*రైతులకు మేలు చేయడంలో..దేశంతో పోటీ పడుతున్నాం*రైతులకు మేలు చేయడంలో..దేశంతో పోటీ పడుతున్నాం:-*


*పంటల బీమా కింద 44.28 లక్షల మంది రైతులకు రూ.6684.84 కోట్లు :-*


*ఏ సీజన్‌లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్‌ ముగిసేలోగానే ఇన్‌ఫుట్‌ సబ్పిడీ :-*


*మూడేళ్లలో రైతులకు ఉచిత విద్యుత్‌ కోసం రూ.25,800 కోట్లు ఖర్చు :-*


*మూడేళ్లలో రైతన్నల కోసం లక్షా 28 వేల కోట్లు ఖర్చు :-*


*ప్రతిపైసా పారదర్శకంగా లబ్ధిదారులకు వెళ్తోంది :-*


*ఆర్‌బీకేలు రైతన్నలను చేయిపట్టుకొని నడిపిస్తున్నాయి :-*


*వైయస్ఆర్‌ ఉచిత పంటల బీమా కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి :-*


సత్యసాయి జిల్లా (చెన్నేకొత్తపల్లి), జూన్ 14 (ప్రజా అమరావతి):-*


రైతులకు మేలు చేయడంలో....దేశంతో పోటీ పడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు.


ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 2021 ఖరీఫ్‌లో వైపరీత్యాలు, చీడపీడల వల్ల పంట నష్టపోయిన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15.61 లక్షల మంది రైతన్నలకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో మంగళవారం రైతన్నల ఖాతాల్లో నేరుగా జమ చేశారు.


ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ....దేవుడి దయతో ఈ రోజు ఇక్కడ కొత్త జిల్లా స్థాపించిన తరువాత సత్యసాయిబాబా జిల్లాగా పేరు పెట్టి ఇక్కడికి రావడం..2978 కోట్ల మేరకు అక్షరాల రూ.15.60 లక్షల మంది రైతులకు మేలు చేస్తూ ఈ రోజు ఒక మంచి కార్యక్రమం జరుగుతోందన్నారు. దేశం యావత్తు ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తోందని చెప్పారు. మూడేళ్లలో రైతన్నల కోసం లక్షా 28 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అన్నదాతలకు అండగా నిలిచిన ప్రభుత్వం మనదని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సగర్వంగా చెప్పారు. ఇంతకు ముందు నానుడి ఉండేది. రాయలసీమ అంటే కరువు సీమ అని..అనంతపురం జిల్లాను ఏకంగా ఎడారి జిల్లా అనేవారు. కానీ ఈ రోజు దేవుడి దయవల్ల అలాంటి వాతావరణం మారిపోయింది అన్నారు. దారాళంగా గంగమ్మ పైకి లేచినట్లుగా ఈ రోజు నీళ్లు పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయి అన్నారు. రిజర్వాయర్లు దేవుడి దయతో నిండాయి. దేవుడి దయతో చెరువులు నిండాయి. గంగమ్మ తల్లి మనందరికీ కూడా కనిపిస్తోందన్నారు.


ఈ రోజు ఇక్కడ రూ.2900 కోట్లు బీమా పరిహారంగా 15.60 లక్షల మంది రైతులకు మేలు చేస్తూ ఈ కార్యక్రమం తలపెట్టాం. ఒక్కసారి ఆలోచన చేయండి ఇదే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇన్సూరెన్స్‌ కింద వస్తున్న సొమ్ము అక్షరాల రూ.880 వేల కోట్లు అందుతున్నాయి. అప్పట్లో నాన్నగారి హాయంలో 800 కోట్లు ఇవ్వడం చూశామని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. అంతకుమించి ఈ రోజు మీరు ఇస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. ఒక్కసారి మార్పును గమనించండి. గతంలో పంట నష్టపరిహారం వస్తుందో, రాదో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఏ సీజన్‌లో నష్టం జరిగితే మళ్లీ మరుసటి ఏడాది అదే సీజన్‌ రాకముందే ఇన్సూరెన్స్‌ సొమ్ము నేరుగా మీ ఖాతాల్లోకి వస్తుంది. ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జాబితాను ప్రదర్శిస్తున్నాం. మార్పులను గమనించాలని మీ అందరిని కోరుతున్నాన్నారు. పంటలకు బీమా ఉండకపోతే, ఆ బీమా అందకపోతే రైతు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో గత పాలనలో చూశాం. పంట నష్టపోతే, రైతు నష్టపోతే ఆ రైతు కుటుంబాలే కాదు..రాష్ట్రం మొత్తం కూడా నష్టపోతుంది. రైతును ఆదుకోవాలని ఉచిత పంటల బీమాపై ప్రత్యేక ధ్యాస పెట్టాం. కరువు,వరదో, తెగులో మరో ఏ కారణంగా నష్టపోయిన రైతుకు మనందరి ప్రభుత్వం గడిచిన మూడేళ్లుగా ఎంత తోడుగా, అండగా నిలబడిందో రెండు మాటల్లో చెబుతాను. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నా అన్నారు.


