తిరుపతి (ప్రజా అమరావతి);
*తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో హిల్టాప్ ఎస్ఈజెడ్ డెవలప్మెంట్ ఇండియా ప్రైవైట్ లిమిటెడ్( అపాచీ) భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం శ్రీ వైయస్.జగన్.*
*ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...:*
అపాచీ ప్రతినిధులకు అభినందనలు.
ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అపాచీ గ్రూపు అంటే ఆడిడాస్ షూలు తయారు చేసే కంపెనీ.
ఇక్కడ ఈ సంస్ధ ఏర్పాటు వల్ల దాదాపుగా 10 వేల మందికి నేరుగా ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తోంది. మంచి ఉపాధి అవకాశాలు రావడమే కాకుండా సుమారు రూ.800 కోట్ల పెట్టుబడులతో ఇక్కడ నిర్మాణాలు ప్రారంభమవుతాయి. 2006లో నాన్నగారు (దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్.రాజశేఖరరెడ్డి) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు... ఇదే అపాచి, ఆడిడాస్ కంపెనీలను తడలో ఏర్పాటు చేయించారు. ఈ రోజు తడలో ఈ ఒక్క కంపెనీలోనే 15వేల మంది పనిచేస్తున్నారు. అందులో దాదాపు 60 శాతం మంది చెల్లమ్మలే పనిచేస్తున్నారు. ఉద్యోగాలకు మంచి కేంద్రంగా నిల్చింది. ఆ తర్వాత ఇదే అపాచీ కంపెనీకి సంబంధించి... ఇటీవల పులివెందులలో మరో 2వేల మంది చెల్లెమ్మలకు ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైన పనులకు శంకుస్ధాపన చేశాం. మరో 9 నెలల కాలంలో అవి కూడా పనులు పూర్తి చేసుకుని ప్రాజెక్టు ఉత్పత్తి ప్రారంభిస్తుంది.
ఇవాళ మనం శంకుస్ధాపన చేస్తున్న ప్రాజెక్టు కూడా మరో 15 నెలల్లోనే అంటే... సెప్టెంబరు 2023 నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తుంది. దీనివల్ల 10 వేల మందికి నేరుగా ఉద్యోగఅవకాశాలు వస్తాయి. ఇందులో 80 శాతం మంది చెల్లమ్మలే ఉద్యోగులుగా ఉంటారు. ఇలాంటి మంచి కార్యక్రమానికి శంకుస్ధాపన చేసే అవకాశం దేవుడు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
ఇక ఫ్యాక్టరీకి సంబంధించిన యాజమాన్యానికి మరొక్కసారి అభినందనలు. మీకు ఏ రకమైన సమస్య ఉన్నా ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ప్రభుత్వం అందుబాటులో ఉంటుంది. మీకు ఏ రకమైన సమస్యలున్నా మా సమస్యలుగా భావించి వాటి పరిష్కారానికి కృషి చేస్తాం. 2023 సెప్టెంబరు నాటికి ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే.. 10వేల మందికి ఉపాధి కల్పిస్తూ... ఈ ప్రాంతంలో కొత్త ఉషోదయం మొదలవుతుందని ఆశిస్తున్నాను అని సీఎం తన ప్రసంగం ముగించారు.
addComments
Post a Comment