రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 13 నుండి 15 వరకూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం
• ఈమూడు రోజులు ప్రతి ఇల్లు,కార్యాలయంపై మువ్వన్నెల జెండా ఎగరాలి
• ప్రతి ఇంటికీ జాతీయ జెండాను పంపిణీ చేయాలి-స్థానికంగాను సమకూర్చుకోవాలి
• విద్యార్ధినీ విద్యార్ధులు,ఎన్సిసి,స్కౌట్స్ అండ్ గైడ్స్ పెద్దఎత్తున భాగస్వాములు కావాలి
• ఉద్యోగ,వ్యాపార,ఎన్జిఓ తదితర అన్నిసంఘాలు దీనిలో భాగస్వాములవ్వాలి
• హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించాలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ
అమరావతి,29 జూలై (ప్రజా అమరావతి):ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆగస్టు 13 నుండి 15 తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా(ఇంటింటా మువ్వన్నెల జెండా)కార్యక్రమాన్ని ప్రజలందరి భాగస్వామ్యంతో విజయవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సంబంధిత శాఖల కార్యదర్శులను ఆదేశించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై శుక్రవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు నుండి ఆయన సంబంధిత శాఖల కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించి చేపట్టనున్న ఏర్పాట్లను సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ డా.సమీర్ శర్మ మాట్లాడుతూ ఆగస్టు 13 నుండి 15 వరకూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కింద ప్రతి ఇంటిపైన ప్రతి కార్యాలయం,ప్రతి భవనం పైన మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని చెప్పారు.ఇందుకు గాను కోటి 42 లక్షల జాతీయ జెండాలు అవసరం ఉంటుందని కేంద్రానికి తెలియజేయగా కేంద్రం నుండి 40 లక్షల వరకూ సరఫరా కానుండగా 16 X 21 సైజు అంగుళాల పరిమాణంతో కూడిన మరో 30 లక్షలు జెండాలను మెప్మా,10 లక్షల జెండాలను సెర్ప్ ఆధ్వర్యంలో సిద్ధం కానున్నాయని పేర్కొన్నారు.అదే విధంగా అటవీ శాఖ ద్వారా 80 లక్షల జెండా కర్రలు(ఫ్లాగ్ స్టిక్స్) సరఫరా కానున్నాయని సిఎస్ చెప్పారు.ఇంకా అవసరమైన మువ్వన్నెల జెండాలను వివిధ స్వచ్ఛంద సంస్థలు,లయన్స్,రోటరీ క్లబ్,ఇతర సంఘాలా ద్వారా సమకూర్చుకునేందుకు వీలుగా ఆయా సంఘాలు,సంస్థలకు లేఖలు వ్రాసి వారిని భాగస్వాములను చేసి కార్యక్రమం విజయవంతానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవను సిఎస్ డా.సమీర్ శర్మ ఆదేశించారు.
అదే విధంగా పాఠశాలు,కళాశాలు,విశ్వవిద్యాలయాలు,ఎన్సిసి,ఎన్ఎస్ఎస్,స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్ధులను ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పెద్దఎత్తున భాగస్వాములను చేసి విజయవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను సిఎస్ డా.సమీర్ శర్మ ఆదేశించారు.స్వచ్చంధ సంస్థలు,ఉద్యోగ సంఘాలు,ఇండియన్ మెడికల్ అసోసియేషన్,బార్ అసోసియేషన్లు,ఫిక్కి,ఎపిఐఐసి,పరిశ్రమలు,వ్యాపార,వాణిజ్యం వంటి సంస్థలన్నిటిలోను ఈకార్యక్రమంలో భాగస్వాములను చేసి జాతీయ జెండాలను సమకూర్చేలా వారి సహకారాన్ని కూడా తీసుకోవాలని సూచించారు.హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారుల నుండి యాక్షన్ టేకెన్ నివేదికను తీసుకోవాలని సాంస్కృతిక శాఖ స్పెషల్ సిఎస్ రజత్ భార్గవను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ఆదేశించారు.
