ప్రశాంతంగా జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికలు

 *ప్రశాంతంగా జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికలు*


*•ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు*

*•సా.5 గం. 61.70% పోలింగ్ నమోదు, మొత్తం మీద 70% వరకు నమోదుకు అవకాశం*

*రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా*

అమరావతి, జూన్ 23 (ప్రజా అమరావతి): ఆత్మకూరు అసెంబ్లీ నియోజక వర్గ ఉపఎన్నికలలో చెదురు మదురు సంఘటనలు మినహా మొత్తం మీద ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో చక్కగా జరిగాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రతిఒక్కరికి ఆయన ధన్యవాదలు తెలిపారు. గురువారం అమరావతి సచివాలయంలో ఆత్మకూరు అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికలపై  ఆయన మాట్లాడుతూ మొత్తం 14 మంది అభ్యర్థులు ఈ ఉప ఎన్నికల్లో పోటీపడ్డారన్నారు. సాయంత్రం 6.00 గంటలకు రావాల్సిన తుది పోలింగ్ శాతం ఇంకా రాలేదని, సాయంత్రం 5.00 గంటలకు 61.70% పోలింగ్ నమోదు అయిందని, మొత్తం మీద 69 %  నుండి 70% వరకు  పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు.  ఉదయం 7.00 గంటలకు మాక్ పోల్ తదుపరి మొత్తం తొమ్మిది  (ఒక బి.యు., మూడు సి.యు., ఐదు వివిప్యాడ్) ఇ.వి.ఎమ్.లలో కొద్దిగా సాంకేతిక సమస్య ఏర్పడిందని, ఆ సమస్యను వెంటనే పరిష్కరించి అన్ని పోలింగ్ స్టేషన్లలో  వెంటనే పోలింగ్ ప్రారంభించడం జరిగిందన్నారు.  ఆత్మకూరులోని ఆంధ్రా ఇంజనీరింగ్ కళశాలలో రిసెప్టన్ సెంటర్ మరియు స్ట్రాంగ్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికలు పూర్తయిన తదుపరి ఇ.వి.ఎమ్.లను అన్నింటినీ పటిష్ట  పోలీస్ బందోబస్తు మధ్య అచ్చట భద్రపర్చజడం జరిగుతుందని ఆయన తెలిపారు. తొలుత 123 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను గుర్తించడం జరిగిందని, అయితే తాను వెళ్లి 131 పోలింగ్ కేంద్రాలను క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా ప్రకటించడం జరిగిందని ఆయన తెలిపారు.  ఆయా కేంద్రాల్లో సిసి కెమెరాలు, వెబ్ కాస్టింగ్ తో పాటు మైక్రో అబ్జర్వర్లను, సెంట్రల్ పోర్సెస్ ను పెద్దఎత్తున ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  వెబ్ పోర్టల్ సి-విజిల్ లో 38 పిర్యాధులు వచ్చాయని, వాటిపై  వెంటనే తగు చర్య తీసుకోవడం జరిగిందన్నారు.  ఈ ఉప ఎన్నికల్లో 1,339 మంది పోలింగ్  సిబ్బంది,  1,100 పోలీస్ సిబ్బంది మరియు 3 సెంట్రల్ ఫోరెర్స్ కంపెనీల సేవలను  వినియోగించుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. మొత్తం మీద ఉప ఎన్నికలు ఎంతో ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఆయన తెలిపారు.

  

Comments