పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత



పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత*


*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*


*: జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల ఆవరణాల్లో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్*



పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా),  జూన్ 05 (ప్రజా అమరావతి):


*పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పుట్టపర్తిలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఆవరణంలో జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. అనంతరం స్థానిక ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల ఆవరణాల్లో కూడా జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు.*


*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ

అందరి సహకారంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని, నివాస, కార్యాలయ పరిసరాల్లో పచ్చదనాన్ని పెంపొందించి భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని  జిల్లా కలెక్టర్  

  తెలిపారుఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోందన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, అందుబాటులో ఉన్న ప్రకృతి వనరులను కలుషితం చేయకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ గంగాధర్ గౌడ్, ఆర్డీఓ భాగ్యరేఖ, తహసీల్దార్ భాస్కర్ నారాయణ మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో ఆయా కార్యాలయాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.*



Comments