గిరిజనులు మాతృభాష ద్వారానే విద్యనభ్యసించేందుకు ఆరు గిరిజన భాషల్లో వాచకాలు

 *గిరిజనులు మాతృభాష ద్వారానే విద్యనభ్యసించేందుకు ఆరు గిరిజన భాషల్లో వాచకాలు


*

*•మాతృభాష ద్వారా తెలుగు తద్వారా ఆంగ్లంపై పట్టుసాదించేందుకు దోహపడే వాచకాలు*

*•విద్యపై దృష్టినిమళ్లించి గిరిజనులనుసాధారణ జనజీవనస్రవంతిలోకి తేవడమే ప్రధాన లక్ష్యం*

*ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర*

అమరావతి,జూన్ 24 (ప్రజా అమరావతి): గిరిజనులు తమ మాతృ భాష ద్వారానే విద్యను అభ్యసించేందుకు వీలుగా ఆరు గిరిజన భాషల్లో రూపొందించిన వాచకాలను (Foundational Primers) ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్బంగా శుక్రవారం అమరావతి సచివాలయం పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం విద్యా రంగంలో విష్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి పలు వినూత్న పథకాలను అమలు చేయడం జరుగుచున్నదన్నారు. అయితే ఎక్కువ శాతం నిరక్షరాశ్యులుగా ఉన్న గిరిజనులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారన్నారు. విద్యాబ్యాస విషయంలో సహజంగా గిరిజనుల్లో నెలకొన్న భయాన్ని తొలగించేందుకు, వారి మాతృ భాష అయిన సవర, సుగాలి, ఆదివాసి ఒరియా, కొండ, కువి, కోయ భాషల్లోనే నిర్బయంగా వారు విద్యను అభ్యశించేందుకు వీలుగా ఈ వాచకాలను రూపొందించడం జరిగిందన్నారు. గిరిజనుల దృష్టిని ఆకర్షించేందుకై వారి సంస్కృతి, సాంప్రదాయాలు, అచార, వ్యవహారాలు ప్రతిబింబించే విధంగా ఈ వాచకాలు  రూపొదించడం జరిగిందన్నారు. గిరిజనులు తమ మాతృభాష ద్వారా  తెలుగుపై  తద్వారా ఆంగ్ల బాషపై పట్టుసాదించేందుకు వీలుగా ఈ వాచకాలను రూపొందించడం జరిగిందన్నారు. ఈ విద్యా బోధన మూడు సెమిష్టర్లలో సాగుతుందన్నారు. విద్యా రంగంలో  వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను ఆకళింపు చేసుకునేందుకు ఈ వాచకాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. మైదాన ప్రాంతాలకు  దూరంగా ఉండే గిరిజనుల దృష్టిని విద్యపై మళ్లించి వారిని సాధారణ జనజీవన స్రవంతిలోకి  తీసుకురావాలనే సత్ సంకల్పంతో ఈ వాచకాలను  ప్రభుత్వం రూపొదించడం జరిగిందన్నారు. గిరిజనులను విద్యావంతులను, ప్రయోజకులను చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. 

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ  కార్యదర్శి  కాంతీలాల్ దండే మాట్లాడుతూ  గిరిజన ప్రాంతాల్లోని చిన్న పిల్లలకు మాతృభాషలోనే విద్యాభోదన చేయాలనే ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఈ వాచకాలను తయారు చేయడం జరిగిందన్నారు. ఎస్.సి.ఇ.ఆర్.టి. సౌజన్యంతో  విద్యా శాఖ మరియు గిరిజన శాఖలోని టి.సి.ఆర్. అండ్ టి.ఎం. (Tribal Cultural Research & Training Management) విభాగం మూడు వర్కుషాప్ లను నిర్వహించి సంబందిత భాషల  రిసోర్సు పెర్సన్లు మరియు ఆయా భాషలు మాట్లాడే వారి అభిప్రాయాలను స్వీకరించి సవర, సుగాలి, ఆదివాసి ఒరియా, కొండ, కువి మరియు కోయ భాషల్లో భాషా వాచకాలను తయారు చేయడం జరిగిందన్నారు. గిరిజనులు తొలుత తెలుగు భాష లో ప్రావీణ్యం పొంది తద్వారా ఆంగ్ల భాషపై పట్టు సాదించే విధంగా ఈ  వాచికాలను  రూపొందించడం జరిగిందన్నారు. 

 

Comments