ఏపిఎస్ఆర్టిసి చైర్మన్, వైస్ చైర్మన్ లకు క్యాబినెట్ హోదా

 *ఏపిఎస్ఆర్టిసి చైర్మన్, వైస్ చైర్మన్ లకు క్యాబినెట్ హోదా*



అమరావతి, జూన్ 20 (ప్రజా అమరావతి):  ఏపిఎస్ఆర్టిసి చైర్మన్ ఎ.మల్లికార్జున రెడ్డికి మరియు వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్ మెట్టపల్లి చిన్నప్పరెడ్డి విజయానంద రెడ్డికి క్యాబినెట్ హోదాను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడివిడిగా ఉత్తర్వులను సోమవారం జారీచేసింది.   సాధారణ పరిపాలన (పొలిటికల్) శాఖ ఈ ఏడాది మే 17 న జారీ చేసిన జి.ఓ.ఎంఎస్.నెం.36 లో పేర్కొన్న విధంగా ”ఎస్” కేటగిరీ క్రింద ఈ క్యాబినెట్ హోదాను ఖరారు చేయడం జరిగిందని ఆ  ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది. 

 

Comments