వీడియో లింక్ ద్వారా ఈసమావేశంలో పాల్గొన్న రాష్ట్ర సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి సంబంధించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వీలుగా ఆగస్టు 1నుండి 15 వరకూ రాష్ట్ర,జిల్లా స్థాయిల్లో పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్టు వివరించారు.ఆగస్టు 1న అన్ని గ్రామ,వార్డు సచివాలయాల పరిధిలో ప్రజలకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదే విధంగా ఆగస్టు 2న త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందున్నారు.3వ తేదీన స్వాతంత్ర్య సమరయోధులు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక సెమినార్లు,4వతేదీన పాఠశాలల,కళాశాలల,విశ్వ విద్యాలయాల విద్యార్ధినీ విద్యార్ధులకు దేశభక్తి గేయాలపై పోటీలను నిర్వహించనున్నట్టు తెలిపారు.ఆగస్టు 5వతేదీన రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ,విశాఖపట్నం,తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో దశభక్తి పూరిత డ్రామ,ఏకపాత్రాభినయాలను నిర్వహించనున్నట్టు రజత్ భార్గవ సిఎస్ కు వివరించారు.6వ తేదీన దేశభక్తి అంశపై ప్రత్యేక ఎగ్జిబిషన్లను,7వతేదీన ఊరేగింపులను,8వతేదీన డ్రాయింగ్, పెయింటింగ్,చర్చ మరియు వ్యక్తృత్వ పోటీలను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.ఆగస్టు 9వతేదీన దేశభక్తి పూరిత అంశంపై సాంస్కృతిక కార్యక్రమాలు,10వతేదీన పోస్టర్ మేకింగ్, జింగిల్స్ తదితర అంశాలపై పోటిలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.అదే విధంగా 11వతేదీన హెరిటేజ్ వాక్ ను,12వ తేదీన వివిధ క్రీడా పోటీలను,13వ తేదీన జాతీయ జెండాతో సెల్పీ(To be pinned in https://harghartiranga. com)కార్యక్రమంతో పాటు విజయవాడలో చిన్నారులు,కళాకారులు,ప్రజలతో కలిసి 3 కి.మీల పొడవున జాతీయ జెండా ప్రదర్శన జరుగుతుందని పేర్కొన్నారు.ఆగస్టు 14వతేదీన స్వాతంత్ర్య సమరయోధుల ఇంటికి నడక కార్యక్రమం,స్వాతంత్ర్య సమరయోధులు వారి కుటుంబ సభ్యులకు సన్మాన కార్యక్రమాన్ని, ఆగస్టు 15వతేదీన జాతీయ జెండా ఆవిష్కరణ పాదయాత్రలు మరియు ప్లాగ్ మార్చ్ లను వంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్టు స్పెషల్ సిఎస్ రజత్ భార్గవ సిఎస్ సమీర్ శర్మకు వివరించారు.
అంతేగాక హర ఘర్ తిరంగా కార్యక్రమంపై ప్రతి ఒక్కరిలోను అవగాహన పెంపొందేలా విద్యాశాఖ ద్వారా ఆగస్టు 13 నుండి 15 వరకూ ప్రతి విద్యా సంస్థలో ప్రభాత్ ఫెర్రీలు(ఉదయపు నడక)నిర్వహించనున్నారని స్పెషల్ సిఎస్ రజత్ భార్గవ వివరించారు.అలాగే వందే మాతరం, రఘుపతి రాఘవ రాజారాం వంటి దేశభక్తి పూరిత గేయాలాపన,ఆగస్టు 2నుండి తిరంగా గీతాన్ని లౌడ్ స్పీకర్ల ద్వారా వినిపించే ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు.ఆగస్టు 11 నుండి 15 వరకూ జిల్లా కలక్టర్లు,మున్సిపల్ పరిపాలన,ఆర్కియాలజీ శాఖల ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహ ప్రాంగణాలు,ముఖ్యమైన స్థలాలు(Land Marks) మరియు చారిత్రక కట్టడాలు,స్మారక కట్టడాల ప్రాంతాల్లో స్వచ్చాగ్రహ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు ఆయన వివరించారు.సమాచారశాఖ ద్వారా ప్రభుత్వ వెబ్ సైట్లు,టివిలలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై ప్రచార కార్యక్రమాలు,ధియేటర్లలో లఘ డాక్యుమెంటరీలు,జింగిల్స్ ప్రసారం, ప్రముఖ ప్రదేశాల్లో హోర్డింగ్లు,బ్యానర్లు ఏర్పాటు తోపాటు గోడలపై రాతలు,పత్రికల్లో ప్రత్యేక ప్రకటనలతో పాటు కధనాలు,ప్రచురణ వంటి చర్యలు తీసుకోనున్నారని వివరించారు.అదే విధంగా ప్రజా రవాణా శాఖ ద్వారా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై అన్నిబస్సులపై ప్రత్యేక పెయింటింగ్ లు వేసి ప్రజల్లో అవగాహన కల్పించనున్నారని స్పెషల్ సిఎస్ రజత్ భార్గవ సిఎస్ డా.సమీర్ శర్మకు వివరించారు.
ఈసమావేశంలో సెర్ప్ సిఇఓ ఇంతియాజ్ పాల్గొనగా వీడియో లింక్ ద్వారా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వై.శ్రీలక్షి,అజయ్ జైన్,పిసిసిఎఫ్ వై.మదుసూధన్ రెడ్డి,సమాచారశాఖ కమీషనర్ టి.విజయకుమార్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment