కోవిడ్‌ కారణంగా తలెత్తిన ఆర్థిక ఒడిదుడుకులు దేశ ఆర్థికాభివృద్ధి గమనాన్ని దారుణంగా దెబ్బతీశాయి.




అమరావతి (ప్రజా అమరావతి);

*219 వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం.*

*–సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ అధ్యక్షతన క్యాంప్‌కార్యాలయంలో ఎస్‌ఎల్‌బీసీ సమావేశం.*

*–హాజరైన వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు*


*2022–23 వార్షిక రుణ ప్రణాళికను వెల్లడించిన ఎస్‌ఎల్‌బీసీ:*

*–2022–23 వార్షిక రుణ ప్రణాళిక మొత్తం : రూ.,3,19,480కోట్లు*

*– ఇందులో 51.56శాతం వ్యవసాయ రంగానికి (రూ.1,64,740కోట్లు)*

*– మొత్తంగా ప్రాథమిక రంగానికి 73.76శాతం (రూ. 2,35,680 కోట్లు)*


*ఈసందర్భంగా సీఎం ఏమన్నారంటే...:*

– కోవిడ్‌ కారణంగా తలెత్తిన ఆర్థిక ఒడిదుడుకులు దేశ ఆర్థికాభివృద్ధి గమనాన్ని దారుణంగా దెబ్బతీశాయి.

– కోవిడ్‌ ప్రభావం తగ్గుతున్న కొద్దీ తిరిగి ఆర్థిక వ్యవస్థ కోలుకునే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి.

– 2021–22లో దేశ జీడీపీ రూ.237 లక్షల కోట్లు కాగా, ప్రస్తుత ధరల సూచీ ప్రకారం జీడీపీ వృద్ధి అంచనా 19.5శాతంగా ఉంది. 

– అయితే అంతకంతకూ పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అంతర్జాతీయంగా ఉన్న భౌగోళిక రాజకీయ ఘర్షణలు, దీనికారణంగా వస్తున్న ఒత్తిళ్లతో ముడిచమురు, బొగ్గు ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. 

– ఈ ఏడాది ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం 7.79శాతానికి చేరిందని కేంద్ర గణాంకాలశాఖ వివరాలు వెల్లడించింది. గత 8 ఏళ్ల వ్యవధిలో ఇదే అత్యధికం. నిరాశ కలిగించే మరొక విషయం ఏంటంటే... గ్రామీణ ప్రాంతాల్లో కూడా ద్రవ్యోల్బణం అత్యధికంగా 8.38శాతం ఉంది. 

– ఈ కారణాల వల్ల రిజర్వ్‌ బ్యాంకు మే 6న నగదు నిల్వల నిష్పత్తిని 50 బేసిక్‌ పాయింట్లు పెంచింది. అలాగే రెపోరేటును 40 బేసిక్‌ పాయింట్లు పెంచింది. జూన్‌లో దీన్ని మరో 50 బేసిక్‌ పాయింట్లకు రిజర్వ్‌బ్యాంకు పెంచింది. ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి కనిపిస్తోంది. 

– ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు  త్రైమాసికాలలో ద్రవ్యోల్బణం 6శాతానికి పైబడి ఉంటుందని ఆర్బీఐ అంచనావేసింది. దీనివల్ల నగదు నిల్వలు క్రమంగా తగ్గుతాయి. 

– ఈ పరిణామాలన్నీ కూడా దిగువ తరగతి వారిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. తయారీ రంగంపైకూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. సరుకులు కొనేవారు లేకపోతే, వారు పరిశ్రమలను మూసివేసే పరిస్థితి వస్తుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాలి.

–ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకులు విశేష కృషిచేయాల్సిన అవసరం ఉంది. ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకునేలా అవసరమైన చర్యలను తీసుకోవాలి. తక్కవ వడ్డీలకు విరివిగా రుణాలు ఇవ్వాలి. 

– ప్రభుత్వం తాను చేయాల్సిందంతా చేస్తోంది. అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, ప్రత్యక్షంగా నగదు బదిలీచేస్తోంది. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదును బదిలీ చేస్తోంది. ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టి, వారిని సాధికారితవైపు నడిపించడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుంటోంది.


– ఎన్నో అవరోధాలు ఉన్నప్పటికీ 2020–21లో నిర్దేశించుకున్న వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాన్ని అధిగమించి 133.19శాతం చేరుకోవడం మనసారా అభినందనీయం. కొన్ని రంగాల్లో బ్యాంకుల పనితీరు ప్రశంసనీయం. అగ్రికల్చర్‌ టర్మ్‌ లోన్‌ విషయానికొస్తే వార్షిక రుణ ప్రణాళికలో నిర్దేశించుకున్న దానికన్నా 167.27శాతం సాధించారు. అలాగే ప్రాథమికేతర రంగానికి నిర్దేశించుకున్నదానికంటే రెట్టింపు రుణాలు అంటే 208.48శాతం ఇచ్చారు. 

– అయితే మరికొన్ని రంగాల్లో పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఎగుమతులకోసం నిర్దేశించుకున్న దాంట్లో 31.01 శాతం, విద్యారంగానికి సంబంధించి 50.03శాతం, హౌసింగ్‌కు సంబంధించి 36.11శాతం మాత్రమే రుణాలు ఇచ్చారు. సామాజిక ఆర్థిక ప్రగతిలో విద్య, హౌసింగ్‌.. ఈ రెండుకూడా అత్యంత కీలకమైనవి. ఈ రంగాలకు సంబంధించి బ్యాంకులు మరింత సానుకూల దృక్పథంతో ముందడుగువేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. 

– అలాగే వ్యవసాయరంగానికి ఇచ్చే రుణాలను పరిశీలిస్తే ఖరీఫ్‌లో షార్ట్‌ టర్మ్‌ క్రాప్‌ ప్రొడక్షన్‌ రుణాలు 87.40శాతం, అదే ఖరీఫ్‌లో అగ్రికల్చర్‌ టర్మ్‌ లోన్స్‌ 59.88శాతం  మాత్రమే ఇచ్చారు. కాని వార్షిక రుణ ప్రణాళికను పరిశీలిస్తే మాత్రం లక్ష్యానికి మించి ఇచ్చారు. రబీ సీజన్‌ గణనీయంగా ఉండడం, ఆ సమయంలో పనితీరు బాగుండడం దీనికి కారణంగా కనిపిస్తోంది. కాకపోతే ఖరీఫ్‌ సీజన్‌లో ఎందుకు రుణ పంపిణీ లక్ష్యాలను చేరుకోలేకపోయామన్న విషయంపై బ్యాంకులు దృష్టిపెట్టాలని కోరుతున్నాను. 

– అలాగే వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యంలో 82.09శాతం, పౌల్ట్రీకి సంబంధించి 60.26శాతం మాత్రమే రుణాలు ఇచ్చారు. ఈ రంగాలకు రుణ పంపిణీలో సమస్యలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను కోరుతున్నాను. 

– అలాగే 2021–22లో నిర్దేశించుకున్న మొత్తంలో కౌలు రైతులకు కేవలం 42.53శాతమే రుణాలు అందాయి. వీరికి రుణాలు అందించడంపై బ్యాంకర్లు మరింత శ్రద్ధపెట్టాలి. రైతులు, కౌలు రైతులు సాగుచేస్తున్న ప్రతి కమతాన్ని కూడా ఇ–క్రాపింగ్‌ చేస్తున్నాం. సాగుచేస్తున్న కౌలు రైతుల్ని సులభంగా ఈ డేటా ద్వారా గుర్తించవచ్చు. ఈ డేటాను పరిగణలోకి తీసుకుని వారికి విరివిగా రుణాలు ఇచ్చి, బ్యాంకర్లు అండగా నిలవాలి. ఆర్బీకేలు, బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు ఇద్దరూ కూడా కౌలు రైతులకు ఈ విషయంలో సహాయకారిగా నిలవాలి.


– చిరువ్యాపారులకు, సంప్రదాయ హస్తకళాకారులకు జగనన్న తోడు అండగా నిలుస్తోంది. వడ్డీలేకుండా రూ.10వేల చొప్పున రుణాలు బ్యాంకుల ద్వారా ఇప్పిస్తోంది. వడ్డీభారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. బ్యాంకులు కూడా ఉత్సాహంగా పనిచేస్తూ దాదాపుగా 14.15లక్షల మందికి జగనన్న తోడు కింద రుణాలు ఇచ్చాయి. ఇదే ధోరణిని కొనసాగించాలని కోరుతున్నాను. తదుపరి విడత రుణాలు జులైలో ఇచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నాం. 


– 2021–22లో ఎంఎస్‌ఎంఈలకు 90.55శాతం రుణాలు ఇచ్చారు. ఈ రంగంలో కూడా లక్ష్యం కంటే తక్కువగా రుణాలు ఇచ్చారు. దీనిపై బ్యాంకులు దృష్టిపెట్టాలని కోరుతున్నాను. 


– రాష్ట్రంలో భారీ ఎత్తున గృహనిర్మాణం జరుగుతోంది:

– విలువైన భూముల పట్టాలను పేదలకు అందించడం జరిగింది:

– వీటిపై అప్పులు ఇవ్వడం ద్వారా బ్యాంకులిచ్చే రుణాలకు తగిన భద్రత ఉంది:

– పేదలకు అండగా నిలవాలని బ్యాంకులకు విజ్ఞప్తిచేస్తున్నాను:

– ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకుంటుంది:

– టిడ్కో ఇళ్లకు సంబంధించి కూడా లబ్ధిదారులతో బ్యాంకులు టైప్‌ కావాల్సి ఉంది:

– ఈ అంశంపై బ్యాంకులు దృష్టిపెట్టాలి:


– రాష్ట్రంలో మహిళా సాధికారిత కోసం విశేష కృషిచేస్తున్నాం. ఈకార్యక్రమంలో దాదాపు కోటిమంది మహిళలు లబ్ధిపొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనైనా, అర్భన్‌ ప్రాంతాల్లోనైనా మహిళా సాధికారిత ద్వారానే ఆర్థిక ప్రగతి సాధ్యం. వడ్డీలేని రుణాలు, ఆసరా, చేయూత.. తదితర కార్యక్రమాల ద్వారా మహిళలకు ఈ ప్రభుత్వంగా అండగా నిలుస్తోంది. ఈ మహిళలకు బ్యాంకులు అండగా నిలవాలి. తీసుకున్న రుణాలను మహిళలు కూడా క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. వారికిచ్చే రుణాలపై వడ్డీరేట్లను తగ్గించాల్సిన అవసరం ఉంది. కార్పస్‌ ఫండ్‌ కింద బ్యాంకుల వద్ద ఉన్న మహిళలు  డబ్బుపై కేవలం 4 శాతం వడ్డీ ఇస్తున్నారని, కానీ తీసుకున్న రుణాలపై అధికంగా వడ్డీని వసూలు చేస్తున్నారని మహిళలు అంటున్నారు. ఈ అంశంపై బ్యాంకులు దృష్టిసారించాలి. మహిళలపై వడ్డీ భారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. 


– అంతేకాక ప్రభుత్వం ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న అంశాలకు  బ్యాంకులు సహకారం అందించాలి:

– వార్షిక రుణ ప్రణాళికలో ఈ అంశాలను ప్రయార్టీగా తీసుకోవాలి:

– దీనికోసం వార్షిక రుణ ప్రణాళిక తయారీలో ప్రభుత్వాధికారుల భాగస్వామ్యాన్నికూడా తీసుకోవాలి:

– దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతలుగా నిర్దేశించుకున్న అంశాలకు వార్షిక ప్రణాళికలో చోటు దక్కతుంది:

– ప్రభుత్వం ఏయే అంశాలపై దృష్టిపెడుతుంది, వాటికి ఏ రకంగా బ్యాంకులనుంచి మద్దతు లభించాలన్నదానిపై తగిన కసరత్తు జరుగుతుంది:

– దీనివల్ల ఆయా రంగాలకు మేలు జరుగుతుంది:


– ఆర్బీకేల్లో డ్రోన్లను తీసుకు వస్తున్నాం:

– వ్యవసాయ రంగంలో అత్యాధునికతకు పెద్దపీట వేస్తున్నాం:

– ఈ రంగంలో నైపుణ్యాభివృద్ధిని పెంచుతున్నాం:

– నిరుద్యోగులకు ఉపాధి కూడా లభిస్తుంది:

– డ్రోన్‌ టెక్నాలజీకి బ్యాంకర్లు సహకారం అందించాలి:


