నెల్లూరు, (ప్రజా అమరావతి);
ఆతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటు హక్కు కలిగివుండటంతో పాటు, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా పారదర్శకంగా విజ్ఞతతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాల
ని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు పేర్కొన్నారు.
బుధవారం ఉదయం ఆత్మకూరు పట్టణంలోని ఆనం సంజీవరెడ్డి డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన స్వీప్ (Systematic Voters Education and Electorl Participation) కార్యక్రమంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీ కె.వి.ఎన్ చక్రధర్ బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ఆతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటు హక్కు కలిగివుండటంతో పాటు, తమ ఓటు హక్కును వినియోగించాలన్నారు. ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన యువత ఓటు హక్కుపై అవగాహన కలిగి, ఓటు హక్కును పొందటంతో పాటు ఎలాంటి ప్రలోభాలకు తావులేకుండా పారదర్శకంగా తమ ఓటు హక్కును వినియోగించాలని జిల్లా కలెక్టర్, విద్యార్థులకు సూచించారు. ఓటు హక్కు పొందటం ద్వారా భారత దేశ పౌరులుగా గుర్తించబడటంతో పాటు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, బాధ్యతలు సంక్రమిస్తాయని కలెక్టర్ తెలిపారు. ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికలు జరుగుచున్న నేపథ్యంలో ఓటు హక్కు కలిగిన ప్రతిఒక్కరు ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు. యువ ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడమే కాకుండా ఇతరులు కూడా వారి ఓటు ను వేసేలా తెలియచేయాలని కలెక్టరు తెలిపారు.
డి.ఎఫ్.ఓ, స్వీప్ కార్యక్రమ నోడల్ అధికారి శ్రీ షణ్ముక కుమార్ మాట్లాడుతూ, జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు మేరకు, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీ చక్రధర్ బాబు పర్యవేక్షణలో ఓటు హక్కు వినియోగంపై విస్తృతంగా ప్రజలకు, కళాశాల విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని ప్రత్యేక మొబైల్ యాప్ లను రూపొందించడం జరిగిందని, ఓటర్లు తమ ఓటు వివరాలను తెలుసుకొనుటకు Voter Helpline యాప్ ను , ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఏ పౌరుడైన ఉల్లంఘించిన ఎడల ఎన్నికల సంఘం కు ఫిర్యాదు చేయుటకు C Vigil అనే యాప్ ను, వికలాంగుల సౌకర్యార్థం వారి ఓటు హక్కును వినియోగించుకొనుటకు PWD యాప్ ను రూపొందించడం జరిగిందన్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి యాప్స్ ను డౌన్లోడ్ చేసుకుని తన పేరు, వివరాలు నమోదు చేయగానే పనిచేయడం ప్రారంభమవుతుందన్నారు.
అనంతరం డి.ఎఫ్.ఓ శ్రీ షణ్ముక కుమార్,
ఓటు హక్కు వినియోగంపై విద్యార్థుల తో ప్రతిజ్ఞ చేయించారు.
తదుపరి ఆత్మకూరు పట్టణంలో నిర్వహించిన ఓటు హక్కు అవగాహన ర్యాలీ లో జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ శ్రీ బాపిరెడ్డి, మునిసిపల్ కమీషనర్ శ్రీ రమేష్ బాబు, ఎ.ఎస్.ఆర్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ శ్రీ సుబ్బారెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment