*విశాఖలో విషవాయువు లీక్ ఘటన ఆందోళనకరం
*
*ఎల్జీ పాలిమర్స్ ఘటన తరువాత కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడలేదు:- టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు*
అమరావతి (ప్రజా అమరావతి):- విశాఖ జిల్లా లో మళ్లీ విషవాయువు లీక్ ఘనట తీవ్ర ఆందోళన కలిగించిందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అచ్యుతాపురం సెజ్ లోని సీడ్స్ కంపెనీ నుంచి గ్యాస్ లీకైన ఘటనలో దాదాపు 200 మంది అస్వస్థతకు గురవ్వడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో అతిపెద్ద విషాదంగా నిలిచిన ఎల్జీ పాలిమర్స్ ఘటన తరవాత కూడా పరిశ్రమల యాజమాన్యాలు, ప్రభుత్వాలు పాఠాలు నేర్చుకోకపోవడం విచారకరమని చంద్రబాబు అన్నారు. అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం బాధితులను ఆదుకోవడమే కాకుండా నిర్లక్ష్యానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలిన డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల పర్యవేక్షణ లోపం, వ్యవస్థల నిర్వీర్యం ప్రజల పాలిట శాపాలుగా మారుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు.
addComments
Post a Comment