డి.సి.ఎం.ఎస్. చైర్మన్ల పదవీ కాలం మరో ఆరు మాసాలు పొడిగింపు

 *డి.సి.ఎం.ఎస్. చైర్మన్ల పదవీ కాలం మరో ఆరు మాసాలు పొడిగింపు*

అమరావతి,జూన్ 24 (ప్రజా అమరావతి): పాత 13 జిల్లాల డి.సి.ఎం.ఎస్. చైర్మన్ల పదవీ కాలాన్ని మరో ఆరు మాసాలు పొడిగించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన రెడ్డి అనుమతినిచ్చారు.  సంబందిత ఫైల్ ను మంత్రి ఆమోదిస్తూ శుక్రవారం అధికారులకు పంపారు. నిజానికి ఈ 13 జిల్లాలకు చెందిన చైర్మన్ల పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే మంత్రి ఆమోదంతో వీరి పదవీ కాలాన్ని మరో ఆరు మాసాలు పొడిగించిన నేపథ్యంలో వచ్చే ఏడాది  జవనవరి వరకూ  డి.సి.ఎం.ఎస్. చైర్మన్లుగా ప్రస్తుతం ఉన్నవారే కొనసాగుతారు. 


Comments