ఉన్నది ఒక్కటే భూమి నేటి ప్రపంచ పర్యావరణ నినాదం
పర్యావరణ పరిరక్షణ మనిషికి అదే రక్షణ
ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలను నాటి వాటిని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది: విద్యుత్తు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి
పర్యావరణాన్ని పరిరక్షంచుటకు ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారు: ఉపముఖ్యమంత్రి& ఎక్సైజ్ శాఖ మంత్రి
తిరుపతి జూన్05 (ప్రజా అమరావతి) :
ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుపతి బాలాజీ డైరీ లో జరిగిన పర్యావరణ దినోత్సవం కార్యక్రమంలో ఇంఛార్జి మంత్రి మరియు ఉపముఖ్యంత్రి శ్రీ కే నారాయణస్వామి మరియు ఇంధన, అటవీ, పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పీసీబీ మెంబర్ సెక్రెటరీ శ్రీ విజయ్ కుమార్, తదితరులు.
ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ క్షీణిస్తున్న పర్యావరణానికి కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటితే అవి మనలను కాపాడుతాయి అని మన రాష్ట్ర ముఖ్య మంత్రి పర్యావరణాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నారని తెలిపారు.
మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..
నేడు ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాం.
ఇది ఒక తంతుగా కాకుండా, ప్రతి ఒక్కరూ పర్యావరణానికి తోడ్పడాలి ఇది అందరూ ఒక నియమంగా పెట్టుకోవాలి అని సూచించారు.
ఇప్పుడు ప్రతి అంశంలో కాలుష్యం కనిపిస్తుంది, ఆ పరిస్థితి పోవాలంటే స్వయంగా మనం బాధ్యత తీసుకోవాలని
చెవిరెడ్డి భాస్కరరెడ్డి లక్షల మొక్కలు పంపిణీ చేశారనీ, వాటిని మనం కాపాడుకుంటే పర్యావరణంకి మంచి చేస్తుందని అన్నారు.
తిరుమల లోకి ప్లాస్టిక్ తీసుకెళ్లకుండా TTD వారు చర్యలు చేపట్టారు.
కనీసం 30 శాతం కాలుష్యం తగ్గించాలని ప్రభుత్వం కృషి చేస్తుందనీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
గత ఏడాది ఉపాధి హామి ద్వారా కోటి మొక్కలు పంపిణీ చేసి, వాటి సంరక్షణకు కూడా నిధులు ఇచ్చామని
సిఎం శ్రీ వైయస్ జగన్ గారి ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా కోటి మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుంది అని తెలిపారు.రెడ్, ఆరేంజ్ క్యాటగిరి పరిశ్రమలపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ ఉండాలి అని వాటి ఆవరణలో మొక్కలు విరివిగా నాటాలని తెలిపారు. పట్టణాలతో పాటు, కాలుష్యం కూడా పెరుగుతుంది
పరిశ్రమల్లో కూడా పూర్తి స్థాయిలో ప్లాంటేషన్ పై అధికారులు దృష్టి సారించాలి
రాబోయే రోజుల్లో కాలుష్య నివారణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని,ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి మాట్లాడుతూ ఈ విశ్వంలో ఏలాంటి ప్రత్యామ్నాయం లేనిది ఈ పుడమి తల్లి అని పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు.
శ్రీ విజయకుమార్ మెంబర్ సెక్రటరీ AP కాలుష్య నియంత్రణ మండలి మాట్లాడుతూ సుస్థిర పాలన లక్ష్యాల సూచికలో ఈ అంశం ప్రముఖమైనది అన్నారు.
అనంతరం మంత్రులు అందరితో ప్రతిజ్ఞ చేయించి కాలుష్య నియంత్రణ మీద బ్రోచర్ విడుదల చేశారు.
సమావేశానికి ముందుగా మంత్రులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.
addComments
Post a Comment