*నాలుగు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం*
అమరావతి, జూన్ 3 (ప్రజా అమరావతి)
: ఆంధ్రప్రదేశ్ కోటాలో నాలుగు రాజ్యసభ స్థానాలకు వై.ఎస్.ఆర్.సి.పి.కి చెందిన నలుగు సభ్యులు వి.విజయ సాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, ఎస్.నిరంజన్ రెడ్డి మరియు ఆర్.కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. శుక్రవారం అమరావతి శాసన సభ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి మరియు రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి పి.వి. సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ కోటాలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈ నలుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ప్రకటిస్తూ వారికి దృవీకరణ పత్రాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ శాసన సభకు ఎన్నిక కాబడిన సభ్యులచే రాజ్యసభకు నలుగురు (4) సభ్యుల ఎన్నికకు వై.ఎస్.ఆర్.సి.పి.కి చెందిన ఈ నలుగురు సభ్యులు మాత్రమే నామినేషన్లను దాఖలు చేయడం వల్ల సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఈ నెల 1 వ తేదీన నామినేషన్ పత్రాల పరిశీలన పూర్తవ్వడం మరియు నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజైన నేటి మధ్యాహ్నం 3.00 గంటల లోపు అభ్యర్థిత్వ ఉపసంహరణ నోటీసులు ఎటు వంటివి అందకపోవడంతో ఈ నలుగురు సభ్యుల ఎంపిక ఏకగ్రీవం అయినట్లుగా ప్రకటిస్తూ దృవీకరణ పత్రాలను అందజేయడం జరిగింది.
addComments
Post a Comment