గ్రామాల అభివృద్ధి దిశగా కేంద్రం పథకాలు ప్రశంసనీయం: గౌ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ.

 

గ్రామ్ స్వరాజ్ మరియు 75 సం. ల గ్రామీణ భారతం పై చర్చా వేదికలో పాల్గొన్న హయాణా గవర్నర్ 

గ్రామీణ భారతమే భారతదేశ ఆత్మ- గ్రామాల అభివృద్ది ద్వారానే గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం ఏర్పడుతుంది

గ్రామాల అభివృద్ధి దిశగా కేంద్రం పథకాలు ప్రశంసనీయం: గౌ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ.తిరుపతి, జూన్17 (ప్రజా అమరావతి):  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా గ్రామ్ స్వరాజ్ మరియు 75 సం. ల గ్రామీణ భారతం పై SV యూనివర్శిటీ మరియు AGRASRI, తిరుపతి వారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన చర్చా గోష్ఠిలో పాల్గొన్న గౌ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. 


శుక్రవారం సాయంత్రం ఎస్ వి యూనివర్శిటీ సెనేట్ హాల్ నందు ఏర్పాటు చేయబడిన పై అంశం పై చర్చా గోష్ఠి కార్యక్రమంలో శ్రీ బండారు దత్తాత్రేయ గారు ముఖ్య అతిథిగా పాల్గొనగా, సభాధ్యక్షులుగా శ్రీమతి శాంతా రెడ్డి, పూర్వపు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు,  ప్రొ. హుస్సేన్ అహ్మద్ SV యూనివర్శిటీ రిజిస్ట్రార్ గౌరవ అతిథిగా, ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రొ. వరదరాజన్ పూర్వపు కార్యదర్శి APSCHE, ఈ కార్యక్రమం ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. సుందర్ రామ్ పాల్గొన్నారు.


గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ నేడు మనం గమనిస్తే గ్రామీణ భారతమే భారత దేశ ఆత్మ అన్నారు. గ్రామాల నుండి ప్రజలు పట్టణాలకు వలసలు వెళ్తున్నారనీ, ఎందుకంటే అక్కడ వారికి ఉపాధి, విద్యా, వైద్యం రోడ్లు తదితర వసతులు లేకపోవడం వలన పట్టణాలకు వలస వెళ్తున్నారని అన్నారు. కానీ కోవిడ్ సమయంలో ప్రజలు పట్టణాల నుండి గ్రామాలకు వెళ్లారని గుర్తు చేశారు. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం గ్రామ అభివృద్ధి తోనే సాధ్యం అన్నారు. దీనిలో యువత కీలకమని అన్నారు. నేడు గ్రామీణ ప్రాంతాలలో పొదుపు సంఘాలు ప్రముఖమైనవని. దేశంలో సుమారు 73 లక్షల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని,  మన రాష్ట్రంలో 6.53 లక్షలు SHG లు  ఉన్నాయని వీటి ద్వారా బలీయమైన మార్పు తీసుకు రావొచ్చు అన్నారు.   కేంద్ర ప్రభుత్వ దీన్ దయాళ్ జీవనోపాదుల  మిషన్, అంత్యోదయ తదితర పథకాలు అమలు చేస్తోంది అన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం  ప్రతి ఇంటికి కొళాయి ద్వారా రక్షిత మంచి నీరు అందించడమే ప్రధానమంత్రి మోదిజి లక్ష్యం అన్నారు. వ్యవసాయంలో ఎంతో మార్పు రావాలి అని సేంద్రియ వ్యవసాయం ద్వారా ఎరువులు తగ్గించి రైతులకు ఆదాయం పెంపొందించే అవకాశం ఉందని అన్నారు. మహాత్మా గాంధీ ఆలోచనే గ్రామీణ ఇంటింటికి కుటీర పరిశ్రమ అని, గ్రామ అభివృద్ధి నుండే దేశ అభివృద్ధి ప్రారంభమవుతుంది అన్నారు. భారత దేశ అభివృద్ధికి యువ శక్తి ఎంతో అవసరమని,  విద్యార్థులలో మార్పు కనిపిస్తోందని, తాము స్వ శక్తితో పది మందికి ఉపాధి కల్పించే దిశగా ఆలోచించాలన్నారు.  గ్రామీణ ప్రాంతాలలో నైపుణ్య పెంపొందించే కార్యక్రమాల ద్వారా రోబోటిక్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తదితర కొత్త టెక్నాలజీ గ్రామీణ యువతను బలోపేతం చేయాలని కోరుతున్నాను అన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు నూతన విద్యా విధానం 2020 లో మోడీజీ గారు తీసుకొచ్చినవి విప్లవాత్మకమైనదని అన్నారు. మాతృ భాషలో చదువుకోవడం కి అవకాశం ఇచ్చిన కేంద్ర ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంగ్లీష్ మోజులో భారతీయ తత్వాన్ని మర్చిపోరాదు. జ్ఞానాన్ని ఎవరు దొంగిలించలేరనీ వారికి సమాజంలో గౌరవం ఉంటుందని తెలిపారు. యువత తమ చదువు విజ్ఞానాన్ని గ్రామీణ ప్రాంతాల్లో సేవలకు ఉపయోగించాలని, గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుందని హితవు పలికారు.


శాంతా రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం మార్చ్  21 న గుజరాత్ 75 వారాలు ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా వివిధ శాఖలు NGO లు ప్రజా భాగస్వామ్యంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్తూ, ఈ 75 సం. లలో భారతదేశం సాధించిన విజయాలు మరియు రాబోవు 25 సం. లలో సాధించాల్సిన శతాబ్ది ఉత్శవ విజయాలపై మేధో మధన కార్యక్రమాల, చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. 


సుందర్ రామ్ మాట్లాడుతూ ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా గ్రామ స్వరాజ్ మరియు 75 సం.  గ్రామీణ భారత్ కార్యక్రమం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి దేశ ప్రగతిలో ఎంతో ముఖ్య పాత్ర ఉందని తెలిపారు. పంచాయతీ రాజ్ శాఖ ఎన్నో చట్టాలు నిబంధనలు ఉన్నా ఈ 75 సం. లలో దేశంలో చాలా అంశాలలో గ్రామ పంచాయితీలు వెనుక బడి ఉన్నయనీ దీనిపై ఇంకా దృష్టి పెట్టాల్సి ఉందని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర స్థాయిలో తమ AGRASRI ద్వారా సహకారం అందిస్తామని తెలిపారు. 


ఎస్వీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ హుస్సేన్ మాట్లాడుతూ 75 సం. అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయనీ ఇవి దేశ పురోభివృద్ధికి సహకరించే విధంగా అన్ని అంశాలలో సంస్కరణలు చేసుకుంటూ ప్రజా సంక్షేమం మరియు దేశ అభివృధి కి దోహదం చేస్తోందని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉచ్చతర అభియాన్ పథకం ద్వారా A+ కేటగిరీ నుండి GOI నుండి 100 కోట్లు గ్రాంట్ మంజూరు అయిందని కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యా వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన వంటి కార్యక్రమాలు విద్యార్థుల హాజరు శాతం మరియు నమోదు పెరుగుటకు  ఎంతగానో దోహదం చేస్తుందని అన్నారు.


ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల సర్పంచ్ లు, యూనివర్సిటీ విద్యార్ధులు, సబ్జెక్టు నిష్ణాతులు, NGO లు, తదితరులు పాల్గొనారు.

Comments