మొగల్తూరు, (ప్రజా అమరావతి);
రాష్ట్రంలో జరుగు తున్న అభివృద్ధి సామాన్యుని జీవితం స్థిరంగా ఉండేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని
రాష్ట్ర సమాచార,సినిమాటోగ్రఫీ బి.సి సంక్షేమ శాఖా మాత్యులు శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు.
శనివారంనాడు మొగల్తూరు మండలం కాళీపట్నం వెస్ట్ గ్రామం వంతెన వద్ద 12 కోట్ల రూపాయలతో నిర్మించబోయే ఆర్.అండ్.బి రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు.
కాళీ పట్నంలో 23 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, 40 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయం ప్రారంభోత్సవ చేశారు.
రూ. 83 లక్షల జేజేఎమ్ నిధులతో ఇంటింటికి కుళాయి కనెక్షన్ పనులకు , మంచినీటి సరఫరా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు. అనంతరం మన బడి నాడు-నేడు 2 వ విడత కార్యక్రమంలో భాగంగా రూ. 30 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన ఎంపీపీ స్కూల్ ప్రారంభోత్సవ చేశారు.
మన బడి నాడు-నేడు 2 వ విడత కార్యక్రమంలో భాగంగా 80 లక్షల రూపాయలతో జెడ్పీ హైస్కూల్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే కార్యక్రమంలో పాల్గొంన్నారు.
అనంతరం హైస్కూల్ ప్రాంగణంలో జరిగే పబ్లిక్ మీటింగ్ లో మంత్రి పాల్గొని మాట్లాడుతూ గ్రామ సచివాలయం భనం ప్రారంభోత్సవం చేయడం, రోడ్డుకు, వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటి ఇంటి కి మంచినీటి సరఫరా చేసే పథకానికి శంకుస్థాపన చేయడం నా అదృష్టం గా భావిస్తున్నాను అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే జరుగు తున్న అభివృద్ధి సామాన్యుని జీవితం స్థిరంగా సాగుతుంటే ప్రతిపక్షాలు మాటలు సాగవని గత మూడు నెలలనుండి కుట్రలు చేస్తున్నారని అన్నారు. బిసి లమనోభావాలను గుర్తించిన మన ముఖ్యమంత్రి ఈ పదవు ఇచ్చారని అన్నారు.స్వాతంత్ర్య0 వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయినా పేదవాడు పెడవాడుగానే మిగిలి పోయారని పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచేస్తున్నారని అన్నారు. ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేస్తున్న ముఖ్యమంత్రి పై అని పార్టీ లు కలిసి కుట్రలు చేస్తున్నారని అన్నారు.
ప్రభుత్వం చీఫ్ , నర్సాపురం సశనసభ్యులు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడానికి ఈ గ్రామాల్లో 12 కోట్ల రూపాయలు, అభివృద్ధి కార్యక్రమాలు 21 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. కాళీ పట్నం జమీoదారిభూములు, దర్బారేవు కంపెనీ భూములు, ఎల్ బి చర్ల పట్టభూములు ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్నాయని, ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టి కి తీసుకు రాగా త్యరలో పరిష్కరించబడు తుందని అన్నారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ కౌవురు శ్రీనివాస్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డ నుండి ముసలి వరకు ప్రతివాక్కరికి వివిధ పథకాల ద్వారా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో యం బి సి చైర్మన్ పేండ్ర.వీరన్న, శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల.తమ్మయ్య, డి సి యం యస్ చైర్మన్ వేండ్ర వెంకట స్వామి,పురపాలక సంఘం ఛైర్పర్సన్ శ్రీమతి బర్రి.శ్రీ వెంకటరమణ,జెడ్ పి సి సభ్యులు తిరుమాని.బాపూజీ,బొక్కా.రాధాకృష్ణ,యం పి పి మైలాబత్తుల.సోని,మాజీ అప్కాభ్ చైర్మన్ అండ్రాజు చల్లా రావు, ప్రజా ప్రతినిదులు ,వివిధ శాఖలు అధికారులు ,వివిధ స్థాయి నాయకులు, తది తరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment