గుండెలపై కుంపటిలా పోస్ట్ కోవిడ్ సమస్యలు

 గుండెలపై కుంపటిలా పోస్ట్ కోవిడ్ సమస్యలు 
సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్ వెల్లడి 


 సత్తెనపల్లి (ప్రజా అమరావతి): ప్రస్తుతం సమాజంలో 40 సంవత్సరములు పైబడిన వారందరూ గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవడం అత్యవసరమని  శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ గ్రూప్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరెక్టర్ డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్ సూచించారు.  కోవిడ్‌ వచ్చాక సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడం, ఆరోగ్య తనిఖీలు చేయించుకోక పోవడం, సరైన పోషకాహారం, తగు వ్యాయామం, విశ్రాంతి తీసుకోక పోవడం, ఆల్కహాలు సేవించడం, పొగ త్రాగడం, దినచర్యలో ఒత్తిడికి గురవ్వడంతో హృద్రోగ సమస్యలు ఎదురవుతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. పోస్ట్ కోవిడ్ సమస్యలు గుండెలపై కుంపటిలా తయారయ్యాయన్నారు.  శ్రీ దత్త హాస్పిటల్స్ ఆధ్వర్యంలో స్థానిక కాకతీయ కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన గ్రామీణ వైద్యుల అవగాహన సదస్సులో డాక్టర్ కృష్ణకాంత్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఇంకా షుగర్, మెదడు, నరములు, ఊపిరితిత్తులు, యూరాలజీ, గైనకాలజీ సమస్యలు గురించి డాక్టర్ గార్లపాటి జ్ఞానేశ్వరి, డాక్టర్ ఎమ్ బి నవీన్ కుమార్, డాక్టర్ పి. మహేశ్వర రావు, డాక్టర్ ఏ. మణికంఠ సురేష్, డాక్టర్ మృదుల తేజస్వి తదితరులు మాట్లాడారు. అనంతరం పలువురు గ్రామీణ వైద్యులు అడిగిన సందేహాలకు ఆయా విభాగాల డాక్టర్లు సమాధానాలు ఇచ్చారు. ఈ అవగాహన సదస్సుకు దాదాపు 400 మంది గ్రామీణ వైద్యులు హాజరయ్యారు. కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments