నెల్లూరు (ప్రజా అమరావతి);
కోవిడ్ సమయంలోనూ, క్రిటికల్ స్టేజిలో వున్న పేషెంట్స్ కు రక్తాన్ని దానం చేసి ప్రాణాలు కాపాడటంలో నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ సంస్థ సేవలు ఎనలేనివ
ని జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు.
ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం స్థానిక జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు ముఖ్య అతిధిగా పాల్గొని, అధిక సంఖ్యలో రక్తదానం చేసిన దాతలకు దుశ్శాలువ, జ్ఞాపిక, పతకాలు ప్రదానం చేసి సత్కరించారు.
ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు మాట్లాడుతూ, కోవిడ్ సమయంలోనూ, క్రిటికల్ స్టేజిలో వున్న పేషెంట్స్ కు రక్తాన్ని దానం చేసి ప్రాణాలు కాపాడటంలో నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ సంస్థ సేవలు ఎనలేనివని, రక్తదాతలు ముందుకువచ్చేలా ప్రోత్సహిస్తున్న జిల్లా రెడ్ క్రాస్ సంస్థను ఈ సందర్భంగా అభినందించారు. రాష్ట్రంలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ సంస్థకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ద్వారా కోవిడ్ సమయంలో ప్లాస్మా ను డొనేట్ చేయడం ద్వారా ఎందరో ప్రాణాలను కాపాడుకోగలిగామని కలెక్టర్ అన్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్న సంస్థలో రెడ్ క్రాస్ ఒకటని, ఈ సంస్థ ఇంత ప్రయోజనకరంగా నడవడానికి కృషిచేస్తున్న రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, వారి బృందానికి జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఈ సంస్థ బాగా పనిచేస్తుందని అనేందుకు సంస్థను వరిస్తున్న అవార్డులే ఇందుకు తార్కాణమని అభివర్ణించారు. జిల్లా రెడ్ క్రాస్ సంస్థ పరిధిలోని 15 ప్రొజెక్ట్స్ విజవంతంగా పనిచేస్తున్నాయని, జిల్లాలో మరింత మందికి సేవలందించడంలో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ తమ సేవలను విస్తరించాలన్నారు. ఎంతో మంది రక్తదాతలు స్వచ్చంధంగా ముందుకు వచ్చి రక్తాన్ని దానం చేయడం వలన ఎందరో ప్రాణాలు కాపాడినవారౌతున్నారని, వారిని నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని రక్తదానం చేసేందుకు ముందుకురావాలని జిల్లా కలెక్టర్ కోరారు. నేడు ఎన్నో శస్త్రచికిత్సల్లో రక్తం అవసరం వుందని, ఎక్కడా రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమని, మనిషి రక్తాన్ని దానం చేయడం వల్లనే అది సాధ్యమౌతుందని కలెక్టర్ అన్నారు. ప్రజల్లో వున్న అపోహలను తొలగించి రక్త దానం వలన కలుగు ఫలితాలను తెలియచేసి ఎక్కువ మంది ప్రజలు రక్తదానం చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ వివరించారు.
జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఛైర్మన్ శ్రీ చంద్ర శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ రోజు రాష్ట్రంలో నెల్లూరు జిల్లా బ్లడ్ బ్యాంక్ మొదటి స్థానంలో ఉందని, జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ప్రోత్సాహం, స్పూర్తితో గత రెండు సంవత్సరాల నుండి ప్రజలకు అవసరమైన సేవలందించడం జరుగుచున్నదన్నారు. ఎంతో మంది స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి రక్తాన్ని దానం చేసి ఈ బ్లడ్ సెంటర్లకు ప్రాణదాతలుగా నిలుస్తున్నారన్నారు. సంవత్సరానికి 25 వేల నుండి 30 వేల యూనిట్స్ రక్తాన్ని కనీస ధరతో ప్రజలకు వైద్య సేవలను అందించడం జరుగుచున్నదన్నారు. రెడ్ క్రాస్ సంస్థ బ్లడ్ బ్యాంక్ నందు 3 వేల యూనిట్స్ రక్తాన్ని నిల్వ చేసుకునే సామర్ధ్యం ఉందని, కోవిడ్ సమయంలోనూ, ఎన్నికల సమయంలోనూ నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థ చేసిన సేవలు ప్రజల మన్ననలు పొందాయని అన్నారు. 2019-20, 2020-21 సంవత్సరాలకు నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థ బ్లడ్ బ్యాంకు కు రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా రావడం జరిగిందని, రెడ్ క్రాస్ సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కృషి వల్లనే అది సాధ్యమైందని శ్రీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, రక్త దానం చేయగా, రెడ్ క్రాస్ సంస్థ ఛైర్మన్ శ్రీ చంద్ర శేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కు సర్టిఫికేట్ ను అందచేశారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ వైస్ ఛైర్మన్ శ్రీ దామిశెట్టి సుధీర్ నాయుడు, ట్రెజరర్ శ్రీ సురేశ్, సభ్యులు శ్రీ జి. ప్రసాద్, రంగయ్యనాయుడు, రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment