రాష్ట్ర గవర్నర్ వారికి ఘన స్వాగతం
తిరుపతి , జూన్ 08 (ప్రజా అమరావతి): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
52వ మరియు 53వ స్నాతకోత్సవంలో కులపతి హోదా లో పాల్గొనడానికి బుధవారం మధ్యాహ్నం 12.00 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న
రాష్ట్ర గవర్నర్ గౌ బిశ్వభూషణ్ హరిచందన్ గారికి ఘన స్వాగతం లభించించింది.
జిల్లా కలెక్టర్ కె వెంకటరమణా రెడ్డి , జెసి బాలాజి , ఎస్పీ పరమేశ్వర రెడ్డి, వైస్ చాన్సిలర్ మహిళా విశ్వవిద్యాలయం జమున , శ్రీకాళహస్తి ఆర్డీఓ హరిత , సెట్విన్ సి ఐ ఓ మురళీకృష్ణ , ఎయిర్ పోర్ట్ సి ఎస్ ఓ రాజశేఖర్ రెడ్డి , తహసీల్దార్ శివప్రసాద్ తదితరులు స్వాగతం పలికిన వారిలో వున్నారు
తిరుమల శ్రీవారిని దర్సించుకుని సాయంత్రం 5.00 గంటలకు తిరుపతి మహతి ఆడిటోరియంలో జరగనున్న స్నాతకోత్సవంలో పాల్గొని రాత్రి 7.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగుప్రయాణం కానున్నారు.
addComments
Post a Comment