీఈవో హరి ప్రసాద్, కలెక్టరేట్ ఏవో విజయలక్ష్మి, తహసిల్దార్ లు విశ్వనాథ్, నాగరాజు, హరి కుమార్, డి టి శ్రీధర్, పెనుగొండ, కదిరి, కళ్యాణదుర్గం డివిజన్ నుండి 111 మంది పదోన్నతులు పొందిన విఆర్వోలు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు..
Amravati (prajaamaravati), *సోమశిల ప్రాజెక్టు హైలెవెల్‌ లిఫ్ట్‌ కెనాల్‌ రెండో దశ పనులను క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌:* *నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురంలో పైలాన్‌ ఆవిష్కరణ:* ఈ కాలువ ద్వారా దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి, మర్రిపాడు, అనంతసాగరం, ఆత్మకూరు మండలాల్లోని 46,453 ఎకరాలకు సాగు నీరందనుంది. రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో పనులు అప్పగించడం వల్ల రూ.459 కోట్లకే టెండర్‌ ఖరారైంది. దీని వల్ల ఖజానాపై రూ.68 కోట్ల భారం తగ్గింది. *ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..* – పెన్నా నీటిని సద్వినియోగం చేసుకుంటూ, ఇవాళ నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల మెట్ట ప్రాంతాలకు సాగు, తాగు నీరు అందించే సోమశిల రెండో దశ పనులకు ఇక్కడి నుంచి పునాది వేస్తున్నాను. – నీటి విలువ, వ్యవసాయం విలువ తెలిసిన ప్రభుత్వంగా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలలోనిమెట్ట ప్రాంతాలకు నీరు అందించే సోమశిల రెండో దశ పనులకు ఈరోజు వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తున్నాను. – ఈ పనుల ద్వారా ఆత్మకూరు నియోజకవర్గంలో 10,103 ఎకరాలు, ఉదయగిరి నియోజకవర్గంలో 36,350 ఎకరాలకు.. మొత్తంగా 46,453 ఎకరాలకు కొత్తగా నీటి సదుపాయం కల్పించడం జరుగుతుంది. – ఇందుకోసం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లుగా కంప సముద్రం, గుండె మడకల రిజర్వాయర్ల నిర్మాణం, క్రాస్‌ మిషనరీ (సీఎం), క్రాస్‌ డ్రైనేజీ (సీడీ) పనుల ద్వారా 18.5 కి.మీ గ్రావిటీ కాల్వల నిర్మాణం. పంపింగ్‌ స్టేషన్, రెండు ఎలక్ట్రో ప్రెషర్‌ మెయిన్లు.. వీటన్నింటిని నిర్మించబోతున్నాం. – గతంలో ఇదే ప్రాజెక్టును రూ.527.53 కోట్లతో గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా పనులు మొదలు పెట్టినా ఏదీ జరగలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లడం ద్వారా వ్యయాన్ని రూ.459 కోట్లకు తగ్గించడం జరిగింది. తద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.68 కోట్లు ఆదా అయింది. – ఒకే పనికి గతంలో రూ.527 కోట్లు, ఇప్పుడు అదే పనికి రూ.459 కోట్లు అంటే రివర్స్‌ టెండరింగ్‌ ద్వారాఅవినీతికి చెక్‌ పెట్టడం జరిగింది. ఇలా ఎక్కడా అవినీతికి తావు లేకుండా ప్రతి చోటా చర్యలు చేపడుతున్నాం. – ఈ ప్రాజెక్టులో రూ.68 కోట్లు మిగిలించి ఇవాళ పనులు మొదలు పెడుతున్నాం. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేస్తాం. *మరో విషయం:* – ఇదే నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ పనులు కూడా పూర్తయ్యే దశలో ఉన్నాయి. వచ్చే జనవరిలో వాటిని ప్రజలకు అంకితం చేయబోతున్నాం. – వాటి పనులు నత్తనడకన జరుగుతా ఉంటే, పరిస్థితి మార్చాం. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాం. దేవుడి దయతో పనులు పూర్తవుతున్నాయి. – దీంతోపాటు సోమశిల కండలేరు డబ్లింగ్‌ వర్క్స్‌,12 వేల క్యూసెక్కుల నుంచి 24 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి రూ.918 కోట్ల వ్యయంతో పెంచబోతున్నాం. – అదే విధంగా సోమశిల–రాళ్లపాడు డబ్లింగ్‌ వర్క్స్‌, 720 క్యూసెక్కుల నుంచి 1440 క్యూసెక్కుల సామర్థ్యానికి రూ.632 కోట్ల వ్యయంతో పెంచబోతున్నాం. – సాగునీటి రంగంలో జలయజ్ఞం ద్వారా ప్రాధాన్యత క్రమంలో పనులు కొనసాగిస్తున్నాం. 2022 ఖరీఫ్‌ నాటికి నీరు ఇచ్చే విధంగా, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. *ఈ ఏడాదిలో ఆరు ప్రాధాన్యత ప్రాజెక్టులు*.. వంశధార ఫేజ్‌–2. వంశధార–నాగావళి అనుసంధానం, వెలిగొండ ఫేజ్‌–1, అవుకు టన్నెల్, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాం. *మూడు రాజధానులతో పాటు, మూడు ప్రాంతాలకు సమ న్యాయం చేస్తాం.* రాష్ట్రానికి సంబంధించిన సాగు నీటి పనుల్లో ఎక్కడా రాజీ పడబోము. – మూడు ప్రాంతాలకు సమ న్యాయం చేయాలన్న ఉద్దేశంతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు నీరు, తాగు నీటి అవసరాలు తీర్చే విధంగా రూ.40 వేల కోట్లతో రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు చేపడుతున్నాం. – ఉత్తరాంధ్రకు నీటి పరంగా న్యాయం చేసేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని సాకారం చేసేలా రూ.15 వేల కోట్ల ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో రూ.3500 కోట్ల విలువైన పనులకు త్వరలో టెండర్లు పిలవబోతున్నాం. – పల్నాడులో కరువు నివారణ కోసం వైయస్సార్‌ పల్నాడుకరువు నివారణ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. – కృష్ణా నది దిగువన రెండు బ్యారేజీలు, పైన ఒక బ్యారేజీ నిర్మాణంతో పాటు, చింతలపూడి లిఫ్ట్‌ పనుల వేగాన్ని పెంచుతున్నాం. – నీటి విలువ, రైతు విలువ, నీటి ద్వారా ప్రాంతాలకు జరిగే ఆర్థిక న్యాయం, అవసరం తెలిసిన ప్రభుత్వంగా చిత్తశుద్ధితో ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తాము. – దేవుడి దయ, మీ అందరి ఆశీస్పులతో ఇంకా పనులు, కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. అంటూ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రసంగం ముగించారు. ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఆ శాఖ ఈఎన్‌సీ నారాయణరెడ్డి కార్యక్రమంలో పాల్గొనగా, పైలాన్‌ ఆవిష్కరణ వద్ద మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, పలువులు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
Image