– రాష్ట్రంలో మౌలికసదుపాయాలను పెద్ద ఎత్తున కల్పిస్తున్నాం:

– హార్బర్లు, పోర్టులను నిర్మిస్తున్నాం:

– వీటికీ బ్యాంకులు తగిన రీతిలో సహకారం అదించాలి:


– వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్న నగదును బ్యాంకులు మినహాయించుకోకూడదు:

– దీనిపై కేంద్ర ప్రభుత్వమే మార్గదర్శకాలు జారీచేసింది:

– ఒక ప్రత్యేక ఉద్దేశంతో, ఒక లక్ష్యంకోసం ఈ పథకాలు అమలు చేస్తున్నాం:

– ఈ అంశాన్ని బ్యాంకులు దృష్టిలో ఉంచుకోవాలి:


– కోవిడ్‌ సమయంలో బ్యాంకులు ప్రభుత్వానికి చాలా బాగా సహకరించినందుకు బ్యాంకర్లందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను:

Comments
Popular posts
భారత త్రో బాల్ జట్టు కెప్టెన్ శ్రీ చావలి సునీల్ కి ఆర్థిక సహాయం క్రింద 25 లక్షల చెక్కును అందించిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కే. రోజా
Image
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం.
Image
దిశ పెట్రోలింగ్‌ వెహికల్స్‌ను ప్రారంభించనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్*
Image
వీఆర్వో లు రెవెన్యూ చట్టాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని క్షేత్ర స్థాయిలో సక్రమంగా అమలు చేయాలి : జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అనంతపురం,(ప్రజాఅమరావతి ): ఆగస్టు 27: నూతనంగా పదోన్నతులు పొందిన గ్రామ రెవెన్యూ అధికారులు చట్టాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకొని ప్రజలకు సక్రమంగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సూచించారు. గురువారం నూతనంగా పదోన్నతి పొందిన వీఆర్వోలకు 2వ రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ను ఏర్పాటు చేసి గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం స్థాపన కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో విఆర్వోలు అంతా మెరుగ్గా పనిచేసి ప్రభుత్వ లక్ష్యసాధనకు బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి సందేహాలు ఉన్నా వాటిని అనుభవజ్ఞులైన సీనియర్లతో నివృత్తి చేసుకోవాలన్నారు. రెవెన్యూ శాఖ నిర్దేశించిన ఉత్తర్వుల మేరకు వీఆర్వో లు నాలుగు విభాగాలలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఇందులో రెవెన్యూ భూ రికార్డులు, సామాజిక సంక్షేమం, అభివృద్ధి, పోలీసు తదితర విభాగాల వారీగా విధులు నిర్వర్తించాలన్నారు. రెవెన్యూ కు సంబంధించి అన్ని గ్రామ అకౌంట్లు, భూ రికార్డులు పక్కాగా నిర్వహించాలన్నారు. నీటి పన్ను సెస్ తో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించిన వసూళ్లు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ భూములను తనిఖీ చేయాలన్నారు. సర్వే రాళ్లను ప్రతి ఏటా రెండు సార్లు పరిశీలించాలని, రాళ్లు లేనిచోట ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ భూములు, చెట్లు, చెరువులు, ఇతర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యత విఆర్ఓ లపై ఉంటుందన్నారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ రికవరీ చట్టం కింద రికవరీ చేయాల్సి వస్తే ఆ ఆస్తుల వివరాలు అందించి అధికారులకు సహకరించాలన్నారు. అలాగే పోలీసు విధులకు సంబంధించి రెవెన్యూ అధికారులు మెజిస్ట్రేట్ అధికారాలు వినియోగించే సమయంలో వీఆర్వోలు సహాయకులుగా పనిచేయాలని, ఎలాంటి అనుమానిత సమాచారాలు తెలిసినా వాటిని పోలీసులకు అందించాల్సి ఉంటుందన్నారు. నేరాలు జరిగిన సమయంలో ఆధారాలతో వాస్తవ నివేదికలు