విజయవాడ (ప్రజా అమరావతి);
ఉపాధ్యాయుల బదిలీలు నిమిత్తం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నెం. 117 ప్రకారం రేషనలైజేషన్ ప్రక్రియ ప్రకారం రాష్ట్రమంతటా బదిలీల విధానం అమలు జరుగుతున్నట్లు పాఠశాల విద్యా కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం కేటగిరి వారీగా ఎన్ని ఉద్యోగ పోస్టులు అదనంగా అవసరత కలిగి ఉంటుందో వాటి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని కమిషనర్ స్పష్టం చేసారు. కొన్ని మాధ్యమాలలో ప్రచురించిన రీతిగా జరగడం సత్యదూరమన్నారు. ప్రభుత్వం జాతీయ విద్యా విధానంను అనుసరించి బదిలీ ప్రక్రియ మొత్తం ఆన్ లైన్ ద్వారా పారదర్శకంగా జరుగుతుందని, అలాగే ఉపాధ్యాయుల పదోన్నతులు మరియు బదిలీల ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు.
addComments
Post a Comment