గత ప్రభుత్వం లో అక్షరాల ఐదు సంవత్సరాలకు కలిపి పంటల బీమా కింద 30.85 లక్షల మంది రైతులకు రూ.3411 కోట్లు మాత్రమే. ఈ రోజు మీ బిడ్డ పాలనలో ఏం జరుగుతోందో గమనించమని కోరుతున్నానన్నారు. ఈ మూడేళ్లలో అక్షరాల 44.28 లక్షల మంది రైతులకు ఉచితంగా పoటల బీమా చేయించడమే కాకుండా రూ.6,685 కోట్లు ఇచ్చామని సగర్వంగా చెబుతున్నాను. తేడాను గమనించమని కోరుతున్నాను. గతంలో 2012–2013కు సంబంధించి బీమా బకాయిలు కూడా రూ.120 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసి ఉంటే కేంద్రం కూడా మిగిలిన సొమ్ము ఇస్తుందని తెలిసినా కూడా గత ఐదేళ్లు ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో 2018లో పంటల బీమా బకాయిలు రూ.590 కోట్లు ఎగురగొట్టారు. ఒక్క పంటల బీమా విషయాన్ని గమనిస్తే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏ రైతు కూడా నష్టపోకూడదని గత పాలనలోని బకాయిలను కూడా మనమే తీర్చుతూ రూ.715 కోట్లు మీ బిడ్డ ప్రభుత్వమే చెల్లించిందని సగర్వంగా చెబుతున్నాను. తేడా గమనించాలన్నారు. గత ప్రభుత్వం ఎక్కడా కూడా బకాయిలు వదిలేసి కట్టని పరిస్థితి గమనించండి. మన ప్రభుత్వంలో ఏ సీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్‌ మరుసటి ఏడాది కల్లా నష్టపరిహారాన్ని అందజేస్తున్నాం. రైతులకు మేలు చేసే విషయంలో ఇవాళ గర్వంగా చెబుతున్నాను. ఈ రోజు గత పాలకులతో కాదు..దేశంతో పోటీపడుతున్నామని సగర్వంగా చెబుతున్నానన్నారు. 


ఈ రోజు దేశం మొత్తం కూడా వ్యవసాయరంగంలో జరుగుతున్న మార్పులను మన రాష్ట్రానికి వచ్చి చూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా మనరాష్ట్రంలోని మార్పులను గమనించి దేశం మొత్తం మీద ఎలా అమలు చేయాలని ఆలోచన చేస్తున్నారు. మన మూడేళ్ల పాలనలో కొన్ని ఉదాహరణలు చెబుతాను. ఒక్కసారి మీ గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయాలని కోరుతున్నాను. ఈ మార్పులు మనకళ్లేదుట జరిగాయా లేదా ఆలోచన చేయాలన్నారు. వైయస్ఆర్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం కింద అక్షరాల 53 లక్షల కుటుంబాలకు మంచి చేస్తూ ఈమూడేళ్ల కాలంలోనే రూ.23,875 కోట్లు ఈ ఒక్క పథకం ద్వారానే నేరుగారైతుల చేతుల్లో పెట్టాం అన్నారు. జూన్‌ మాసంలో వ్యవసాయం పండుగగా మారే మాసం. ఆ నెల రాకముందే వ్యవసాయ పనులకు తోడుగా నిలబడేందుకు రైతు భరోసా సొమ్ము రూ.7500 ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ చేశాం అన్నారు. చరిత్రలో ఎప్పుడు జరగని, చూడని విధంగా రైతుల కోసం మనందరి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం రైతుల కోసం చేసిన ఖర్చు అక్షరాల రూ.1.28 లక్షల కోట్లు నేరుగా ఇచ్చామని సగర్వంగా చెబుతున్నానన్నారు. ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ మూడేళ్ల కాలంలోనే వైయస్ఆర్‌ పంటల బీమా సొమ్ము కింద రూ. 6685 కోట్లు ఇచ్చాం. ఇది రైతులకు ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే పూర్తిగా ప్రీమియం చెల్లిస్తూ ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. గతంలో మాదిరిగా కాకుండా అందరికీ పరిహారం ఇస్తున్నాం. ఈ రోజు ప్రతి ఎకరానికి కూడా మనగ్రామంలోనే మన ఆర్బీకేలోనే ఈ–క్రాప్‌చేయించి పారదర్శకంగా పరిహారం ఇస్తున్నామని సగర్వంగా చెబుతున్నాను. ఏ పంట సీజన్‌లోజరిగిన నష్టానికి అదే సీజన్‌లో పరిహారం ఇస్తున్నాం అన్నారు. గతంలో చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా దేశం మొత్తం కూడా ఏపీని చూసేందుకు వస్తున్నారు. ఒక్కసారి గమనించండి. ఎక్కడైనా వర్షం, కరువు కారణంగా నష్టపోతే  ఇన్‌పుట్‌ సబ్సిడీ సొమ్ము రైతులకు నేరుగా అందిస్తున్నాం అన్నారు. సబ్సిడీ రూపంలో రూ.1613 కోట్లు ఇచ్చాం. ఈ మూడేళ్ల కాలంలోనే వడ్డీ లేని రుణాల కింద రూ.1283 కోట్లు చెల్లించాం అన్నారు. గత ప్రభుత్వంలో సున్నా వడ్డీ కింద రూ.780 కోట్లు మాత్రమే. మన ప్రభుత్వం మూడేళ్లలో రూ.1200 కోట్లు చెల్లించాం అన్నారు.


ఈ మూడేళ్లలో మనం ఏర్పాటు చేసిన 10778 రైతు భరోసా కేంద్రాలు మన కళ్లెదుటే మన గ్రామంలోనే ఆర్‌బీకేల్లో మనపిల్లలు పని చేస్తున్నారు. 24480 మంది ఆర్‌బీకేల్లో మనపిల్లలు సేవలందిస్తున్నారు. ప్రతి అంశంలోనూ ఆర్‌బీకేలు సలహాలు ఇస్తున్నాయి.విత్తనం నుంచి విక్రయం వరకు రైతులను చేయ్యి పట్టుకుని నడిపిస్తున్నారు. కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్ల ద్వారా యంత్ర సామగ్రిని అందుబాటులోకి తీసుకువచ్చాం అన్నారు. రైతులకు ఈ మూడేళ్లలోనే ఉచిత విద్యుత్‌ కింద పగటి పూట 9 గంటల పాటు విద్యుత్‌ ఇస్తున్నాం. ఈ ఒక్క పథకానికే రూ.25800 కోట్లు ఖర్చు చేశాం అన్నారు. రైతులకు నిరంతరాయంగా పగటి పూట ఉచిత విద్యుత్‌ ఇవ్వాలంటే మరో రూ.1700 కోట్లు ఖర్చు చేస్తున్నాం అన్నారు. గత ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్‌కు రూ.8750 కోట్లు బకాయిలు పెడితే..ఆ బకాయిలు కూడా మన ప్రభుత్వమే భరించిందన్నారు. ధాన్యం చెల్లింపులకు గత ప్రభుత్వం రూ.960 కోట్లు బకాయిలు పెడితే..రైతులకు డబ్బులు ఇవ్వకపోతే ఆడబ్బులు కూడా మన ప్రభుత్వమే చెల్లించాం అన్నారు. విత్తనాల కొనుగోలు కోసం గత ప్రభుత్వం రూ.430 కోట్లు బకాయిలు పెడితే మనమే ఇచ్చామని సగర్వంగా చెబుతున్నానన్నారు.