సమర్పించాలన్నారు. సామాజిక సంక్షేమం, అభివృద్ధి, విధులకు సంబంధించి వివిధ ప్రభుత్వ పథకాలను అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాల్సి ఉంటుందన్నారు. అంటరానితనం నిర్మూలనలో బాధ్యతగా పని చేయాలని, పౌరసరఫరాల విషయంలో అధికారులకు సహకారం అందించాలన్నారు. పంట నష్టం జరిగినప్పుడు ఆ నష్టం అంచనా కు సంబంధించి వ్యవసాయ అధికారులకు సహకారం అందించాలన్నారు. తహశీల్దార్, సబ్ కలెక్టర్, ఆర్డిఓ, జిల్లా కలెక్టర్, రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఆదేశాల మేరకు విధులను వీఆర్వోలు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. అలాగే గ్రామాలలో అవసరమైన సమాచారాన్ని ప్రజలందరికీ చేరువుగా తీసుకువెళ్ళే క్రమంలో దండోరా వేయించడం, లీగల్ నోటీసులు జారీ ప్రక్రియ లాంటి విధులు కూడా వీఆర్వోల పరిధిలో ఉంటాయన్నారు. అందువల్ల ఆయా గ్రామ సచివాలయంలో పనిచేసే విఆర్వోలు ముందస్తుగా చట్టాలపై అవగాహన చేసుకొని జాగ్రత్తగా తమ విధులను నిర్వర్తించాలన్నారు. వీఆర్వోల విధి విధానాల గురించి జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, డిఆర్ఓ గాయత్రీ దేవి, హ్యాండ్ సెట్ సీఈవో హరి ప్రసాద్, కలెక్టరేట్ ఏవో విజయలక్ష్మి, తహసిల్దార్ లు విశ్వనాథ్, నాగరాజు, హరి కుమార్, డి టి శ్రీధర్, పెనుగొండ, కదిరి, కళ్యాణదుర్గం డివిజన్ నుండి 111 మంది పదోన్నతులు పొందిన విఆర్వోలు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు..
Amravati (prajaamaravati), *సోమశిల ప్రాజెక్టు హైలెవెల్‌ లిఫ్ట్‌ కెనాల్‌ రెండో దశ పనులను క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌:* *నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురంలో పైలాన్‌ ఆవిష్కరణ:* ఈ కాలువ ద్వారా దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి, మర్రిపాడు, అనంతసాగరం, ఆత్మకూరు మండలాల్లోని 46,453 ఎకరాలకు సాగు నీరందనుంది. రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో పనులు అప్పగించడం వల్ల రూ.459 కోట్లకే టెండర్‌ ఖరారైంది. దీని వల్ల ఖజానాపై రూ.68 కోట్ల భారం తగ్గింది. *ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..* – పెన్నా నీటిని సద్వినియోగం చేసుకుంటూ, ఇవాళ నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల మెట్ట ప్రాంతాలకు సాగు, తాగు నీరు అందించే సోమశిల రెండో దశ పనులకు ఇక్కడి నుంచి పునాది వేస్తున్నాను. – నీటి విలువ, వ్యవసాయం విలువ తెలిసిన ప్రభుత్వంగా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలలోనిమెట్ట ప్రాంతాలకు నీరు అందించే సోమశిల రెండో దశ పనులకు ఈరోజు వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తున్నాను. – ఈ పనుల ద్వారా ఆత్మకూరు నియోజకవర్గంలో 10,103 ఎకరాలు, ఉదయగిరి నియోజకవర్గంలో 36,350 ఎకరాలకు.. మొత్తంగా 46,453 ఎకరాలకు కొత్తగా నీటి సదుపాయం కల్పించడం జరుగుతుంది. – ఇందుకోసం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లుగా కంప సముద్రం, గుండె మడకల రిజర్వాయర్ల నిర్మాణం, క్రాస్‌ మిషనరీ (సీఎం), క్రాస్‌ డ్రైనేజీ (సీడీ) పనుల ద్వారా 18.5 కి.