తిరుమల శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రిని మరింతగా అనుగ్రహించమని కోరుకున్నా: సమాచార శాఖ మంత్రి

 


*తిరుమల శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రిని మరింతగా అనుగ్రహించమని కోరుకున్నా: సమాచార శాఖ మంత్రి


*


తిరుమల, జూన్17 (ప్రజా అమరావతి): తిరుమల శ్రీవారిని ప్రాతః కాల అభిషేక సేవలో స్వామి వారిని సేవించి దర్శించుకున్న రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ, సినిమాటోగ్రఫీ మరియు వెనుక బడిన తరగతుల శాఖా మంత్రి వర్యులు శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ.


స్వామి వారి దర్శన అనంతరం ఆలయ వెలుపల మీడియా తో మంత్రి మాట్లాడుతూ ముందుగా ఓం నమో వెంకటేశాయ వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాణ్డె నాస్తి కించనః వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని స్వామి వారిని స్మరిస్తూ ఈ రోజు పెరుమాల్ని స్వామివారిని ప్రాతఃకాల సేవలో సేవించి, తాను ప్రధానంగా వేడుకున్నది కోరుకున్నది ఏమంటే  ఈ రాష్ట్రంలో తర తరాలుగా పేదరికంలో ఉండిన వారి ప్రార్థనల ఫలంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలనలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.  ముఖ్యమంత్రి ఆలోచన ఎప్పుడూ కూడా పేదరికంలో మగ్గుతున్న  ప్రజల, పలు సమస్యలతో బాధపడుతున్న వారి జీవితాల్లో ఒక మంచి మార్పు తీసుకురావాలని  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న మనసున్న ముఖ్యమంత్రి అని కొనియాడారు. వీటి ఫలితంగా ప్రజలు సుస్థిరమైన జీవనాన్ని సాగించే దిశగా పాలన అందిస్తున్నారు అన్నారు.  ప్రధానమైనటువంటి విద్యాపరమైన అంశాలు చూస్తే ఇంగ్లీష్ మీడియం కానీ, నాడు - నేడు కార్యక్రమం కానీ, జబ్బు చేసినప్పుడు వైద్యం కోసం డబ్బు లేక విలవిలలాడుతున్న ప్రజలకు నేనున్నాను అని ఆరోగ్యశ్రీ ని ప్రవేశపెట్టి ఆదుకుంటున్న ఘనత మన ముఖ్యమంత్రిది అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇన్ని మంచి కార్యక్రమాలు చేపడుతున్న జగన్మోహన్ రెడ్డి పాలనను కొంత మంది కక్ష కట్టి పేదవాడైన వారిని మళ్ళీ పేదవాడిగానే మిగల్చాలి అనీ వారి ఎదుగుదల సహించం  అనే దురుద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నారు. స్వామి వారు ఈ కుట్రలను అన్నింటినీ విఫలం చేయమని, ఏ సత్సంకల్పంతో అయితే స్వామి ఆశీస్సులతో  పాలకుడైనటువంటి జగన్ మోహన్ రెడ్డి గారిని మరింతగా అనుగ్రహించమని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగించమని, ఇప్పటికే సకాలంలో వర్షాలు పడి రైతులు సుభిక్షంగా తన పంటలు వేసుకొని ఇంటికి తెచ్చుకొని ఆనంద పడుతున్న  ఇటువంటి తరుణంలో, ఈ రాష్ట్రంలో ఉత్తమ పారిశ్రామిక విధానాన్ని, అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద స్వామి వారి సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించమని స్వామి వారిని వేడుకున్నానని తెలిపారు.Comments