ఈ రోజు ఏ రైతు కూడా తాను పండించిన పంటను అమ్ముకునేవిషయంలో నష్టపోకూడదని రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. ఆర్‌బీకేలతో అనుసంధానంచేశాం. ప్రకృతి వైఫరీత్యాల కోసం రూ.2 వేల కోట్లతో నిధి ఏర్పాటు చేశాం. ప్రతి ఏడాది వచ్చిన నష్టాన్ని భర్తీ చేస్తున్నాం. మార్పులు గమనించమని కోరుతున్నాం. ప్రభుత్వం ఒక వైపు నవరత్నాలు పథకాల ద్వారా తోడుగా ఉంటునే మరో వైపు వ్యవసాయానికి ఇస్తున్న ప్రోత్సాహకాలు చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా చేస్తున్నాం. దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు ఆత్మహత్యలు చేసుకుంటే అవి ఆత్మహత్యలు కాదని గత ప్రభుత్వం చెప్పేది. ఈ రోజు ఎవరైనా రైతు చనిపోతే ఆ కుటుంబానికి పక్కాగా ఆదుకునే కార్యక్రమం జరుగుతోంది. కౌలు రైతులు సీసీఆర్‌సీ కార్డుఉంటే వెంటనే ప్రభుత్వం ఆదుకుంటుంది. రూ.7 లక్షల నష్టపరిహారం ఇస్తున్నాం అన్నారు. 458 కుటుంబాలకు చంద్రబాబు పరిహారం ఇవ్వకపోతే.. జగనన్న ప్రభుత్వం మాత్రమే వారికి ఇచ్చిందన్నారు. పాడి రైతులకు మంచి చేయడానికి అమూల్‌ను తీసుకు వచ్చాం అన్నారు అవినీతి లేకుండా, వివక్ష లేకుండా పథకాలు అమలు చేస్తున్నాం అన్నారు. ఒక్కపైసా కూడా అవినీతి లేదు..మీ బిడ్డ బటన్‌ నొక్కుతున్నాడు.. నేరుగా మీ చేతికే వస్తోంది అన్నారు. గతంలో ఇది ఎందుకు జరగలేదు? అప్పుడు నేరుగా గత పాలకుల జేబుల్లోకి డబ్బులు పోయేవి అన్నారు. గతంలో జరగనిది.. ఇప్పుడు మీ బిడ్డ పాలనలో జరుగుతుంది. గతంలో మాదిరిగా మోసాలు చేసే పరిస్థితి లేదు. మాట ఇచ్చి తప్పితే.. రైతు ఏమవుతాడన్న బాధ కూడా గత పాలకులకు లేదని మనం చూశాం అన్నారు.


2 సంవత్సరాల కోవిడ్‌ తర్వాత టెన్త్‌పరీక్షలు జరిగాయిన్నారు. పరీక్షలు లేకుండా పాస్‌చేసుకుంటూ రెండేళ్లు వచ్చాం. 67శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు. గుజరాత్‌లో 65శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. సప్లిమెంటరీ తీసేసి.. రెగ్యులర్‌గానే వారిని భావిస్తూ వారికి మళ్లీ పరీక్షలు పెడుతున్నాం అన్నారు. మన పిల్లలకు ఇవ్వాల్సింది క్వాలిటీ చదువులు. ప్రపంచంతో పోటీపడేటప్పుడు వారి చదువుల్లో క్వాలిటీ ఉండాలన్నారు. మీ బిడ్డ మంత్రివర్గంలో 70శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మంత్రులుగా ఉన్నారు. సామాజిక న్యాయానికి నిజమైన అర్థం చెప్తున్నాం. ఉద్యోగుల విషయంలో కూడా ఇదే ధోరణి. ఉద్యోగులకు ప్రతి విషయంలో మంచి చేస్తున్నాం. దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులతో మీ బిడ్డ ఎవ్వరినైనా ఎదుర్కోగలడ‌ని సీఎం వైయ‌స్ జ‌గన్ మోహ‌న్ రెడ్డి త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.


Comments