మీ గ్రావిటీ కాల్వల నిర్మాణం. పంపింగ్‌ స్టేషన్, రెండు ఎలక్ట్రో ప్రెషర్‌ మెయిన్లు.. వీటన్నింటిని నిర్మించబోతున్నాం. – గతంలో ఇదే ప్రాజెక్టును రూ.527.53 కోట్లతో గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా పనులు మొదలు పెట్టినా ఏదీ జరగలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లడం ద్వారా వ్యయాన్ని రూ.459 కోట్లకు తగ్గించడం జరిగింది. తద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.68 కోట్లు ఆదా అయింది. – ఒకే పనికి గతంలో రూ.527 కోట్లు, ఇప్పుడు అదే పనికి రూ.459 కోట్లు అంటే రివర్స్‌ టెండరింగ్‌ ద్వారాఅవినీతికి చెక్‌ పెట్టడం జరిగింది. ఇలా ఎక్కడా అవినీతికి తావు లేకుండా ప్రతి చోటా చర్యలు చేపడుతున్నాం. – ఈ ప్రాజెక్టులో రూ.68 కోట్లు మిగిలించి ఇవాళ పనులు మొదలు పెడుతున్నాం. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేస్తాం. *మరో విషయం:* – ఇదే నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ పనులు కూడా పూర్తయ్యే దశలో ఉన్నాయి. వచ్చే జనవరిలో వాటిని ప్రజలకు అంకితం చేయబోతున్నాం. – వాటి పనులు నత్తనడకన జరుగుతా ఉంటే, పరిస్థితి మార్చాం. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాం. దేవుడి దయతో పనులు పూర్తవుతున్నాయి. – దీంతోపాటు సోమశిల కండలేరు డబ్లింగ్‌ వర్క్స్‌,12 వేల క్యూసెక్కుల నుంచి 24 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి రూ.918 కోట్ల వ్యయంతో పెంచబోతున్నాం. – అదే విధంగా సోమశిల–రాళ్లపాడు డబ్లింగ్‌ వర్క్స్‌, 720 క్యూసెక్కుల నుంచి 1440 క్యూసెక్కుల సామర్థ్యానికి రూ.632 కోట్ల వ్యయంతో పెంచబోతున్నాం. – సాగునీటి రంగంలో జలయజ్ఞం ద్వారా ప్రాధాన్యత క్రమంలో పనులు కొనసాగిస్తున్నాం. 2022 ఖరీఫ్‌ నాటికి నీరు ఇచ్చే విధంగా, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. *ఈ ఏడాదిలో ఆరు ప్రాధాన్యత ప్రాజెక్టులు*.. వంశధార ఫేజ్‌–2. వంశధార–నాగావళి అనుసంధానం, వెలిగొండ ఫేజ్‌–1, అవుకు టన్నెల్, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాం. *మూడు రాజధానులతో పాటు, మూడు ప్రాంతాలకు సమ న్యాయం చేస్తాం.* రాష్ట్రానికి సంబంధించిన సాగు నీటి పనుల్లో ఎక్కడా రాజీ పడబోము. – మూడు ప్రాంతాలకు సమ న్యాయం చేయాలన్న ఉద్దేశంతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు నీరు, తాగు నీటి అవసరాలు తీర్చే విధంగా రూ.40 వేల కోట్లతో రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు చేపడుతున్నాం. – ఉత్తరాంధ్రకు నీటి పరంగా న్యాయం చేసేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని సాకారం చేసేలా రూ.15 వేల కోట్ల ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో రూ.3500 కోట్ల విలువైన పనులకు త్వరలో టెండర్లు పిలవబోతున్నాం. – పల్నాడులో కరువు నివారణ కోసం వైయస్సార్‌ పల్నాడుకరువు నివారణ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. – కృష్ణా నది దిగువన రెండు బ్యారేజీలు, పైన ఒక బ్యారేజీ నిర్మాణంతో పాటు, చింతలపూడి లిఫ్ట్‌ పనుల వేగాన్ని పెంచుతున్నాం. – నీటి విలువ, రైతు విలువ, నీటి ద్వారా ప్రాంతాలకు జరిగే ఆర్థిక న్యాయం, అవసరం తెలిసిన ప్రభుత్వంగా చిత్తశుద్ధితో ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తాము. – దేవుడి దయ, మీ అందరి ఆశీస్పులతో ఇంకా పనులు, కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. అంటూ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రసంగం ముగించారు. ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఆ శాఖ ఈఎన్‌సీ నారాయణరెడ్డి కార్యక్రమంలో పాల్గొనగా, పైలాన్‌ ఆవిష్కరణ వద్ద మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, పలువులు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
Image