వచ్చే ఆగస్టు మాసం 15వ తేదీ నాటికి కనీసం 10 గోదాముల నిర్మాణం పూర్తి చేయాలి

 


నెల్లూరు, జులై 28 (ప్రజా అమరావతి):--వచ్చే ఆగస్టు మాసం 15వ తేదీ నాటికి కనీసం 10 గోదాముల నిర్మాణం పూర్తి చేయాల


ని జిల్లా కలెక్టర్ బాబు శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. 


గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో మల్టీపర్పస్ ఫెసిలిటీ కేంద్రాల పై జిల్లా స్థాయి అమలు కమిటీ సమావేశం నిర్వహించారు. 


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పరిధిలో మల్టీపర్పస్ వసతుల కేంద్రాలుగా 48 గోదాములను నిర్మించాల్సి ఉందన్నారు.  అందులో ఇప్పటికే 47 గోదాముల నిర్మాణ చేపట్టడం జరిగిందని, వాటిలో కనీసం 10 గోదాముల నిర్మాణం వచ్చే ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలన్నారు.  ఇంకా నిర్మాణం మొదలు కానీ అల్లూరులో వెంటనే స్థలం ఎంపిక చేసి గోదాము నిర్మాణం పనులు ప్రారంభించాలన్నారు.   ఇప్పటివరకు జరిగిన వివిధ దశల గోదాముల నిర్మాణ పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపుకు కమిటీ ఆమోదించినందున వెంటనే  పైకం చెల్లించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. 


ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి శ్రీ తిరుపాల్రెడ్డి ,నాబార్డ్ డీడీఎం శ్రీ రవి సింగ్, డిసిసిబి డిజిఎం శ్రీ దయాకర్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ ఏడి  శ్రీమతి అనిత కుమారి, డి.ఈ. శ్రీ  నారాయణరావు తదితర  అధికారులు పాల్గొన్నారు. 

Comments