శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
(ప్రజా అమరావతి); విజయవాడ నకు ఉపాలయమైన సీతానగరం, తాడేపల్లి(మo) లోని శ్రీ మద్ వీరాంజనేయ సహిత కోదండరామ స్వామి వార్ల దేవాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయము మరియు సుబ్రమణ్య స్వామి వారి ఆలయము యొక్క పునర్నిర్మాణం పూర్తి అయినందున పునః ప్రతిష్ట కార్యక్రమాలలో భాగంగా ఈరోజున శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయము మరియు సుబ్రమణ్య స్వామి వార్ల ప్రతిష్ట కార్యక్రమంనకు విశిష్ట అతిథిగా విచ్చేసిన గౌరవనీయులైన రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రివర్యులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారికి ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికినారు. తదనంతరం వేదమంత్రోచ్ఛరణలు మరియు మంగళ వాయిద్యముల నడుమ ఆలయ ప్రధానార్చకులు మరియు అర్చక సిబ్బంది శాస్త్రోక్తముగా పూజలు నిర్వహించి
శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారినీ మరియు సుబ్రమణ్య స్వామి వార్ల ప్రతిష్ట కార్యక్రమం శాస్త్రోక్తముగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం నందు గౌరవ మంత్రివర్యులు మరియు కార్యనిర్వహణాధికారి వారు పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రివర్యుల వారు విగ్రహ ప్రతిష్ఠ యొక్క శిలాఫలకమును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమము నకు గౌరవ దేవాదాయశాఖ కమీషనర్ డా.హరి జవహర్, IAS గారు విచ్చేసి స్వామి వార్లను దర్శించుకొని పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమం నందు ఆలయ కార్యనిర్వహణాధికారి వారితో పాటుగా ఆలయ నిర్మాణ దాత శ్రీ భాస్కరుని వెంకట రామచంద్రరావు గారు, SITA డైరెక్టర్ శ్రీ డి. రామచంద్ర రావు గారు, ఇంజినీరింగ్ అధికారులు ఆలయ సిబ్బంది మరియు భక్తులు విశేషముగా పాల్గొన్నారు.
addComments
Post a Comment